Take a fresh look at your lifestyle.

సిఎం కెసిఆర్‌ ‌కార్మికుల పక్షపాతి

వికారాబాద్‌ : ‌రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కార్మికుల పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కార్మికుల అభివృద్ధికి బాటలు వేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ‌కార్మిక వారం జిల్లా అధ్యక్షులు భూముల కృష్ణయ్య తెలిపారు. శనివారం మేడే సందర్భంగా వికారాబాద్‌ ‌పట్టణంలోని డిసిఎంఎస్‌ ‌కార్యాలయం వద్ద హమాలీ కార్మికులతో జెండా ఎగరవేయించి మేడే వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కార్మికుల కష్టాలు తెలిసిన మహానాయకుడని, కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అనేక సౌకర్యాలు కల్పిస్తూ వారికి అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తూ వారికి కొండంత అండగా నిలుస్తున్నారని తెలిపారు.

Leave a Reply