Take a fresh look at your lifestyle.

స్వచ్ఛ మెదక్‌ ‌లక్ష్యంగా పని చేయాలి

  • రైతు వేదికల నిర్మాణానికి ఇసుక ఉచితం
  • అధికారులందరూ క్షేత్ర పర్యటనలు జరిపి ఫొటోలు పంపాలి
  • మెదక్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌ధర్మారెడ్డిని అభినందించిన మంత్రి హరీష్‌ ‌రావు

మెదక్‌ ‌జిల్లాను పారిశుద్ధ్యం విషయంలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచేలా స్వచ్ఛ మెదక్‌ ‌లక్ష్యంగా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావుఅన్నారు. సోమవారం సిద్దిపేట నుంచి మెదక్‌ ‌జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌మెదక్‌ ‌జిల్లాలోని ఆయా మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు,ఏఈవోలతో టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న వైకుంఠధామాలు, రైతు వేదికలు, డంపుయార్డులు, రైతు కల్లాల గురించి అడిగి తెలుసుకొన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో డంప్యార్డు, గ్రేవ్‌ ‌యార్డుల నిర్మాణాలు జరగాలని దీంతో పాటు వర్మి కంపోస్టు తయారు చేయించాలని ప్రజాప్రతినిధులు, అధికారులను మంత్రి హరీష్‌ ‌రావు సూచించారు .

వైకుంఠధామాలు, డంప్యార్డులు, రైతువేదికల నిర్మాణాలను ఈనెల 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని అయితే జిల్లా యంత్రాంగం నుంచి అన్ని విధాలుగా సహయ సహకారాలు ఉన్నప్పటికీ వాటి నిర్మాణాల్లో జాప్యం జరుగుతుందన్నారు. ఈ విషయంపై ఎవరినీ ఉపేక్షించేదిలేదన్నారు. మెదక్‌ ‌జిల్లాలోని కొన్ని మండలాల్లో పనులు పురోగతి బాగుందని మరికొన్ని మంవలల్లోఆ చాలా వెనుకబడి ఉన్నారని ఒకరిద్దరు సర్పంచ్లతో జిల్లా వెనుకబడితే ఉపేక్షించేదిలేదని సర్పంచ్ను తొలగించైనా పనులను పూర్తి చేయిస్తామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గ్రామాల్లో చేపట్టబోయే అభివృద్ది పనులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని పనులు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో నిలిచిపోరాదన్నారు. మెదక్‌ ‌జిల్లాలోని గ్రామాల్లో రైతువేదికల నిర్మాణాలను ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయించాల్సిన బాధ్యత సంబంధిత ఏఈవోలదేనని మంత్రి హరీష్‌ ‌వివరించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతిరోజు సైట్‌ ‌వద్దకు వెళ్లి పనుల పురోగతిని ఫొటోల రూపొలో నివేదికలను ఎప్పటికప్పుడు మండల వ్యవసాయ శాఖ అధికారి (ఏవో)లకు పంపించాలని తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్ర పరిధిలో పర్యటించాలని నిర్ణీత గడువు లోగా గ్రామాల్లో రైతువేదికల నిర్మాణాలు పూర్తి చేయాల్సిందేనని మంత్రి సూచించారు. ఈనెల 31వ తేదీ గడువులోగా రైతు వేదికల నిర్మాణాలు పూర్తి కానట్లయితే సంబంధిత ఏఈవోలపై చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా యుద్దప్రాతిపదికన, వేగవంతంగా ఆయా నిర్మాణాలు పూర్తి చేసి జిల్లాను దేశంలోనే మొదటి స్థానంలో ఉంచాలని మంత్రి హరీష్రావు కోరారు.

మెదక్‌ ‌జిల్లాను స్వచ్ఛ మెదక్‌ ‌లక్ష్యంగా పని చేయాలని దీనికి ఆయా మండలాల ఎంపీడీవోలు, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీవోలు ప్రత్యేక చొరవ తీసుకొని నిర్ణీత సమయంలోగా పనులను పూర్తి చేయాలన్నారు. ఏదైనా గ్రామాల్లో పనులు నెమ్మదిగా జరుగుంటే రాత్రి పూట కూడా పనులు చేయించి పూర్తి చేయాలని లేనట్లయితే వారిపై చర్యలు తప్పవని మంత్రి హరీష్‌ ‌హెచ్చరించారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, డంప్‌ ‌యార్డులు, రైతు వేదికల పనులు జరిగేలా చూసే బాధ్యత ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలదేనని అన్నారు. అనుకున్న లక్ష్యం పూర్తయ్యే వరకు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి అధికారులకు సూచించారు. అలాగే ప్రతి గ్రామంలో తడి, పొడి చెత్త వేరు చేయడానికి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వేరు చేసిన తడి, పొడి చెత్తను డంపింగ్‌ ‌యార్డులోకి చేర్చాలని దీనికి సంబంధించి ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, వాటర్‌ ‌ట్యాంకర్లను అందించామన్నారు. ప్రతిరోజూ చెత్త ఇవ్వని, పట్టణంలో చెత్త బయట పడేసే ప్రదేశాలు, చెత్త పడేసిన ఆ ప్రాంత వాసులను గుర్తించి వారికి జరిమానాలు విధించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి హరీష్‌ అధికారులను ఆదేశించారు.టెలీకాన్ఫెరెన్స్ ‌లో పలువురు ప్రజా ప్రతినిధులు ,పంచాయతి సెక్రటరీ ల ,ఎం పి డి ఓ ,ఎం పి ఓ సర్పంచ్‌ ‌లు టెలికాన్ఫరెన్స్ ‌లో గ్రామాలలో జరుగుతున్నా పనులు గురించి అడిగి తెలుసుకొన్నారు. పనులు చేసిన వాటికి సకాలంలో బిల్లులు వస్తాయని నిధులకు ఎలాంటి కొరతలేదని మంత్రి హరీష్రావు తెలిపారు. రైతు వేదికల నిర్మాణాలు పూర్తి కావాలంటే ఇసుక కొరత ఉందని వాటిని పూర్తి చేసేందుకు ఇసుకను ఉచితంగా అందచేయడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. మెదక్‌ ‌జిల్లాను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు జిల్లా కలెక్టర్‌ ‌ధర్మారెడ్డి ఎంతో కష్టపడుతున్నారని ఈ సందర్భంగా ఆయనను మంత్రి హరీష్‌ ‌రావు అభినందించారు.

దీనికి జిల్లా కలెక్టర్తో పాటు తాను సైతం ఆకస్మికంగా తనిఖీలు చేపడతామని మంత్రి హరీష్‌ ‌స్పష్టం చేశారు మెదక్‌ ‌జిల్లాను ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో స్వచ్ఛ మెదక్గా గుర్తించాలన్నారు. మెదక్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌ధర్మారెడ్డి మాట్లాడుతూ మెదక్‌ ‌జిల్లాను పారిశుద్ధ్యం విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో అనుకున్నంత మేర సెగిగ్రేషన్‌ ‌షెడ్స్ (‌డంపింగ్‌ ‌యార్డులు) పూర్తయ్యాయని… ఈనెల 10న వంద శాతం పూర్తి చేయడం జరుగుతుందన్నారు. తడి, పొడి చెత్తను ఇంటి వద్దనే వేరు చేయడం విషయంలో గ్రామాల్లో ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రతి గ్రామంలో తడి, పొడి చెత్త వేరు చేయడానికి ప్రజలకు అవగాహన కల్పించాలని, అలా వేరు చేసిన తడి, పొడి చెత్తను డంపింగ్‌ ‌యార్డులలో చేర్చాలన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను అందించామని పేర్కొన్నారు. తడి, పొడి చెత్త వేరు చేయడంలో దేశానికి మెదక్‌ ‌జిల్లా ఆదర్శంగా నిలవాలని కలెక్టర్‌ ‌పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కలిసికట్టుగా పని చేయాలని కలెక్టర్‌ ‌ధర్మారెడ్డి కోరారు. టెలీ కాన్ఫరెన్స్లో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మాట్లాడుతూ తన స్వగ్రామమైన హవేళి ఘనపూర్‌ ‌మండలం కూచన్పల్లిలో సొంత డబ్బులతో రైతు వేదిక నిర్మించేందుకు గతంలోనే హామీ ఇచ్చానన్నారు. పనులు కూడా పూర్తి చేయనున్నట్లు వివరించారు. ఈ విషయమై మంత్రి హరీష్రావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి తన సొంత నిధులతో రైతువేదిక నిర్మించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్లో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి దుబ్బాక , అందోల్‌, ‌నారాయణఖేడ్‌ ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, చంటి క్రాంతికిరణ్‌, ‌భూపాల్రెడ్డి, జిల్లా జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌నగేష్‌, ‌డీఆర్డీవో శ్రీనివాస్‌, ‌డీపీవో హనోక్‌, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply