Take a fresh look at your lifestyle.

స్వామివారికి కల్యాణానికి భక్తులకు అనుమతి లేదు

నిత్యకల్యాణం మండపంలోనే కల్యాణ మహోత్సవం

భద్రాచలం శ్రీస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం 21వ తేది బుధవారం నాడు, మహాపట్టాభిషేకం 22వ తేదీన జరుగనుంది. కోవిడ్‌ ‌నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల జారీ చేసింది. అంతరంగికంగానే కల్యాణం నిర్వహించాలని కోరింది. దీనితో నిత్యకల్యాణం మండపం వద్దనే స్వామివారికల్యాణం నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కల్యాణానికి భక్తులకు అనుమతి లేదని తెలిపింది. కేవలం కొద్దిమంది సిబ్బంది సమక్షంలోనే స్వామివారి కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తుల రద్దీపై పరిస్థితుల దృష్ట్యా, భక్తుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని 21,22 తేదీలు రెండు రోజుల పాటు ఆలయంలో జరిగే శ్రీ స్వామివారి అన్ని రకముల దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు. అలాగే అనుబంధ ఆలయమైన పర్ణశాల దేవాలయం నందు కూడ కోవిడ్‌ ‌నిబంధనల ప్రకారమే స్వామివారి కల్యాణ ఉత్సవాలు నిర్వహించబడతాయని దేవస్థానం ఈఓ శివాజీ తెలిపారు.

Leave a Reply