వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

సరైన దిశగా విక్రమ్‌ ‌ల్యాండర్‌ ‌పయనం

September 6, 2019

ఇస్రో ఛైర్మన్‌ ‌శివన్‌ ‌వెల్లడి:’‌చంద్రయాన్‌-2’‌లోని విక్రమ్‌ ‌ల్యాండర్‌ను జాబిల్లిపై ఇంతకు ముందు ఎవరూ వెళ్లని ప్రదేశంలో ల్యాండ్‌ ‌చేయనున్నామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చీఫ్‌ ‌కె.శివన్‌ ‌శుక్రవారంనాడు తెలిపారు. విక్రమ్‌ ‌మృదువుగా ల్యాండింగ్‌ అవుతుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అన్ని కక్ష్యలను సక్రమంగా చేదించుకుంటూ సాగుతోందని అన్నారు. చంద్రుడిపై ’విక్రమ్‌’ ‌ల్యాండర్‌ ‌పాదం మోపే క్షణం కోసమే ఎదురుచూస్తున్నామని చెప్పారు. శనివారం తెల్లవారుజామున ’చంద్రయాన్‌-2’‌లోని విక్రమ్‌ ‌మాడ్యాల్‌ ‌విజయవంతంగా, సురక్షితంగా ల్యాండింగ్‌ అయ్యేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టు చెప్పారు. మేము చేయాల్సినందంతా చాలా కట్టుదిట్టంగా చేశాం. రాత్రి రాబోయే ఫలితం కోసం ఎదురుచూస్తున్నాం. చంద్రయాన్‌-2 ‌తుది ఘట్టం చూసేందుకు ప్రధాని మోదీ కూడా స్వయంగా వస్తుండటంతో ఇది చాలా పెద్ద ఈవెంట్‌ ‌కానుంది’ అని డియాతో మాట్లాడుతూ శివన్‌ అన్నారు. కాగా, చంద్రయాన్‌ ‌ప్రత్యేక క్షణాలను వీక్షించి ఆ ఫోటోలను తనతో షేర్‌ ‌చేసుకోవాలని, వారిలో కొన్నింటికి రీట్వీట్‌ ‌చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారంనాడు వరుస ట్వీట్లలో దేశ ప్రజలను కోరారు.