వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

హుజూర్‌నగర్‌లో గెలుపు మాదే..! ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి

September 21, 2019

రాష్ట్రంలో ఉప ఎన్నిక తేదీ వెలువడిన వెంటనే టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిని ప్రకటించగా, కాంగ్రెస్‌ ‌విమర్శలు కురిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ హుజూర్‌నగర్‌ ‌టికెట్‌ ఆం‌ధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇచ్చిందని కాంగ్రెస్‌ ‌నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో 30 వేల మెజార్టీతో కాంగ్రెస్‌ ‌గెలవబోతుందని జోస్యం చెప్పారు. నియోజకవర్గంలో జరిగిన ప్రతీ అభివృద్ధి కాంగ్రెస్‌ ‌హయాంలో జరిగిందేనన్నారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం హుజూర్‌నగర్‌కు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. నియోజకవర్గంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులతో టీఆర్‌ఎస్‌ ‌రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.రాష్టాన్ని్ర బంగారు తెలంగాణ చేస్తానని కేసీఆర్‌ ఆరేళ్ల పాలనలో భ్రష్టు పట్టించారని జానారెడ్డి ధ్వజమెత్తారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి కేసీఆర్‌ ‌నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలను కోరారు. ఉప ఎన్నిక రాష్టాన్రికి మార్గదర్శకం కావాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు.