Take a fresh look at your lifestyle.

సమర్థ వంతంగా స్టేట్‌ ‌లిటిగేషన్‌ ‌పాలసీ అమలు

జాప్యం లేకుండా కేసులు సత్వర పరిష్కారానికి అవకాశం
సమగ్ర నిర్వహణతో ప్రభుత్వ లిటీగేషన్ల భారం తగ్గుతుంది
మేనేజ్మెంట్‌ ‌సిస్టమ్‌ ‌ద్వారా కేసుల డేటాబేస్‌ ‌నిర్వహణ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్‌ ‌దాస్‌.
అమరావతి,జులై 31 : నూతనంగా తీసుకురానున్న స్టేట్‌ ‌వ్యాజ్యం లసీని సమర్థ వంతంగా అమలు చేస్తే జాప్యం లేకుండా కేసులు సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్‌ ‌దాస్‌ ‌పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో వ్యాజ్యాలు అంశంపై న్యాయ అధికారులు,కార్యదర్శులతో ఇంటరాక్టివ్‌ ‌సమావేశం జరిగింది. ఈసమావేశంలో పాల్గొన్న సిఎస్‌ ‌మాట్లాడుతూ స్టేట్‌ ‌లిటిగేషన్‌ ‌పాలసీని నిరంతరం మానిటర్‌ ‌చేస్తూ పటిష్టంగా అమలు చేస్తే కేసుల్లో జాప్యాన్ని నివారించి సత్వరం పరిష్కారం అయ్యేలా చూడవచ్చని అన్నారు.ఈ విధానంతో కేసులు వివరాలు ప్రభుత్వ న్యాయవాదులకు, ప్రభుత్వ శాఖలు అధికారులకు ఎప్పటికప్పుడు తెలుస్తాయని తద్వారా సకాలంలో ఆయా కేసుల్లో కౌంటర్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేగాక ఈ విధానాన్ని సమన్వయంతో ఒక నిర్దిష్ట కాలవ్యవధి తో నిర్వహించ గలిగితే కోర్టులపై ప్రభుత్వ వ్యాజ్యాల భారాన్ని తగ్గించ వచ్చని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా స్టేట్‌ ‌ప్రాసిక్యూషన్‌ ‌సర్వీస్‌ ‌ను మరింత బలోపేతం చేసేందుకు ఈ పాలసీ దోహదం చేస్తుందని సిఎస్‌ ఆదిత్యా నాధ్‌దాస్‌ ‌చెప్పారు. అందుకే ఎపి ఆన్‌ ‌లైన్‌ ‌లీగల్‌ ‌కేస్‌ ‌మేనేజ్మెంట్‌ ‌సిస్టమ్‌ ‌ను ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు.దానివల్ల జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులకు సంబంధించిన వివిధ వ్యాజ్యాల సమగ్ర డేటాబేస్‌ అం‌దుబాటులో ఉంటుందని సిఎస్‌ ‌పేర్కొన్నారు.

దీనిపై ప్రభుత్వ శాఖల అధికారులకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సిఎస్‌ ఆదిత్యా నాధ్‌ ‌దాస్‌ ‌చెప్పారు. సమావేశంలో రాష్ట్ర అడ్వకేట్‌ ‌జనరల్‌ శ్రీ‌రాం మాట్లాడుతూ ప్రభుత్వ న్యాయవాదులు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే కేసులు సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందని ఆదిశగా కృషి చేయాలని కోరారు. అంతకు ముందు ఈసమావేశంలో నూతన లిటిగేషన్‌ ‌పాలసీపై విస్తృతంగా చర్చించారు.అదేవిధంగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఆయా శాఖలకు సంబంధించిన విధానాలు,నిబంధనల ప్రేమ్‌ ‌వర్క్ ‌గురించి ప్రభుత్వ న్యాయవాదులకు నిరంతరం వివరించే మెకానిజం ఏర్పాటు చేయడం ద్వారా వివిధ వ్యాజ్యాలు అడ్మిషన్‌ ‌స్థాయిలోనే కంటెస్ట్ ‌చేసేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అదే విధంగా వివిధ వ్యాజ్యాలపై పీరియాడికల్‌ ‌సక్ష, ఫెల్యూర్‌ ‌పై జవాబుదారీతనాన్ని ఫిక్స్ ‌చేయడంపై న చర్చించారు. అంతేగాక ఆ•-లనైన్‌ ‌కేసు లోడ్‌ ‌మేనేజిమెంట్‌ ‌సిస్టమ్‌ అమలు విధానం పైన సక్షించారు.అడ్వకేట్‌ ‌జనరల్‌, ‌గవర్నమెంట్‌ ‌ప్లీడర్ల (ఉఖ)లో కార్యాలయాలను మరింత బలోపేతం చేయడం తోపాటు ఆకార్యాలయాల్లో ఆన్‌ ‌లైన్‌ ‌కేసు లోడ్‌ ‌మేనేజిమెంట్‌ ‌సిస్టమ్‌ను ప్రవేశ పెట్టడంపై చర్చించారు. అంతేగాక ప్రతి ప్రభుత్వ శాఖలోను లైజన్‌ అధికారులు, లీగల్‌ ఆడ్వయిజర్లను నియమించుకునే అంశంపై చర్చించారు. కోర్టు కేసుల నిర్వహణ పై మార్గదర్శకాలు జారీ, అధికారులకు అవగాహన అంశాలపై చర్చించారు. ఈసమావేశంలో ,రాష్ట్ర ఆదనపు అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌పి.సుధాకర్‌ ‌రెడ్డి,న్యాయ శాఖ కార్యదర్శి వి.సునీతతో పాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు, పలువురు న్యాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply