వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

సిఎం కెసిఆర్‌తో ఎప్పుడూ సుదీర్ఘ చర్చలే

September 7, 2019

లంచ్‌ ‌చేసి సిద్దంగా ఉండేవాణ్ణి
ఆత్మీయ సత్కార సభలో గవర్నర్‌ ‌నరసింహన్‌ ‌వ్యాఖ్య
ఆయన సేవలు కోల్పోవడం బాధాకరం : సిఎం కెసిఆర్‌కెసిఆర్‌ ‌వస్తున్నాడంటే ముందే భోజనం చేసి రెడీగా ఉండేవాడినని సుదీర్ఘ కాలం పాటు గవర్నర్‌గా సేవలందించిన నరసింహన్‌ అన్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ‌వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సంప్రదాయం ప్రకారం కేసీఆర్‌ ‌దంపతులు తిలకాన్ని దిద్ది, పూలమాల, శాలువాలతో సత్కరించి, వీణను బహూకరించారు. ఈ సందర్బంగా నరసింహన్‌ ‌మాట్లాడుతూ కెసిఆర్‌ ‌పట్టుదల కలిగిననాయకుడన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ‌నరసింహన్‌ ‌మాట్లాడుతూ కేసీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మొదట్లో కేసీఆర్‌ ఆయన్ను కలవడానికి 12 గంటలకు వచ్చారని, ఆ సమావేశం దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిందని తెలిపారు. అయితే తనకు ఒంటి గంటకు లంచ్‌ ‌చేయడం అలవాటని, కేసీఆర్‌ ‌మాత్రం దాదాపు మూడు గంటల పాటు సమావేశాన్ని కొనసాగించేవారని అన్నారు. ఇంత సుదీర్ఘమైన సమావేశాన్ని నిర్వహించే అలవాటు కేసీఆర్‌కుందని మొదట్లో తనకు తెలియదని తెలిపారు. తర్వాత తర్వాత తాను ఉదయం పది గంటలకే భోజనాన్ని ముగించుకొని కేసీఆర్‌తో భేటీ నిర్వహించే వారమని నరసింహన్‌ ‌గుర్తు చేసుకున్నారు. పది గంటలకు తమ సమావేశం ప్రారంభమైనా, విషయంలోకి తొందరగా వెళ్లేవారిమి కాదని, కొద్దిసేపు
వామప్‌ ‌కొనసాగి, నిజాం కాలం నుంచి చరిత్రను కొనసాగిస్తూ…. ప్రస్తుత విషయంలోకి వచ్చేవారమని, మధ్యలో ఇద్దరి మధ్యా తీవ్ర చర్చలు జరిగేవని అన్నారు. చివరికి చర్చలు వాడివేడీగా సాగేవని అయితే తాను నరసింహుడినని, ఆయన చంద్రశేఖరుడని చివరికి శాంతి…. శాంతి… శాంతి…. అంటూ చర్చలు ముగించుకునేవారమని అది కేసీఆర్‌ ‌గ్రేట్‌నెస్‌ అని నరసింహన్‌ ‌కొనియాడారు. తనతో ఆప్యాయంగా ఉండడమే గాకుండా ఆత్మీయ సత్కారం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్‌ ‌నరసింహన్‌కు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు ఏర్పాట్లు చేసింది. బేగంపేట విమానాశ్రయంలో నరసింహన్‌కు సీఎం కేసీఆర్‌, ‌స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు వీడ్కోలు పలికారు. ఎయిర్‌పోర్టులో నరసింహన్‌ ‌పోలీసుల నుంచి వీడ్కోలు గౌరవవందనం స్వీకరించారు.
ఆయన సేవలు కోల్పోవడం బాధాకరం : సిఎం కెసిఆర్‌
ఈ ‌సందర్భంగా కెసిఆర్‌ ‌మాట్లాడుతూ గవర్నర్‌ ‌నరసింహన్‌ ‌సేవలు కోల్పోవడం అత్యంత బాధగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్త రాష్ట్రం ప్రస్థానం పూర్తిగా తెలిసిన వ్యక్తి నరసింహన్‌ అని కొనియాడారు. నరసింహన్‌ ఎప్పటికప్పుడు వెన్నుతట్టి, ధైర్యం చెప్పి స్ఫూర్తి నింపారని ప్రశంసించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ‌దంపతులు ప్రతి పండుగను గొప్పగా నిర్వహించేవారని గుర్తు చేశారు. నరసింహన్‌ ఇచ్చిన స్ఫూర్తిని, మార్గదర్శకత్నాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. నాకు పెద్దదిక్కులా, రాష్టాన్రికి మార్గదర్శకుడిగా వ్యవహరించారని, నరసింహన్‌ ‌హయాంలో ఉద్యమకారుడిగా, సిఎంగా బాధ్యతలు నిర్వర్తించానని, నాడు ఉద్యమాన్ని అణచివేయడానికే నరసింహన్‌ ‌వచ్చారనే భయం ఉండేదని, ఉద్యమ నేపథ్యాన్ని నరసింహన్‌ ‌చాలా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని కెసిఆర్‌ ‌గుర్తు చేశారు. ఇంటెలిజెన్స్ ‌బ్యూరో విభాగాధిపతిగా పని చేసిన అనుభవం ఆయనదని తెలియజేశారు. స్వరాష్ట్ర ఉద్యమం, ప్రజల డిమాండ్‌ ‌గురించి కేంద్రానికి సరైన నివేదికలే పంపుతారని ఆనాడు విశ్వసించానన్నారు. నన్ను కూడా ఆయన సిఎంలా కాకుండా తమ్ముడిలా ఆదరించారని చెప్పారు.