Take a fresh look at your lifestyle.

స్నానానికి వెళ్లి నలుగురు చిన్నారులు దుర్మరణం

మృతులంతా అన్నదమ్ముల పిల్లలేఈత సరదా నలుగురి చిన్నారుల ప్రాణం తీసింది. అభం శుభం తెలియని ఆ నలుగురు చిన్నారులు అత్తింటికి వచ్చి ప్రాణాలు కోల్పోయారు. ఈ దురదృష్టకర సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలో చోటు చేసుకుంది. పటాన్‌చెరు డిఎస్పి రాజేశ్వరరావు, సీఐ నరేష్‌ ‌తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ నగర్‌ అల్వాల్‌ ‌ప్రాంతానికి చెందిన గోవర్ధన్‌, ‌విష్ణువర్ధన్‌, ఆనంద్‌, ‌నందిని, దివ్యలు రుద్రారంలో నివాసం ఉంటున్న అత్తమ్మ ఇంటికి సోమవారం సాయంత్రం చుట్టపుచూపుగా వచ్చారు. రుద్రారం గ్రామానికి చెందిన అత్తమ్మ భర్త సాంబయ్య డ్రైవర్‌గా పని చేయటం ఆయన భార్యకు ఈ పిల్లలు సమీప బంధువులు కావటంతో రెండు రోజుల పాటు గ్రామంలో ఉల్లాసంగా తిరిగారు. ఈ నేపథ్యంలో బుదవారం సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో గీతం యూనివర్సిటీ సమీపంలో ఉన్న పెద్ద బండ చెరువులో స్నానం చేయడానికి పిల్లలతో కలిసి సాంబయ్య కుమార్తె అమ్మోజీ కూడా వెళ్ళింది. నలుగురు పిల్లలు గ్రామస్తులు కాకపోవడంతో చెరువుపై అవగాహన లేకపోవడంతో చెరువులో స్నానానికి దిగిన గోవర్ధన్‌ (16), ‌విష్ణువర్ధన్‌ (‌లోకేష్‌) (12), ఆనంద్‌ (17), ‌నందిని.(15) బండపై నుంచి కిందకి జారి పడిపోయి ఒకరికొకరు లోనికి వెళ్లి పోయారు. అమ్మోజి, దివ్యలు వేరే చోట దిగటంతో వారు జరిగిన సంఘటనకు భయపడి ఇంటికి వచ్చి తండ్రికి చెప్పటంతో సాంబయ్య వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థుల సహకారంతో పిల్లల్ని బయటకు తీయగా అప్పటికే వారు విగత జీవులుగా మారిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు కావటం, నలుగురు చిన్నారులు ఒకే సారి మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. భారీ స్థాయిలో తరలివచ్చిన గ్రామస్తులు కూడా చిన్నారుల మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.ఈ మేరకు పోలీసులు మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వ దవఖానకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాపు చేస్తున్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!