వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం వోటు

April 9, 2019

పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని మహబూబాబాద్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి సిహెచ్‌ ‌శివలిం గయ్య. పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య సామా న్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం ఓటు, అని . ఎలాంటి ప్రలోభాగాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించు కోవాలని, ప్రతి ఓటరు ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్న సరే ఓటు వేయడం మరిచిపోవద్దు అయన అన్నారు.18 సంవత్స రాలు నిండిన యువతీ యువకులు ఓటు వేసి సామాజిక బాధ్యతను నిర్వర్తించాలన్నారు, పోలిం గ్‌ ఈనెల 11 వ తేదీన గురువారం ఉదయం 7 గంటల నుండి ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందన్నారు. ఓటరు తమ ఫోటో ఓటరు స్లిప్‌ ‌తో పాటు ఎన్నికల సంఘం చే సూచించబడిన 12 రకాల ఓటరు గుర్తింపు కార్డు లైన ఓటరు గుర్తింపు కార్డు, పాన్‌ ‌కార్డ్, ‌పాస్పోర్ట్, ఆధార్‌ ‌కార్డ్ ‌తదితర కార్డులు తమ వెంట వేయుటకు పోలింగ్‌ ‌కేంద్రానికి తప్పకుండా తీసుకొని వెళ్లాలన్నారు. ఎన్నికల సంఘం ఓటర్ల సౌలభ్యం కొరకు నా ఓటు యాప్‌ ‌ను రూపొందించిందని, యాప్‌ ‌ను తమ స్మార్ట్ ‌ఫోన్‌ ‌లో గూగుల్‌ ‌ప్లే స్టోర్‌ ‌ద్వారా డౌన్లోడ్‌ ‌చేసుకొని ఓటర్‌ ‌వివరాలు, ఎన్నికల షెడ్యూల్‌, ‌పోలింగ్‌ ‌స్టేషన్ల రూట్‌ ‌మ్యాప్‌, ‌దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుండి పోలింగ్‌ ‌స్టేషన్‌ ‌వరకు రూట్‌ ‌మ్యాప్‌, ‌తదితర వివరాలు తెలుసుకోవచ్చన్నారు. దివ్యాంగులకు ఇంటి నుండి పోలింగ్‌ ‌కేంద్రానికి, తిరిగి ఇంటికి చేరుకుంటారు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఓటు హక్కును సక్రమంగా సద్వినియోగం చేసుకొని దేశ మనుగడను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.