Take a fresh look at your lifestyle.

సిరిసిల్ల కేటీఆర్‌దే!

తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెరాస ప్రభంజనం సృష్టించింది. సిరిసిల్లలో తెరాస అభ్యర్థి, మంత్రి కేటీఆర్‌ ‌ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌కు చెందిన సప ప్రత్యర్థి కె.కె. మహేందర్‌రెడ్డిపై కేటీఆర్‌ ‌జయకేతనం ఎగురవేశారు. సుమారు 80వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కేటీఆర్‌కు 1,21,758 ఓట్లు రాగా, సప ప్రత్యర్ధి అభ్యర్ధి మహేందర్‌ ‌రెడ్డికి 34,850 ఓట్లు పోలయ్యాయి. 2009 నుంచి శాసనసభ్యుడిగా కొనసాగుతున్న కేటీఆర్‌.. 2010 ఉప ఎన్నికతో పాటు 2014 ఎన్నికల్లోనూ సిరిసిల్ల నుంచే గెలుపొందారు. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేకే మహేందర్‌రెడ్డి 171 ఓట్ల స్వల్ప తేడాతో కేటీఆర్‌ ‌చేతిలో ఓటమి పాలయ్యారు. 2010 ఉప ఎన్నికల్లో మరోమారు కాంగ్రెస్‌ అభ్యర్థిగా కేటీఆర్‌తో తలపడి 68,220 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొండూరి రవీందర్‌రావును బరిలో దింపగా కేటీఆర్‌ 53 ‌వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. తాజాగా మరోమారు కాంగ్రెస్‌ అభ్యర్థిగా కేకే మహేందర్‌రెడ్డి కేటీఆర్‌తో తలపడి ఓటమి పాలయ్యా•

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy