Take a fresh look at your lifestyle.

సమస్యకూ చావే పరిష్కారం కాదు

చచ్చికాదు బతికి సాధిద్దాం.. క్షణికావేశం జీవితాన్ని చిదిమేస్తుంది

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తీవ్ర దిగ్బ్రాంతిని కలుగ చేస్తు న్నాయి. హైద రాబాద్‌లో కరోనా సోకిందన్న భయంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇం‌జనీర్‌ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. సుశాంత్‌ ‌సింగ్‌ ‌రాజ్‌పుత్‌ ‌బాలీవుడ్‌ ‌నటుడు ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని మరణించాడు. ఇటీవల జరిగిన కేఫ్‌ ‌కాఫీ డే యజమాని, కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం ‌కృష్ణ అల్లుడు వీజీ సిదార్థ నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన బలవన్మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాం శమైంది. జనగామ జిల్లాలో జరిగిన ఒక సంఘటనలో సర్పంచ్‌ ‌చెప్పుతో కొట్టాడని మన స్థాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు స్మార్ట్‌ఫోన్‌ ‌లేదని ఆన్‌లైన్‌ ‌క్లాసులు వినలేకపోతున్నామని విద్యార్దులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ ‌క్లాసులు అర్థం కావడం లేదంటూ ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో సంవత్సరానికి 8 లక్షల మంది పైగా, ప్రతి 40 సెకనులకు ఒక్కరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇండియాలో దాదాపుగా రెండు దశాబ్దాల నుండి ఆత్మహత్యల రేటు పెరుగుతుందని ఇది ఆందోళనకరమైన అంశం.ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నవారిలో 40 సంవత్సరాలలోపు 80% మంది, ప్రతి 20 మందిలో ఒకరు చనిపోతున్నారని, విషం ద్వారా 36.6% మంది, ఉరి వేసుకోవడం ద్వారా 32.1%, ఇతర మార్గాల ద్వారా 7.9% మంది, నేడు సాంకేతికంగా ఎంతో అభివృద్ది చెందుచున్నప్పటికి యువత, ఉద్యోగులు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతు న్నారని గణాంకాలు తెలియచేస్తున్నాయి.

క్షణికావేశం జీవితాన్ని చిదిమేస్తుంది క్షణికావేశంలో తీసుకొనె నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఆత్మహత్యలకు పురిగొల్ప బడుతాయి. మనపై ఆధారపడిన, చిన్నప్పటి నుండి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిలించడం భావమా. జీవితంపై సరైన అవగాహన, దృక్పథం లేకపోవడం మూలంగా ఆత్మహత్య ఆలోచనలు మదిని తొలచివేస్తూ ఉంటాయి. సమస్యలకు పరిష్కారమే లేదని భావిస్తున్నారు. ఒక్క క్షణం సానుకూలంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం కళ్లముందు కనిపిస్తుంది. ఆత్మహత్య భావనలు కలుగుటకు కారణాలు: ఆత్మహత్యలకు ఎన్నో కారణాలు ప్రధానంగా మారుతున్న కాలానుగునంగా మారలేకపోవడం, తనపై తనకు నమ్మకం సన్నగిల్లడం, ఆత్మన్యూనత, జీవితంలో ఎదురయ్యే సంఘటనలు ఎదుర్కోవాలనే ఆలోచనలు తక్కువ కావడం, ప్రతి దానికి ఇతరులతో తమనుతాము పోల్చుకుని ఆత్మన్యూనతతో భావనలను కలిగిఉండడం, ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించి అతిగా ఆలోచిస్తూ బాధపడడం, కొన్ని సంఘటనలు జరుగుతాయని భావించి అనవసరమైన విషయాలను ఊహించుకుని భయపడడం, సామాజిక అంశాలు కూడా ఒక్కోసారి ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంటాయి. ఆత్మహత్యలకు పాల్పడు వారిలో ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరిగిన ఆర్థిక నష్టం భరించలేక, ఉద్యోగం సాధించటంలో వైఫల్యం పొందినవారు, భౌతిక, లైంగిక వేధింపులకు గురికావడం, కుటుంబ సామాజిక సంబంధాల లోపం, సమాజంలో స్తాయి కోసం శక్తికి మించి పనులు చేయడం, వృద్దాప్యంలో నిరాదరణకు గురికావడం, ప్రేమలో వైఫల్యం పొందడం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతూ, మానసిక వేదనతో, ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు అనిపించి నవారు, సమాజంలో పరువు పోతుందన్న భయంతో బాధప డుతున్నవారు, చదువులో వెనుక బడినవారు, తల్లి దండ్రుల ఆశయాలు నెరవేర్చలేక పోతు న్నామను కునేవారు, మత్తుమందులు, మాదక ద్రవ్యాలకు అల వాటుపడిన వారు బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న వారు, పెద్దవారిలో అయితే కుటుంబ, ఆస్తి తగాదాల కారణంగా వివాహేతర సంబంధాలున్నవారు, దంపతుల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం లేక అనుమానించుకునే వారు, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలో వైఫల్యం ఇలా పలు కారణాలు ఉన్నాయి.

ఆత్మహత్యకు పాల్పడే వారిని ముందుగా గుర్తించగలమా: ఆత్మహత్యకు పాల్పడే ముందుగా వీరిలో కొన్ని మార్పులు గమనించవచ్చు. ఒంటరి తనం నకు ఇష్టపడటం,మద్యం అతిగా సేవించటం, ప్రతికారం తీర్చుకోవడం గురించి ఎక్కువగా మాట్లాడటం, తీవ్ర మానసిక ఒత్తిడిని ప్రదర్శించడం,అతిగా నిద్ర పోవడం,రాత్రి సమయంలో నిద్ర పోకుండా అతిగా ఆలోచించడం, అనవసర (ప్రాధాన్యతలేని) విషయాల పట్ల అతిగా స్పందించటం, అసలు స్పందించక పోవటం, చనిపోతున్నాని ముందుగానే పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి చేష్టలను ముందుగానే స్నేహితులు, కుటుంబసభ్యులు పరిశీలించి సైకాలజిస్ట్ ‌ను సంప్రదించడం ద్వారా కౌన్సెలింగ్‌, ‌సైకాలజికల్‌ ‌థెరపీ ద్వారా కొంత వరకు ఆత్మహత్య ఆలోచలను నివారించవచ్చును. దైర్ఘ్యం చెప్పెవారు లేక : ప్రస్తుత కాలంలో కుటుంబ వ్యవస్థ కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడుతోంది.

కుటుంబంలో సమస్యలు వస్తే ఓదార్చే వారు కరువయ్యారు. గత తరంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఏదైనా సమస్య వస్తే కుటుంబ సభ్యులతో చర్చిస్తే తాతయ్య, బామ్మ, పెదనాన్న, పెద్దమ్మ, అన్నయ్య ఎవరో ఒకరు ఓదార్పు నిచ్చేవారు. స్తాయికి మించి లక్ష్యనిర్దారణ: స్తాయికి మించి లక్ష్యాలను పెట్టుకోవడం వాటిని చేరుకోలేక ఏం చేయాలో తెలియక, చెడు ఆలోచనలు మనసులో చేరడం మూలంగా ఆత్మహత్యల ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. ఆత్మహత్యలకూ భారత్‌ ‌దే అగ్రస్తానం: ఆత్మహత్యల్లో భారత దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో పత్రీ 40 సెకన్లకు ఒక ఆత్మహత్య జరుగుతుండగా, మన దేశంలో ప్రతీ రెండు నిమిషాలకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో 15 నుంచి 29 ఏళ్లలోపు వారే ఎక్కువ కావడం, మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఆత్మహత్యలు పెరుగుతున్నాయి: గతంతో పోల్చితే ఆత్మహత్మలకు పాల్పడేవారి సంఖ్య నానాటికి పెరుగుతున్నది. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం, మానవ సంబంధాలు తగ్గడం, వ్యక్తులలో జీవన నైపుణ్యాలు కొరవడడమే ప్రధాన కారణం. ప్రస్తుత ఆధునిక జీవన విధానంలో చిన్న సమస్యను పరిష్కరించుకోలేక చావే పరిష్కారమని భావిస్తున్నారు.

భరోసాను కల్పించే కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం కావడం: గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండడం వల్ల ఏదైనా సమస్య వస్తే తాతయ్య, బామ్మలు, బాబాయి, పిన్ని, సోదరులు కలిసి చర్చించుకునే వారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ద్వారా కొంత ఓదార్పు లభించేది. ప్రస్తుత పరిస్తితులు భిన్నంగా ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. సమస్యకు ఎదురొడ్డి నిలిచినపుడే జీవితానికి సార్థకత : చిన్న రంధ్రం కూడా పెద్ద నీళ్ల ట్యాంకును ఖాళీ చెయ్యగలదన్నట్లు చిన్న చిన్న మానసిక రుగ్మతలు కూడా మనిషి జీవితాన్ని మద్యలోనే చాలించేలా చేస్తుంది, గెలుపునకు తుది మెట్టు అంటూ ఏది ఉండదు, ఓటమి అన్నది ఎప్పుడు అపాయకారి కాదు. మనకు ఈ రెంటిని సాధించాల్సిన దానికి కావాల్సింది ఒక్కటే దైర్ఘ్యమే.ఓ పదవ తరగతి చదివే విద్యార్థి పదవతరగతి ఫెయిల్‌ అయ్యానని ఆత్మహత్యకు పాల్పడితే ఒక్కగానొక్క కొడుకు మరణంతో అతని తల్లిదండ్రులు చిక్కి శల్యమై జీవచ్చవాలుగా మారారు. ఓ రైతు సాగుచేసి పంట చేతికందే సమయానికి వర్షాలతొ పంట నష్టం జరిగి, పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడితే అతనిపై ఆధార పడిన కుటుంబం వీధి పాలయింది. చదివిన చదువుకు సరైన ఉద్యోగం రాక ఓ నిరుద్యోగి, సాఫ్ట్ ‌వేర్‌ ఉద్యోగి కంపెనీ టార్గెట్‌ ‌లను చేరుకోలేక ఆ ఉద్యోగి, కుటుంబ సమస్యలతో ఒకరు, ఆర్థిక సమస్యలతో మరొకరు ఇలా చాల మంది బలవన్మరణాలకు గురవుతున్నారు.

కలసి పని చేద్దాం ఆత్మహత్యలు నివారిద్దాం ఆత్మహత్యల నివారణకు సామాజిక చైతన్యం తీసుకు వద్దాం
ఆత్మహత్యను అడ్డుకోవడంలో కలిసి పనిచేయడం చాలా కీలకమైంది. ఆత్మహత్య ఆలోచనలను అడ్డుకోవడం, ఆత్మహత్యల నివారణలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు, సమాజంలోని విద్యావేత్తలు, మత నాయకులు, ఆరోగ్య నిపుణులు, రాజకీయ నాయకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషి చాలా అవసరం. ఆత్మహత్యకు బాధపడుతున్న వారు స్వయంగా సహాయం కోరుకునే అవకాశం లేదు, కాబట్టి తల్లిదండ్రులు, ఇంటి ఆవరణలోని మిత్రులు, పాఠశాల లేదా కాలేజి ఉపాధ్యాయులు, బందువులు, సహచరులు ఆత్మహత్యకు హెచ్చరిక సూచనలు గ్రహించి ముందుగా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాద్యత గుర్తించాల్సిన అవసరం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో తెలియని వ్యక్తులను కూడా సహాయం అడుగుతాం. అలాంటిది జీవితంలోని కొన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి సహాయం అడగటానికి ఇబ్బందేముంది? ఎవరూ జీవితంలో అన్ని బాధ్యతలనూ ఒంటరిగా తలకెత్తుకోలేరు. అందుకని భాగస్వామినుంచో, స్నేహితుడి నుంచో, కుటుంబ సుభ్యుల నుంచో, సహోద్యోగుల నుంచి సహాయం తీసుకోవడం తప్పుకాదు.

  • ఆత్మహత్యకు పాల్పడే చర్యలను గుర్తించినపుడు వారి కోసం ప్రత్యేక మైన చర్యలు తీసుకోవాలి. ఆహ్లాదకరమైన వాతావరణంను కల్పించడం.
  • చావు ద్వారానే సమస్యకు పరిష్కారం రాదు అనే విషయాన్ని గుర్తంపచేయాలి.
  • జీవిత విలువలను గుర్తింపచేసేవిధంగా ప్రేరణ కల్పించాలి.అభయ హస్తం అందించాలి.
  • ఒంటరిగా ఉండకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి సంభాషణను కొనసాగించేలా చర్యలు ఉండాలి.
  • సైకాలజిస్ట్ ‌ను కూడా స్నెహితులు గా గుర్తించి తగు సలహాలు సూచనలు తీసుకొనేవిధంగా ప్రోత్సహించాలి.

డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి
రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌, 9703935321

Leave a Reply