సెకండ్ వేవ్ కొరోనా వైరస్
విజృంభణ వెరీ సీరియస్
దవాఖాన లు మళ్ళీ కిటకిట
చూడు రోగుల పరిస్థితి కటకట
మొదటి సారి జనం భయపడ్డరు
ప్రతొక్కరు ముందస్తు జాగ్రత్త పడ్డరు
అయినా లాక్ డౌన్ తో కష్టపడ్డరు
ఎలాగో వోలాగ వొడ్డున పడ్డరు
ఇప్పుడు జనం వినేటట్టు లేరు
ఇట్లయితే బతికి బట్ట కట్టలేరు
జల్దీ హాట్ స్పాట్ లు గుర్తించాలే!!
ఇక రాకపోకలు నియంత్రించాలే!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్ జర్నలిస్ట్