ఒక్కొక్క పాఠశాలకు ఒక్క కోటి యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి పరుస్తాం : ఎంజేఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మర్రిజమున
పాఠశాలల్లో మొత్తం 9 అంశాలను అభివృద్ధి చేయనున్నారు. వాటిలో లేని వసతులను నమోదు చేసుకుని వాటిని కల్పిస్తారు. నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు విద్యుత్, పంకా, ట్యూబ్‌లైట్ సదుపాయం, తాగునీటి సౌకర్యం మరియువిద్యార్థులు, ఉపాధ్యాయులకు ఫర్నిచర్,పాఠశాలలకు రంగులు,పెద్ద, చిన్న మరమ్మతులు,పచ్చ రంగు బోర్డులు,విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు,ప్రహరీలు మౌలిక వసతులతో కూడిన తరగతి గదులు కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ లైబ్రరీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మాజీపేట్ ఎంపీపీ రవీందర్ రెడ్డి, జడ్పిటిసి దయాకర్ రెడ్డి, తాహసిల్దార్ సరస్వతి, ఎంపీడీవో కరుణశ్రీ, సర్పంచ్ గోపి గౌడ్, మండల విద్యాధికారి శ్రీనివాసులు, ప్రధానోపాధ్యా యులు ఇబ్రహీం, ఉపాధ్యాయులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.