తెలంగాణలో 4826 నమోదు
32 మంది మృతి చెందినట్లు వెల్లడి
హైదరాబాద్,మే8:తెలంగాణలో కొరోనా కేసులు స్వల్పంగా తగ్గుతున్నాయి.. రోజువారి కేసులు అయిదు వేలకు అటు ఇటుగా ఉంటున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4826 కొరోనా కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ నివేదిక విడుదల చేసింది. అలాగే కొరోనాతో 32 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం 5.02 లక్షల కొరోనా కేసులు నమోదవగా.. 2771 మంది మృతి చెందారు.
తెలంగాణలో ప్రస్తుతం 62,797 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 723 కొరోనా కేసులు నమోదవగా.. రంగారెడ్డి 302,, మేడ్చల్ 324, నల్గొండ జిల్లాలో 295 కేసులు, వరంగల్ అర్బన్ 242, కరీంనగర్ జిల్లాలో 207 కేసులు, నాగర్‌కర్నూలు 208, సిద్దిపేట 161, మహబూబ్‌నగర్ జిల్లాలో 126 కేసులు నమోదయ్యాయి.