ఒక్కోక్క పనికి ఒక్కో రేటు-చేయి తడపనిదే పని కావట్లేదు
సూర్యాపేట, జులై 26(ప్రజాతంత్ర ప్రతినిధి) : సూర్యాపేట జిల్లా జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కార్యాలయానికి వచ్చే ప్రజల నుండి అక్రమ వసూళ్లకు కోసం ప్రజలను పీడిస్తున్నారని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ ఆరోపించారు.సోమవారం ఆ సంఘ నాయకులతో కలిసి రిజిస్ట్రేషన్ కార్యాలయ%శీ%లో జరుగుతున్న అక్రమదందాపై కార్యాలయం ముందు ఘాటుగా స్పందించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులు,సిబ్బంది చాక చక్యంగా డాక్యుమెంటరీ రైటర్లను ప్రేరేపిస్తూ అనేక వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.ఈ విషయంపై ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు విన్నవించినప్పటికీ తూ తూ మంత్రంగా పర్యవేక్షణ చేపడుతూ వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇందుకు పై అధికారుల హస్తం ఏమైనా ఉండొచ్చా అనే అనుమాన%శీ% వ్యక్తం చేశారు.రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే ప్రజల నుండి పనిని బట్టి ఒక్కోరేటుగా నిర్ణయించి అక్రమ వసూళ్లుకు పాల్పడుతున్నట్లు తెలుస్తోందన్నారు.అధికారులు, సిబ్బంది చేయి తడపనిదే ఏ పని జరగడం లేదని అభిప్రాయ పడ్డారు. వివాహ రిజిస్ట్రేషన్,ఇల్లు, అపార్టుమెంట్లు వంటి తదితర రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ఓ ధరను నిర్ణయించింది.కానీ ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే 50 శాతానికి పైనే ఇక్కడి సిబ్బంది వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పంతంగి వీరస్వామి గౌడ్ తెలిపారు.ఇదంతా కార్యాలయ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందని కూడా వెలిబుచ్చారు. రిజిస్ట్రేషన్ కార్యాల యంలో అధిక వసూళ్ల తంతూ ఇప్పటి నుంచి జరుగుతుంది కాదని,దీనిపై ఉన్నత స్థాయి అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విషయంలో ధరణి వెబ్సైట్ పెట్టడంతో పాటు, ఎక్కడ అవినీతి జరగటానికి వీలు లేకుండా ప్రభుత్వం నూతన పద్ధతుల్లో అనేక చర్యలు తీసుకుంటున్న ప్పటికి సూర్యాపేట జిల్లా అధికారులు మాత్రం అవేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇటీవల కాలంలో బాండ్ పేపర్లు లభ్యం కాకపోవడంతో బాండ్ పేపర్లను సైతం అధిక ధరలకు అమ్ముకొని ప్రజలను పిండేస్తునట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయని ఆయన అన్నారు.ఇంత జరుగుతున్నా ఎందుకు పై అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తుం డటం పట్ల జిల్లా కలెక్టర్ గారే నేరుగా కార్యాలయ అధికారులపై పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు.ఏదేమైనా ఇప్పటికైనా అధికారులు స్పందించి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకొని రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే ప్రజలను కలెక్టర్ గారు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు,జిల్లా ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య,పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, పట్టణ ప్రదాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న, పట్టణ ఉపాధ్యక్షుడు కడారి అంజయ్య,నాయకులు బానోతు జానీ నాయక్, మందాడి గోపాల్ రెడ్డి, ఆకుల మారయ్య, అంజయ్య,సారగండ్ల కొటేశ్, కొప్పు లక్ష్మీ నారాయణ, చిలివేరు రమేష్, పర్వతం వెంకటేశ్వర్లు, పందిరి మల్లేష్, పట్టేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.