Take a fresh look at your lifestyle.

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఇప్పట్లో లేనట్టే

రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు నిర్ణయం తీసుకున్న ఇసి
ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వని ఎన్నికల సంఘం

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఇప్పట్లో లేనటేన్నది స్పష్టమవుతున్నది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగాల్సిన రెండు ఉప ఎన్నికలను దసరా తరువాతనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆయా ప్రభుత్వాల వినతి మేరకు ఇసి ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై ఈసీ స్పందిస్తూ దసరా తర్వాతే ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పండగల సీజను ముగిశాకే ఉప ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని వెల్లడించింది. అక్టోబర్‌ ‌లేదా నవంబర్‌లో ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఏపీలోని బద్వేల్‌ ఉప ఎన్నిక కూడా దసరా తర్వాతే ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉప ఎన్నికను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కూడా కోరినట్లు వెల్లడించింది. అయితే బెంగాల్లో మాత్రం ఎన్నికలకు పచ్చజెండా ఊపింది. ఈ నెల 30న బంగాల్‌లోని భవానీపూర్‌, ‌జంగీపూర్‌, ‌శంషేర్‌గంజ్‌ ‌స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. అదే రోజున ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు ఇప్పట్లో జరిగే పరిస్థితులు లేవని మొదట్నుంచి వార్తలు వొస్తున్న విషయం తెలిసిందే. అనుకున్నట్లుగానే కొరోనా కారణంగా ఉపఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ ‌పేర్కొంది. అయితే మళ్లీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయ్‌..? అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌తో రాష్ట్రంలో రాజకీయ సవి•కరణాలు మారిపోయాయి. అనంతర పరిణామాలు, సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించిన దళిత బంధు సహా ఇతర ప్రభుత్వ పథకాల ప్రకటనల ఎత్తుగడలు, ప్రతిగా విపక్షాల విమర్శలతో పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కొంత ఆలస్యంగా జరిగితే, అక్కడ రాజకీయంగా తమకు ప్రయోజనం కలుగుతుందని టీఆర్‌ఎస్‌ ‌ముఖ్యులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆగస్టు 30 లోపు పలు రాష్ట్రాల్లో జరగాల్సిన ఉపఎన్నికలు, 5 రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలపై అభిప్రాయాలు తెలియజేయాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌.. ‌రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరిన విషయం విదితమే. ఇలా అన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ‌నుంచి వొచ్చిన సమాచారాన్ని పూర్తిగా పరిశీలించిన అనంతరం సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.  

 

Leave a Reply