Take a fresh look at your lifestyle.

సాగర్‌లో 12 గేట్లు, శ్రీశైలంలో ఐదు గేట్లు మూసివేత

ఎగువ నుంచి వరద తగ్గడంతో అధికారుల చర్యలుకృష్ణా పరివాహకంలో వరద క్రమంగా తగ్గుముఖం పట్టడంతో సాగర్‌తో పాటు, శ్రీశైలం గేట్లను మెల్లగా మూసేస్తున్నారు. పులిచింతలకు కూడా నీటి రాక తగ్గింది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా నదిలోని ప్రాజెక్టుల్లోకి వరద క్రమంగా నెమ్మదించింది. దీంతో అధికారులు నాగార్జునసాగర్‌ ‌ప్రాజెక్టులోని మొత్తం 12 గేట్లనూ మూసివేశారు. ప్రస్తుతం 14 గేట్ల ద్వారా 2.16 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి 4.60 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోలో ఉండగా.. 2.55 లక్షల క్యూసెక్కుల ఔట్‌ప్లో ఉంది. సాగర్‌ ‌పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 303.94 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. నాగార్జునసాగర్‌ ‌పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.70 అడుగులుగా ఉంది. మరోవైపు శ్రీశైలం జలాశయంలోకి క్రమంగా వరద తగ్గుముఖం పట్టడంలో ఐదు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం 3.87 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుండగా 2.47 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205 టీఎంసీల నీటిని నిల్వ చేశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy