Take a fresh look at your lifestyle.

సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి

  • ప్రాధాన్యతా క్రమంలో పనులు సాగాలి
  • పోలవరం పనులు త్వరగా పూర్తి చేయాలి
  • రాయలసీమ ప్రాజెక్టులను సైతం పూర్తి చేయండి
  • వచ్చే 45రోజులు అత్యంత ప్రాధాన్యం అన్న సిఎం
  • ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సవి•క్ష

సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి బుధవాంర సవి•క్ష నిర్వహించారు. పోలవరంతో పాటు ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల ప్రగతిపై చర్చించారు. కాఫర్‌ ‌డ్యాంలో ఖాళీలను త్వరగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. స్పిల్‌ ‌ఛానల్‌లో మట్టి, కాంక్రీట్‌ ‌పనులను మరింత వేగవంతం చేయాలని తెలిపారు. నెల్లూరు, సంగం బ్యారేజీలను మే నాటికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. డిసెంబర్‌ ‌నాటికి వెలిగొండ రెండో టన్నెల్‌ ‌పూర్తవుతుందన్నఅధికారులు.. వంశధారలో ఫేజ్‌-2, ‌స్టేజ్‌ -2 ‌పనులు జులై నాటికి పూర్తి చేస్తామన్నారు. నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఒడిశాతో ఉన్న సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం.. నిర్దేశిరచుకున్న లక్ష్యంలోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు వచ్చేలోగా పూర్తిచేయాల్సిన పనులపై సీఎం ఆదేశాలు ఇచ్చారు. రానున్న 45 రోజులు అత్యంత కీలకమని, వర్షాలు వచ్చేలోగా పనులు అత్యంత వేగంగా, సమర్థవంతంగా జరగాలని సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలపైనా సీఎం సవి•క్ష చేశారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న ప్రాజెక్టులకు నిధుల విషయంలో ఎలాంటి సమస్య రాకుండా చూస్తున్నామన్నారు. కష్టకాలం అయినప్పటికీ .. పోలవరం సహా ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తిచేయాలనే ఉద్ధేశ్యంతోనిధుల విడుదలతో పాటు అన్ని రకాలుగా ప్రభుత్వం అడుగులేస్తుందని అన్నారు.

నెల్లూరు, సంగం బ్యారేజీలు మే నాటికి పూర్తి చేస్తామని సీఎంకు అధికారులు వివరించారు. అవుకులో రెండో టన్నెల్‌లో కెమికల్‌ ‌పోరింగ్‌ ‌పనులు వేగంగా జరుగుతున్నాయని, ఆగస్టు నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. ఆగస్టు నాటికి మొత్తంగా 20వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లేలా సొరంగాలు సిద్ధమవుతాయని వెల్లడించారు. ఒడిశాతో ఉన్న సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సెం సూచించారు. గత ఐదేళ్లలో జరిగిన పనులతో పోలిస్తే.. ఈ 18 నెలల కాలంలో పనులు చాలా వేగంగా ముందుకు వెళ్లాయన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాధాన్యతా ప్రాజెక్టులు పూర్‌ఖ్తెన తర్వాత మిగిలిన వాటిపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. మహేంద్ర తనయ, మడ్డువలస ఫేజ్‌2, ‌తారకరామ సాగర్‌ ‌తదితర మిగిలిన ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకోవాలని అన్నారు. రాయలసీమ కరువు నివారణ కింద చేపట్టనున్న ప్రాజెక్టులు, అలాగే పల్నాడు ప్రాంతంలో కరువు నివారణ కోసం చేపట్టనున్న ప్రాజెక్టు పనులపైనా సీఎం సవి•క్ష చేపట్టారు.  ప్రణాళికా బద్ధంగా ఈ ప్రాజెక్టులు ముందుకు సాగేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. సమావేశానికి సీఎస్‌ ఆదిత్యనాథ్‌ ‌దాస్‌, ‌నీటిపారుదలశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ ‌రావత్‌, ఈఎన్‌సీ సి నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave a Reply