Take a fresh look at your lifestyle.

సీ పి విచారణకు హాజరుకావాల్సిందే!

బెంగాల్‌ ‌వ్యవహారంలో స్పష్టం చేసిన సుప్రీమ్‌కోర్టు
పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీమ్‌ ‌కోర్టులో మంగళవారం ఎదురుదెబ్బ తగిలింది. శారదా చిట్‌ఫండ్స్ ‌కుంభకోణం కేసులో ఆధారాలు మాయం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా సీపీ రాజీవ్‌ ‌కుమార్‌ను సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. తటస్థ ప్రదేశమైన మేఘాలయలోని షిల్లాంగ్‌లో సీపీ రాజీవ్‌ ‌కుమార్‌ ‌సీబీఐ ముందు హాజరు కావాలని సూచించింది. కేసు విచారణలో సీబీఐకి సీపీ పూర్తిగా సహకరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ ‌గొగోయ్‌ ‌స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి అరెస్టు సహా ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలకు దిగరాదని సీబీఐకి ఆదేశాలు జారీ చేశారు. సీబీఐ దాఖలు చేసిన కోర్టు ధిక్కారం పిటిషన్‌పై సమాధానం చెప్పాలంటూ కోల్‌కతా సీపీతో పాటు పశ్చిమ బెంగాల్‌ ‌ప్రభుత్వం, డీజీపీలకు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy