Take a fresh look at your lifestyle.

సాఫీగా సాగిన పోలింగ్

15-వరంగల్‌ ‌పార్లమెంట్‌(ఎస్‌సి) నియోజకవర్గానికి గురువారం జరిగిన పోలింగ్‌ ‌వరంగల్‌ ‌పార్లమెంట్‌ ‌పరిధిలోని ఏడు సెగ్మెంట్‌లో పోలింగ్‌ ‌సాఫీగా జరిగింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ‌ప్రక్రియ సాయంత్రం 5గంటలకు ముగిసింది. ఉదయం నుంచి మందకొడిగా సాగింది. మధ్యాహ్నం 1గంట వరకు 35శాతం పోలింగ్‌ ‌నమోదైంది. సాయంత్రం 3 తర్వాత పోలింగ్‌ ఊపందుకుంది. కొన్ని ప్రాంతాల్లో ఎండవేడిమి వల్ల సాయంత్రం 5గంటల లోపు పోలింగ్‌ ‌కేంద్రాల్లో ఉన్న వారికి పోలింగ్‌ అధికారులు టోకెన్లు అందజేశారు. పార్లమెంట్‌ ‌పరిధిలోని 7 సెగ్మెంట్‌లలో పలు చోట్ల ఈవిఎంలు మోరాయించాయి. దీంతో అధికారులు హుటాహుటిన ఆయా ప్రాంతాల్లో అదనపు ఈవిఎంలను అమర్చి పోలింగ్‌ ‌నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలోని రోజరీ స్కూల్‌, ‌ప్రొగ్రెస్‌ ‌స్కూల్‌ ‌తదితర సెంటర్‌లలో ఈవిఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కున్నారు. అనంతరం ఓటర్లు క్యూలైన్లలో ఓటర్లు ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. వరంగల్‌ ‌పశ్చిమ నియోజకవర్గంలో అత్యల్పంగా 42.75శాతం ఓట్లు పోల్‌ ‌కాగా, వర్ధన్నపేట నియోజకవర్గంలో అత్యధికంగా 72.10శాతం ఓట్లు పోలయ్యాయి. వరంగల్‌ ‌తూర్పులో 55శాతం, స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌లో 63శాతం, పాలకుర్తిలో 71శాతం, పరకాలలో 67శాతం, భూపాలపల్లిలో 52శాతం ఓట్లు పోల్‌ అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్‌ ‌జీవన్‌పాటిల్‌ ‌సాయంత్రం పత్రికలకు వివరాలను వెల్లడించారు. హన్మకొండ వడ్డేపల్లి ప్రభుత్వ పాఠశాలలో పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ ‌కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే వరంగల్‌ ‌తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ‌కూడా పెరుకవాడలోని ప్రాథమిక పాఠశాలలో బూతు నెంబర్‌ 103‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బొల్లికుంటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టిఆర్‌ఎస్‌ ఎం‌పి అభ్యర్థి పసునూరి దయాకర్‌ ‌కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బిజెపి వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా అధ్యక్షురాలు రావుపద్మ అమరేందర్‌రెడ్డి దంపతులు హన్మకొండ 109 న్యూసైన్స్ ‌పిజి డిగ్రీ కళాశాల సెంటర్‌లో తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. హన్మకొండ రాయపురాలోని ప్రభుత్వ యునాని ఆసుపత్రిలోని పోలింగ్‌ ‌బూత్‌లో నగర ఇన్‌చార్జ్ ‌మేయర్‌ ‌ఖాజా సిరాజోద్దీన్‌ ‌తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్‌ ‌పెరుకవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కుటుంబ సమేతంగా హాజరై రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ ‌బండా ప్రకాష్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుడా చైర్మన్‌ ‌మర్రి యాదవరెడ్డి దంపతులు బాలసముద్రంలోని హెల్త్ ఇం‌జనీరింగ్‌ ‌శాఖ కార్యాలయంలో కుటుంబ సమేతంగా వోటు హక్కును వినియోగించుకున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, ‌పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. రామన్నపేటలోని ఆంధ్రబాలికా కళాశాలలో రాష్ట్ర వుమెన్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌ ‌చైర్‌పర్సన్‌ ‌గుండు సుధారాణి ప్రభాకర్‌ ‌దంపతులు, కార్పొరేటర్‌ ‌గుండు అశ్రితావిజయ్‌రాజ్‌ ‌దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మట్టెవాడ ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్‌ ‌కేంద్రంలో టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర నాయకుడు, కార్పొరేటర్‌ ‌గుండా ప్రకాష్‌రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతీ రెండు గంటలకొకసారి అధికారులు పోలింగ్‌ ‌శాతం గణన చేయగా… వరంగల్‌ ‌తూర్పు సెగ్మెంట్‌లో ఉదయం 9గంటల వరకు పోలింగ్‌ ‌శాతం 9.2శాతం పోల్‌ ‌కాగా, 11గంటల వరకు 18.50శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 39.35 పోలింగ్‌ ‌శాతం నమోదైంది. 3గంటల వరకు 46.41శాతం పోలింగ్‌ ‌జరిగింది. మొత్తం పోలింగ్‌ ‌ముగిసేసరికి 5గంటల వరకు 55శాతం పోలింగ్‌ ‌జరిగింది. వరంగల్‌ ‌పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా కరీమాబాద్‌ ‌న్యూ కౌటిల్యా పాఠశాలలో ఏర్పాటు చేసిన 106వ నెంబర్‌ ‌పోలింగ్‌ ‌బూత్‌లో అధికారులు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో బ్రతికి ఉన్న వారిని కూడా చనిపోయినట్లుగా తప్పుల తడాకగా ఓటర్‌ ‌లిస్ట్ ‌చూపించడంతో ఓటర్లు అవాక్కయ్యారు. శివనగర్‌ ‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పోలింగ్‌ ‌బూత్‌ 119‌లో అరగంట పాటు ఈవీఎం మొరాయించింది. అదేవిధంగా హన్మకొండ రెడ్డి కాలనీ లోని ఏకశిలా కాన్సెప్ట్ ‌స్కూల్‌లో 22వ నెంబర్‌ ‌బూత్‌లో మధ్యాహ్నం గంట సేపు ఈవిఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్‌ ‌నిలిచిపోయి భారీ సంఖ్యలో ఓటర్లు వెనుతిరిగి వెళ్లడం గమనార్హం.105, 106 పోలింగ్‌ ‌బూత్‌లలో కరీమాబాద్‌లోని 174 మంది హిజ్రాలు(ట్రాన్స్‌జెండర్స్) ‌తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 9వ డివిజన్‌లోని పాత గ్రేన్‌మార్కెట్‌లో 130,131 పోలింగ్‌ ‌బూత్‌లను వరంగల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్లమెంట్‌ అభ్యర్థి దొమ్మటి సాంబయ్య సందర్శించి పోలింగ్‌ ‌సరళిని పరిశీలించారు. ఆయనవెంట నాయకులు మీసాల ప్రకాష్‌, ‌భాషుపాక సదానందం, శ్యామ్‌, శ్రీ‌నివాస్‌, ‌కుమార్‌, ‌సుధాకర్‌, ‌సురేందర్‌, ఇస్మాయిల్‌ ‌తదితరులు ఉన్నారు. 16వ డివిజన్‌ ‌లక్ష్మీపురంలోని పోలింగ్‌ ‌బూత్‌లో పద్మావతి కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కొమ్ము టీనా అనే యువతి తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంది. తొలిసారి ఓటు వేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఈసందర్భంగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy