Take a fresh look at your lifestyle.

సిద్దిపేట లో గోల్కొండ షో రూమ్ .

సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ₹2కోట్ల తో నిర్మించిన గోల్కొండ షోరూం భవనం ప్రారంభించిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు ….ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ..
“సిద్దిపేట కు వన్నె తెచ్చేలా గోల్కొండ షోరూం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది.. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయాలను గౌరవం తెచ్చేలా మన సీఎం కేసీఆర్ గారు ఆలోచన చేశారు.. మన రాష్ట్ర గోల్కొండ ప్రాచుర్యం తెచ్చేలా వృత్తి కళాకారులను ప్రోత్సాహిస్తున్నాం..సిద్దిపేట లో 2కోట్ల తో గోల్కొండ షోరూం ఏర్పాటు చేశాం…సిద్దిపేట ఎన్నో కళలకు , కళాకారులకు ప్రసిద్ధి.. ప్రముఖ చిత్ర కళాకారులు, కాపు రాజయ్యా , బాతిక్ బాలయ్య, గొల్లబామ చీర , ఘనపూర్ కళలు…కళలను, కళాకారులను ప్రోత్సాహించి అంతరించి పోయిన కళలను కాపాడుకోవాలి… శుభకార్యాలు , పుట్టినరోజు, పెళ్ళిరోజు ల సందర్భంలో ఈ హస్తకళ ల వస్తువులను గిఫ్ట్ గా తీసుకెళ్లి వృత్తి కళాకారులను ఆదరిద్దాం..జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ,కార్యాలయాలలో గోల్కొండ షోరూంలో తయారు అయ్యే వస్తువులను ఖరీదు చేస్తాం… గోల్కొండ కళ ఉట్టి పడేలా భవనం నిర్మించి ఏర్పాటు చేసిన గోల్కొండ అభివృద్ధి సంస్థ కు అభినందనలు…” తెలియజేశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy