Take a fresh look at your lifestyle.

సమాజానికి సైన్స్ ‌సామాజిక విజ్ఞానం!

మానవ సమాజం నాగరిక విజ్ఞానము నుండి ఆధునిక విజ్ఞానం వరకు పురోగతి చెందడానికి ప్రధానమైన కారణం వ్యవసాయం, నిప్పు. రెండు కూడా మానవ అభి వృద్ధిలో కీలక భూమిక పోషించినట్లు చెప్పవచ్చు. ఆటవిక జీవనం నుండి నాగరిక జీవనానికి దారులు వేసిన పైన పేర్కొన్న రెండు పరిణామాలు నేడు మనం అనుభవిస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక విజ్ఞానం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడ్డాయని చెప్పవచ్చు. సైన్స్ ‌గొప్పదా! సామాజిక విజ్ఞానం గొప్పదా, అని మనం ప్రశ్నలు వేసుకుంటే సమాజంలో రెండింటి పాత్రకు కీలకమని చెప్పవచ్చు! సైన్స్ ‌విజ్ఞానం ప్రపంచాన్ని తలకిందులు చేసే గొప్పతనాన్ని కలిగి ఉంది. మానవ జీవితంలో శాస్త్ర విజ్ఞానం ప్రభావశీల చర్చలకు పురిగొల్పుతుంది. ప్రపంచవ్యాప్తంగా సైన్స్ ‌ప్రస్థా నం ఒక్కసారి గమనిస్తే 18వ శతాబ్దంలో యూరోపియన్‌ ఆలోచనపరులు ఆధునిక సమాజాన్ని నిర్మించాలని అను కున్నారు. విజ్ఞాన శాస్త్రం మెల్లమెల్లగా అడుగులు వేస్తే నేడు మనం నిలబడినప్పుడు పై వర్తమాన సమాజాన్ని నిర్మిం చాలని భావిస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా రాజకీయ ంగా అభివృద్ధి చెందిన దేశాలు శాస్త్ర విజ్ఞానం పట్ల ఎక్కువ దృష్టి కేంద్రీకరించటం జరిగింది. ఇటువంటి సందర్భంలో విజ్ఞాన శాస్త్రం పువ్వులు పూసి కాయ కాయడం సహజమైన. మానవ మేధస్సు విజ్ఞాన శాస్త్రం.. సామాజిక శాస్త్రం రెండు సమాన స్థాయిలో అభివృద్ధి చెందినప్పుడే సమాజంలో 2 వర్గాలకు సముచిత స్థానం కలుగుతుంది. సైన్స్ ఈ ‌విష యాన్ని త్వరగా నిర్ధారించలేదు, కారణం సైన్స్ ‌కాబట్టి! సైన్స్ ‌పరిశోధన రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతూ పోతుంది. సమాజం సామాజిక విజ్ఞానం కూడా ఉపయోగించుకుంటూ ముందుకు సాగాలని ఆలోచనతో ఉంది. ఇటువంటి సందర్భంలో సైన్స్ ‌సామాజిక విజ్ఞాన ఒకదానితో ఒకటి విడదీయరాని బంధం ఉంటుందని చెప్ప డానికి బలమైన ఆధారాలు ఉన్నాయి.. చరిత్ర నుండి సైన్స్ ‌రాజకీయం, ఆర్థికం, అంశాలన్నీ పుట్టుకొచ్చిన వీటన్నింటిని ఒకే మూస నుండి తీసినప్పటికీ దీని గొప్పతనం దానిదే అన్నట్లుగా ఎవరి శక్తి మేరకు అభివృద్ధి చెందాయి. విజ్ఞానము నుండి ఆధునిక విజ్ఞానం వరకు పురోగతి చెందడానికి ప్రధానమైన కారణం వ్యవసాయం, నిప్పు. రెండు కూడా మానవ అభివృద్ధిలో కీలక భూమిక పోషించినట్లు చెప్ప వచ్చు. ఆటవిక జీవనం నుండి నాగరిక జీవనానికి దారులు వేసిన పైన పేర్కొన్న రెండు పరిణామాలు నేడు మనం అనుభవిస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక విజ్ఞా నం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడ్డాయని చెప్పవచ్చు. సైన్స్ ‌గొప్పదా! సామాజిక విజ్ఞానం గొప్పదా, అని మనం ప్రశ్నలు వేసుకుంటే సమాజంలో రెండింటి పాత్రకు కీలకమని చెప్పవచ్చు! సైన్స్ ‌విజ్ఞానం ప్రపంచాన్ని తలకిందులు చేసే గొప్పతనాన్ని కలిగి ఉంది. మానవ జీవితంలో శాస్త్ర విజ్ఞా నం ప్రభావశీల చర్చలకు పురిగొల్పుతుంది.

డబ్ల్యూ.టి.వో ప్రభావం! ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు తమకున్న ఆధు నిక టెక్నాలజీతో ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలు అన్ని ఒక ఐక్య కూటమిగా ఏర్పడి అభివృద్ధి చెందుతున్న దేశాల లో, మూడో ప్రపంచ దేశాలలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి డబ్ల్యుటివో పేరుతో అగ్రదేశాలు ప్రపంచం లోని నలుమూలల తమ వ్యాపారాలు సాగడానికి అన్ని దేశాలలో వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించినారు.1994లో వచ్చిన గ్లోబలైజేషన్‌, ‌నూతన ఆర్థిక విధానం పేరుతో పెట్టు బడి సామ్రాజ్యానికి ఎర్ర కార్పెట్‌ ‌పరిచిన విధానం ఒక్కసారి గమనిస్తే ప్రపంచంలో సామ్రాజ్యం ఈ మేరకు అభివృద్ధి చెందుతుంది చెప్పవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలలో సైన్స్ ‌పెట్టుబడిదారులు చేతిలో బందీ అయింది.ప్రపంచ దేశా లలో అభివృద్ధికి రోజు రోజుకు విస్తరిస్తున్న విషయాన్ని భారతదేశం గుర్తించడం లేదా? రష్యా, చైనా, అమెరికా, జపాన్‌, ‌వంటి దేశాలలో శాస్త్ర విజ్ఞానం ఎల్లలు దాటి పోతుంది. అమెరికా ఒకప్పుడు అంతరిక్షంలో ఆయుధాలను పెట్టి స్టార్‌ ‌వార్‌ ‌చేసే విధంగా ఎదగడానికి ప్రధానమైన కారణం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమే అని చెప్పవచ్చు. భారతదేశం ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన దేశాల ప్రక్కన నిలబడి స్థాయి కి ఎదగాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే నానో టెక్నాలజీ బయోటె క్నాలజీ వంటి రంగాలలో దూసుకుపోతున్నాయి. ప్రపంచ నాగరికతలలో సింధు నాగరికత చాలా విశిష్టమైన స్థానం కలిగి ఉంది. వాటి ప్రజలు నేడు మనం అనుభవిస్తున్న శాస్త్రీయ పరిజ్ఞానం సింధు నాగరికత ప్రజలు ఉపయోగించి నట్టు చరిత్ర పరిశోధన ద్వారా వెల్లడయింది సింధు నాగ రికతను పోలిన జీవన విధానం మనం ఈనాటికీ చేసుకోలేక పోయినా మని చెప్పవచ్చు. ఎందుకంటే గృహ నిర్మాణంలో కాల్చిన ఇటుకలతో నిర్మించిన కట్టడాలు ప్రపంచంలోని నాగరికత జీవన విధానంలో ఎక్కడ కనిపించదు . మొసపు తోమియ, ఈజిప్ట్ ‌నాగరికతలలో కనిపించవు. ఇంత గొప్ప చరిత్ర కలిగిన సింధు నాగరికత ప్రజల జీవన విధానం ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానం తో జీవించినట్టు చరిత్ర చెబు తోంది. సైన్స్, ‌దీనిని అంత త్వరగా ఆస్వాదించారు. చరిత్ర కూడా ఆధారాలు లేకుండా ఈ విషయాన్ని బట్టబయలు చేయడానికి సాహసించదు. చరిత్రకు పూర్తిగా ఆధారాలు అవసరం. పుక్కిట పురాణాలు చరిత్రలో ఎక్కడ కనపడదు పూర్తిగా పరిశోధించిన తర్వాతనే దానిని నిర్ధారిస్తుంది అం దుకే చరిత్రకు అంత ప్రాధాన్యత ఉంది. సైన్స్ ‌కూడా శాస్త్రీయ విజ్ఞానం పట్ల మొగ్గు చూపుతుంది. గత చరిత్ర ఘన కీర్తి అని మనం పిడి వాదం చేస్తూ ముందుకు పోతూ ఉంటారు. శాస్త్రవిజ్ఞానానికి సైన్స్ ఎం‌తగానో తోడ్పడుతూ మనిషికి తోడు నీడగా ఉంటుంది, అదే విధంగ సామాజిక విజ్ఞానం కూడా అదే స్థాయిలో అవసరమవుతుంది. చరిత్ర కాంగ్రెస్‌, ‌సైన్స్ ‌కాంగ్రెస్‌ ఈ ‌రెండు కూడా ఆధునిక విజ్ఞానా నికి, పక్క ఆధారాలకు దారులు వెతుకుతాయి. ఈ రెండు మనకు వేరు వేరుగా కనిపించిన సమాజానికి మాత్రం నిత్యం అవసరమవుతుంది ఇంత గొప్ప విజ్ఞాన శాస్త్రాలను ఒకటి పురాణాలతో ముడిపెట్టి ముందుకు పోతామని భావి స్తున్న కొంత మందికి ఆధునిక శాస్త్ర విజ్ఞానం వంట పట్టడం ఇష్టం లేదు.మూడ నమ్మకాలు, ఆ శాస్త్ర విజ్ఞానం, విశ్వా సాలు భారతదేశపు ఘనకీర్తిని చెప్పుకో ముందుకు పోతున్న కొంత మంది వ్యక్తులు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలలో భారతదేశాన్ని నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్న మేనా, లేదా అని ప్రశ్న తలెత్తుతుంది. నెంబర్‌ 2. ‌వర్తమాన యువ భారతీయుల మానవ సంబంధాలు ప్రాథమికంగా లోపభూయిష్టంగా నెలకొనే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యా ప్తంగా కార్పొరేట్‌ ‌కంపెనీలకు ఆధునిక విజ్ఞానాన్ని ధారపో స్తున్న మన పాలకులు దేశీయ అవసరాల కోసం ఆధునిక విజ్ఞానాన్ని వినియోగించుకోకపోవడం వర్తమానం సమాజా నికి పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న వివిధ మనస్తత్వాలు గల వ్యక్తులు ప్రపంచాన్ని ఏలాలని భావిస్తున్న వారు సమాజ అభివృద్ధి పట్ల శ్రద్ధ చూపకపోవడం వర్తమాన సమాజానికి పెద్ద విఘాతం కలుగుతుంది. సైన్స్ ‌విజ్ఞానం నేడు రాజకీయాలతో ముడిపడి ఉండడం చర్చించి దగ్గ విషయం. ఆధునిక విజ్ఞానం మంచి జీవనాన్ని అందించ డానికి దోహదపడాలి కానీ, మానవ వినాశనానికి కారణం కాకూడదని స్వార్ధపూరిత రాజకీయాలు ఉన్నంత కాలం ఆధునిక విజ్ఞానం, మన వృద్ధికి ఉపయోగపడదని భావించ వచ్చు.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చిన్న దేశాలు కార్పొరేట్‌ ‌కంపెనీలకు ఎర్ర తివాచీలు పరుస్తూ దమ్మున్న విజ్ఞానాన్ని వారు చేతులు పెడుతుంది, ప్రైవేట్‌ ‌పెట్టుబడి దారుణం అసాధారణమైన పరిజ్ఞానంతో ఉత్పత్తి చేస్తున్న వస్తువులు మానవుడు ఉపయోగించక తప్పడం లేదు, ముద్దుగా దాని ఉపయోగం ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేస్తూ మెల్ల మెల్లగా అన్ని దేశాలలో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి లాభాలను గడిస్తున్న పెట్టుబడిదారులు వర్తమాన రాజకీయా లను కూడా శాసించే స్థాయికి ఎదుగుతారని ఇప్పటికే ప్రపం చంలో చాలా దేశాలలో పెట్టు బడిదారుల చేతిలో రాజకీయ నాయకులు ఉంటున్నారు. మూడ వది మానవ జీవన విధానం ప్రభావం చూపుతున్న పర్యావ రణం రోజురోజుకు కలుషిత మవుతున్న విధానాన్ని పత్రికల ద్వారా ప్రసార సాధనాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. ప్రపంచంలో వాతావరణ మార్పులను ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు పాలకులను ఎప్పటి కప్పుడు అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కార్పొరేట్‌ ‌కంపెనీ చేతిలో ఉన్న రాజకీయ వ్యవస్థ మార్పులను సమ తులం చేయడానికి ముందుకు రాకపోవడం గమనించదగ్గ విషయం. వాతావరణంలో వేడి పెరగడం వల్ల రానున్న రోజుల్లో ఒక ప్రాంతాలలో సముద్రతీర ప్రాంతాలలో నివసి స్తున్న ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్ర వేత్తలు హెచ్చరిస్తున్న ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి ఆప గలిగే శక్తి సైన్స్ ‌కున్నప్పటికీ ఇది నూటికి నూరుపాళ్లు రాజకీయాలతో ముడిపడి ఉండడం వల్ల చేయలేకపోతున్నా రని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేడి పెరిగి పోవడం వల్ల వ్యవసాయం ప్రధానంగా నష్టపోతుంది. వ్యవసాయ రంగం క్షీణించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న వస్తువులను నివారించ డానికి మన రాజకీయ శక్తి సరి పోవడం లేదా! ముందుగా మనం అనుకున్నట్లుగా ప్రపంచమంతా అరచేతిలో స్వర్గం చూసుకునే విధంగా రాజకీయ వ్యవస్థ ముందుకు పోతుంది. శాస్త్రీయ పరంగా వర్తమానం ప్రమాదాన్ని అంచనా వేస్తున్నారు ఆధునిక సైన్స్ ‌శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు ఒకరినొకరు సమాజం పట్ల బాధ్యతగా పనిచేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విశ్వవి ద్యాలయాలలో ఆధునిక విజ్ఞానం పరిశోధన విధానమంతా పెట్టుబడిదారీ వ్యవస్థకు దాసోహం అనే విధంగా ఉందని మేధావులు భావిస్తున్నారు! ఏది ఏమైనా విశ్వవిద్యాలయాల స్థాయిలో సైన్స్, ‌సోషల్‌ ‌సైన్స్ ఈ ‌రెండును కూడా సమాజా నికి అవసరమని భావించి వర్తమాన సమాజానికి ఉపయోగ పడే విధమైన విజ్ఞానాన్ని పెంపొందించడానికి మేధావుల సూచనలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్ప టికే భారతదేశంలో ఉన్నత విద్యను సమూలంగా మార్చి ఆధునిక విజ్ఞానాన్ని అందించడానికి, అటువైపుగా ప్రభు త్వాలు పటిష్ట మైన చర్యలు తీసుకుంటే రానున్న రోజులలో భారతదేశం కూడా శాస్త్ర విజ్ఞానంలో దూసుకుపోవడానికి వర్ధమాన దారులకు వేయాల్సిన అవసరం ఎంతైనాఉంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy