వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

సమ్మె యథాతథం

November 19, 2019

హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత
న్యాయ నిపుణులతో చర్చించి తుది నిర్ణయం
ఆర్టీసీ జేఏసీ సమావేశం అనంతరం ప్రకటించిన కన్వీనర్‌ అశాత్థామ రెడ్డి
సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. సమ్మె కొనసాగించాలా..వద్దా అన్న దానిపై మంగళవారం ఆర్టీసీ జేఏసీ నేతల కీలక సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమ్మె కొనసాగింపుపై కార్మికుల అభిప్రాయం తీసుకున్నామని, ఆర్టీసీ జేఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కార్మికుల హామీ ఇచ్చారని వివరించారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు కాపీ ఇంకా తమకు అందలేదని, కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయనిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. నేడు హైకోర్టు తుది తీర్పు ప్రకటించిన తరువాత సమ్మెపై జేఏసీ నిర్ణయం తీసుకుంటుందని, కోర్టు తీర్పు తరవాత రెండు రోజుల్లో ఆర్టీసీ జేఏసీ నిర్ణయం వెలువరిస్తామని ఆయన చెప్పారు. జేఏసీ తుది నిర్ణయం తీసుకునేవరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందన్నారు. వివిధ సంఘాలు వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో నేతలు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.