Take a fresh look at your lifestyle.

“సేవకుడిలా పని చేస్తా” ఏడాదిలో గోదావరి నీళ్లు తీసుకొస్తా

మైసంపల్లి పాసు పుస్తకాల పంపిణీలో హరీష్‌రావు :సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం మైసంపల్లిలో శనివారం 192 మంది లబ్ధిదారులకు రాష్ట్ర మాజీమంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట ఆర్డీవో జయచంద్రా రెడ్డితో కలిసి కొత్త ప•ట్టాదారు పాస్‌ ‌పుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ..మైసంపల్లి గ్రామ యువత కలిసి మెలిసి ఉండాలని కోరుతూ.. మీరు కలిసి కదలండి.. మీ సేవకుడిలా.. మీ గ్రామనికి అడిగిన ప్రతి పనిని చేస్తానని యువతలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ.. గత 45 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా, పెండింగ్‌లో ఉన్న భూ రెవెన్యూ సమస్యలకు పరిష్కారం జరిగిందన్నారు. నేడు చాలా సంతోషంగా ఉందని, మైసంపల్లి నర్మెట నుంచి వేరుపడి గ్రామ పంచాయతీ కావడం, పట్టాదారు పాసు పుస్తకాలు రావడంతో.. మైసంపల్లిలో సమస్త సమస్యలకు కారణమైనా పట్టాదారు పాస్‌ ‌పుస్తకాల పంపిణీతో గ్రామ రైతుల రంది తీరిందన్నారు. ఇక ఈ గ్రామానికి కావాల్సింది.. గోదావరి నీళ్లు.., ఇప్పటికే కాలువ పనులు పూర్తయ్యాయి. కోనాయిపల్లి ఫీడరు చానల్‌ ‌పూర్తయ్యాయని.. కాళేశ్వరం నీళ్లు తెస్తే.. రెండు పంటలు పండించుకోవచ్చని పేర్కొన్నారు. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నేను మీ దగ్గరికి రాకున్నా.. మీరు నన్ను ఆశీర్వాదించి లక్ష వోట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు మీకు ఎంత చేసినా తక్కువేననీ హరీష్‌ అన్నారు. వచ్చే ఏడాదిలోపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తీసుకోస్తా. దేవుడి దయతో వచ్చే వానా కాలం.. యాసంగికే నీళ్లు అందిస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. రానున్న రోజులలో గోదావరి జలాలు వచ్చి వ్యవసాయం ద్వారా బంగారం పండించవచ్చని., సేంద్రీయ వ్యవసాయం చేస్తే లాభసాటిగా జరుగుతుందని వివరిస్తూ.. మీ భూములు అమ్ముకోవద్దన్నారు. టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వచ్చాక సిఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రైతుబంధు పథకం కింద రానున్న రోజుల్లో రూ.10వేలు ఇవ్వనున్నట్లు, రైతులు పండించే పంటలకు సరైన గిట్టుబాటు ధర వచ్చేలా సిద్ధిపేట కూరగాయల మార్కెట్లో మీకు అవకాశం ఉంటుందని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయంతో.. ఖర్చులు తక్కువగా దిగుబడి ఎక్కువగా ఉంటుందని.., సేంద్రీయ వ్యవసాయం చేస్తానంటే.. మైసంపల్లి గ్రామస్తులకు సహకరిస్తూ.. రైతులకు ఆవులను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ యువతలో మార్పు రావాలనీ, రైతాంగంపై దృష్టి సారించాలన్నారు, ఇంజనీరింగ్‌, ‌డాక్టర్‌ ‌చదువులు చదివిన తర్వాత కూడా వ్యవసాయం మీద దృష్టి సారించి ఎంతో మంది లాభసాటిగా వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. చదువుకున్న గ్రామ యువత మీ శక్తిని నిర్వీర్యం చేయొద్దన్నారు. ఇది మీ ఆత్మగౌరవంతో కూడిన అంశమని.. వివరిస్తూ.. స్వశక్తితో పైకి రావాలన్న తపన మీలో కలగాలని మైసంపల్లి గ్రామ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. వారిలో చైతన్యం కలిగించారు. గ్రామ మహిళలు ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి ఇవ్వాలని, అలాగే నీటి వృథాను ఆరికట్టాలనీ, అవసరమైతే క్రమ శిక్షణగా ఉండాలన్నారు. గ్రామ దేవతలైనా పోశవ్వ తల్లి మీద ఒట్టు పెట్టి…. నల్లా పైపులు విరగొట్టడం చేస్తే ఫైన్‌ ‌వేసేలా గ్రామ మహిళా సంఘంలో తీర్మాణం చేయాలని హరీష్‌రావు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి జాప శ్రీకాంత్‌రెడ్డి, స్థానిక టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy