Take a fresh look at your lifestyle.

సావు డప్పుకు బాధ్యులెవ్వరు?

‘‘‌గెల్షిందంత సత్తెం కాదని’’ మహాకవి చెప్పిందే కళ్ళముందు నిజమాయె! కోర్టును గఫ్లత్‌ ‌జేషే అఫిడవిట్లు తయారు జేయనీకి పూటలకు పూటలు సమీచ్చలు జేషిన సర్కార్‌ ‌పెద్ద మనుషులను కంటెంట్‌ ‌జేయని కోర్టు నేమనాలె! వాయిదాల మీద వాయిదాలేషి ఆశ పుట్టిచ్చిన కోర్టే నడిమిట్ల శాతకాదని చేతులెత్తేషి లేబర్‌ ‌కమీషన్‌కు వోండని ఆర్టీసోళ్ళకు జెప్పుడు గిట్ల నాయమెట్లయ్యె! జనం వోట్లతోని గెలిషిన సర్కార్‌ ‌జనం ఆస్తులతోని ప్రయివేట్‌ ‌దందా జేసుకోవచ్చని జెప్పె. వేలల్ల రూట్లను ప్రయివేటోళ్ళకు ఇచ్చుడు తప్పెట్లయితదని, సర్కార్‌ ‌నేర్పిన చిల్క పల్కులనే వల్లిత్తె చేషేదేమున్నది!ఏడ మొదలయిందో గాడనే ఆగిపోయిన ఆర్టీసీ సమ్మె తెలంగాణ జనానికి పాఠం మంచిగనే జెప్పింది. గద్దెనెక్కినోళ్ళ బుద్ధిని భూతద్దంల బెట్టి సూపింది. గింత మంచి పాఠం జెప్పించిన ఆర్టీసోళ్ళను తారీఫ్‌ ‌జెయ్యాలె! రేపు గిట్ల ఆర్టీసీ దోస్తులు గిట్ల ఎదురైతె అలాయి బలాయి జేషి దండం బెట్టాలె! ‘‘దునియాల వాళ్ళంత తోపుల్లేరు పో!’’ ఔ!మజాక్‌ అనుకుంటాండ్లా యేంది! నిజంగనే! ఆకలికి పేగులు సుడులు తిరుగుతాంటె, కండ్లల్ల దుక్కాన్ని ఓర్సుకోని బుక్కెడంత బువ్వడిగిండ్లా! లే! బాకీ వున్న జీతమడిగిండ్లా! లే! మేం పన్జేషే సంస్థను కాపాడుమన్నరు,సర్కార్‌ల కలుపుండ్రి దొరా! అన్నరు. దాని ఆస్తులు పైలమన్నరు. తెలంగాణల పాణమాసొంటి పండుగల సూత ఉపాసమున్నరు. ఊర్లందరు షోకులవడి బతుకమ్మలను ఎత్తుకుంటె, మీరేమొ మీ బతుకు పాటెత్తుకుంటిరి. దసరా పండుగచ్చె! ఓ దిక్కు యాటలు తెగి, కాల్లు, తల్కాయలు కాల్తాంటె, మీ వోళ్ళేమొ పిట్రోల్‌ ‌వోసుకొని పాణాలు కమిరిచ్చుకుంటిరి. పండుగకు పట్టు చీరె సుట్టుకునే కండక్టర్‌ ‌చెల్లె పాతబట్ట మలిషి ఫాన్‌కు ఉరేసుకొని జీవిడిషె! దుక్కం సుట్ట సుట్టి గుండెల దాసుకొని కొట్లాడుతె బయటికి తెల్వకుంట వుంటదాను! ఆ గుండె గిట్ల గుబులై కొట్టుకునుడాగె! పిడికెడంతుంటది ఎంతగని ఓర్తది, మీ దుక్కాన్ని…. మస్తు మందిగా పిడికెడు గుండె సల్లబడి నోరుతెరిత్తిరి. కమ్మం మెట్టుల శ్రీనివాసరెడ్డి నుంచి నిన్న పొద్దున గుండె ఆగిన వికారాబాద్‌ ‌వీరభద్రయ్య దాంక యాబై రోజుల సమ్మెల ముప్పయి మంది బలిదానాలాయె! రాష్ట్రం కోసం రోడెక్కిన సకలజనుల సమ్మె కన్న ఎనిమిది దినాలు ఎక్కువనే ఆయె!
‘‘గెల్షిందంత సత్తెం కాదని’’ మహాకవి చెప్పిందే కళ్ళముందు నిజమాయె! కోర్టును గఫ్లత్‌ ‌జేషే అఫిడవిట్లు తయారు జేయనీకి పూటలకు పూటలు సమీచ్చలు జేషిన సర్కార్‌ ‌పెద్ద మనుషులను కంటెంట్‌ ‌జేయని కోర్టు నేమనాలె! వాయిదాల మీద వాయిదాలేషి ఆశ పుట్టిచ్చిన కోర్టే నడిమిట్ల శాతకాదని చేతులెత్తేషి లేబర్‌ ‌కమీషన్‌కు వోండని ఆర్టీసోళ్ళకు జెప్పుడు గిట్ల నాయమెట్లయ్యె! జనం వోట్లతోని గెలిషిన సర్కార్‌ ‌జనం ఆస్తులతోని ప్రయివేట్‌ ‌దందా జేసుకోవచ్చని జెప్పె. వేలల్ల రూట్లను ప్రయివేటోళ్ళకు ఇచ్చుడు తప్పెట్లయితదని, సర్కార్‌ ‌నేర్పిన చిల్క పల్కులనే వల్లిత్తె చేషేదేమున్నది!
సమ్మె చట్టబద్దమా! కాదా! అనే అంశాన్ని ముందుకు తెచ్చుడంటె యెడ్డమంటె తెడ్డమనుడే గదా! సమ్మె అనేది ఒక సమిష్టి ప్రయోజనాన్ని సాధించే క్రమంలో ఒక పోరాట రూపం. అంతర్జాతీయ స్థాయిలో ఏ కార్మికునికైనా జన్మహక్కు. ఒక సమిష్టి వ్యవస్థలో పని జేషేటోడు సమస్యలను వ్యక్తిగా పోయి సాధించుకోలేడు కాబట్టే సంఘం అనేది పుట్టుకచ్చె! ఇప్పుడు అధికారంల వున్నోళ్ళు ఆర్టీసీల సంఘం పెట్టలేదా! గిన్ని తీర్ల అబద్ధాలను నిజాలుగా నిజాలను అబద్ధాలుగా రూపుదిద్ది అఫిడవిట్లు కోర్టుల జూపిన పెద్ద అధికారులు కతలు పడ్డరనటానికి నిదర్శనం కాదా!?
వచ్చి నౌకర్ల జేరుండని మూడు సార్లు సర్కారు పిల్షినా జేరకుంట ఆకలి కడుపును ఓచేతబట్టి ఇంకో చేత పోరాట జెండనే ఎగురేషిన ఆర్టీసీఐక్యత సమస్త కార్మిక లోకానికి మార్గదర్శనం జేషిందనుకోవాలె! తెలంగాణ పోరులో సీమాంధ్ర పాలకులు అమలుపరిచిన అణచివేతను మించిపోయింది. టాంకుబండు కాడ పారిన మహిళా కార్మికుల రక్తపు మడుగుల జ్ఞాపకాలు పాలకుల నిజ నైజానికి అద్దం పట్టింది.
ఎన్నో ఆశలతోని ఆకలిని లెక్కజేయకుంట నెలన్నర పైన నడిషిన గీ సమ్మె నేర్పిన పాఠాలను మిగతా సంఘాలు, సామాన్య జనం, యెట్ల అరం జేసుకున్నరో గని ప్రజాసామ్యంలో జనంకున్న కనీసహక్కులు బొంద బెట్టుట్ల సర్కార్‌ల వున్న పార్టీ యేదైనా ముందునుంటదని లాగేసుకున్న పోరగాండ్లకుసూత తేలిషేటట్టయింది.సర్కార్‌ ‌ప్రయివేట్ల బెట్టి దందా జేద్దావనుకున్నది. ఆరునూరైనా అనుకున్నదాన్ని సాధిచ్చుకున్నది. సమ్మె షురూ అయిన కాన్నించి సర్కారు పెద్దోళ్ళు సమ్మె మీద జెప్పిన ఒక్కముచ్చట్ల సూత నిజం పైస పాల్లేదని నెత్తి నోరు కొట్టుకున్న పెద్ద కోర్టే సల్లబడి చేతులెత్తేషినంక నాయం యేడ దొరుకుతదో తెల్వకనే సమ్మె డిమాండ్లు యేడున్నయో గాన్నే వున్నయి.
సమ్మె ఫలితాలను ముందుగాల అంఛనా యెయ్యక పోవటం, కార్మికుల ఆకలి తోని, ఆశలతోని ఆడుకున్న సంఘాలు గంత మంది పాణాలు పోయేందుకు కారణం కాదా! అని ఓ ప్రచారం జేషి సంఘాలకు, సంఘ నాయకులకు, కార్మిక లోకానికి మధ్య అగ్గి రాజేషే కతలు పడే అవకాశాలున్నయి. అనుకున్నదే నిజమయి నాయకులను, సమ్మెను సమర్థించిన సమస్త వర్గాలను బద్నాంజేషే వర్గాలు కత్తులు నూరుతానయి. నాయకుల దిష్టిబొమ్కలు కాలబెట్టుడుతోని షురూజేషిండ్లు. మద్దతుఇచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ, మేధో వర్గ ప్రతినిధులను,పత్రికలను, రాషిన జర్నలిస్ట్‌లను, యెంబడుండి జెండెత్తిన సబ్బండ వర్ణాలపై ధుమ్ము జల్లే పని ఇయాటి నుంచి షురువయితది. అంతిమంగ ఓ న్యాయమైన పోరాటాన్ని చట్టం, న్యాయంల సాక్షిగా సమాధి కట్టి, ఆసమ్మెకు ఊపిర్లూదిన సమస్త వర్గాల వారిపై వంకర ముద్రలేషే సోషల్‌ ‌మీడియా గులాబీ ముళ్ళ దాడి షురువైతది.
సమ్మె కాలంల ధర్నా టెంట్‌లకింద మోగిన ప్రతి సావు డప్పుకు ఆ సమ్మెకు మద్దతిచ్చిన వాళ్ళనే బాధ్యులను జేషి జనం ఆలోచనల మీద విషంజల్లుతది. ఫలితంగా ఇకముందు జరిగే న్యాయ పోరాటాలకు మద్దతు ఇచ్చే తెగువను నీరుకారిపిచ్చే కుట్రపూరిత మేధోపరమైన ఆటకు ఒడిగడ్తది. తెలంగాణ సమాజం ఈ సమ్మెను సరింగ అర్ధం జేసుకునేందుకు, సమ్మె నీరు కారిన వైనం, దానెనుక అసలు సిసలు విలన్లు యెవరో తెలియజేయాలె! లేకుంటె ముందు భవిష్యత్తుల ‘‘ఉద్యమం’’ అనే మహత్తర ఆయుధం కనుమరుగైనా ఐతది.
సూడ్రా బయ్‌! ఇ‌క్రమార్క్
‘‘ఇప్పటిదాంక ఇంటివి కదా! నిన్నటి దాంక యాభయి వేల మందిని ఒక్క మాట మీద నిలబెట్టి సర్కార్‌కు సల్ల చమటలు పుట్టిచ్చిన సమ్మె ఫలితాలు కొస్సెల్లకుంటనే సల్ల బడ్డది కదా!? యెట్లాయె! యెవలు జేషిండ్లు? గీ ప్రశ్నకు జవాబులు సోంచాయించి జెప్పు’’! అన్న భేతాళ్‌ ‌తోని ‘‘ ఆర్టీసీ దేశ చరిత్రల ఉద్యమాలకు కొత్త నిర్వచనం జెప్పి, పాలకులకు, వాళ్ళను ఆడిచ్చే పెట్టుబడోళ్ళకు ఒంటేలు పోయించింది. రేపు రేపు గిసోంటి సమ్మెలు మోపైతె తిప్పలైతదని, గీ సమ్మెపై జనం నమ్మకం నీరుకార్పిచ్చే తక్షణ అవసరాన్ని సమ్మె వ్యతిరేకులు ప్రధానాంశంగ ముందేసుకున్నరు. సర్వ శక్తులొడ్డి సమ్మె భవిష్యత్తును గిరగిర తిప్పి సర్కార్‌ ‌చేతిల బెట్టిండ్లు ‘‘అని మనుసులనుకుంట ఆలోచించుకుంట.భేతాళుని శవాన్ని భుజానేసుకోని ఇక్రమార్కుడు ఎప్పటిలాగనే… నడ్వబట్టిండు… నడ్వబట్టిండు.
– ఎలమంద, తెలంగాణ

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy