Take a fresh look at your lifestyle.

స్థానిక పరిస్థితులను బట్టి లాక్‌ ‌డౌన్‌ ‌విధించే హక్కు రాష్ట్రాలకుంది

  • ప్రజల నిర్లక్ష్యం వల్లనే కొరోనా విజృంభణ
  • కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా

కుంభమేలాతోపాటు రంజాన్‌ ‌ఫెస్టివల్‌లో చాలా మంది కోవిడ్‌ ‌రూల్స్‌ను ఫాలో అవ్వడం లేదని కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా అన్నారు. దేశంలో సెకండ్‌ ‌వేవ్‌ ‌రూపంలో కొరోనా విజృంభిస్తున్న వేళ ఇలా నియమాలను పాటించకపోవడం సరికాదని, ఇది తీవ్ర సమస్యగా మారొచ్చునని అన్నారు. వైరస్‌పై గెలిచేందుకు ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటూ పోరాటాన్ని కొనసాగిస్తున్నదని తెలిపారు. ‘కుంభమేలా లేక రంజాన్‌ ఏదైనా కానివ్వండి.. కొరోనా రూల్స్‌ను చాలా మంది సరిగ్గా పాటించట్లేదు. ఇది సరికాదు. అందుకే కుంభమేలాను లాంఛనంగా ముగించాలని కోరాం. కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌త్వరగా వ్యాప్తి అవుతున్నది. వేగంగా వ్యాప్తి అవుతుండటం సమస్యే అని చెప్పాలి. అయితే సెకండ్‌ ‌వేవ్‌పై తప్పకుండా విజయం సాధిస్తామని నమ్ముతున్నా. కొరోనాపై పోరులో అన్ని రాష్ట్రాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. స్థానిక పరిస్థితులను బట్టి లాక్‌డౌన్‌ ‌వేసే హక్కు రాష్ట్రాలకు ఉంది’ అని షా స్పష్టం చేశారు.

Leave a Reply