Take a fresh look at your lifestyle.

సత్ఫలితాలు ఇస్తున్న కొరోనా కట్టడి చర్యలు

  • దేశంలో తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసులు
  • కొత్త గా 3లక్షలకు దిగువన నమోదు
  • ఒక్కరోజే 4,106 మంది మృత్యువాత

కొరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసబెట్టి పెరుగుతున్న కేసులు లాక్‌డౌన్‌ ‌కట్టడి కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కొరోనా విషయంలో కేర్‌ ‌తీసుకోవడంతో కేసుల సంఖ్య గత నాలుగు రోజులుగా కాస్త తగ్గుతూ వస్తోంది. నాలుగు రోజులకు ముందు 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యేవి. ఆ తరువాత రోజురోజుకూ ఆ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దేశంలో కొత్తగా 2,81,386 కొరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 4,106 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 35,16,997 యాక్టివ్‌ ‌కేసులున్నాయి. కొరోనా కేసుల సంఖ్య మొత్తంగా 2.49 కోట్లకు చేరుకుంది. దేశంలో కొరోనాతో ఇప్పటి వరకు 2,74,390 మంది మృతి చెందారు. దేశంలో కొరోనా కేసులు 3 లక్షల దిగువకు నమోదయ్యాయి. కానీ మరణాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో 4,106 మంది మరణించగా…2,81,386 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తంగా 2,49,65,463లకు కేసులు చేరుకోగా…2,74,390 మంది మరణించారు.

గడిచిన 24 గంటల్లో 3,78,741 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా 2,11,74,076 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో క్రియా శీలక కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. 35,16,997 యాక్టివ్‌ ‌కేసులున్నాయి. మహారాష్ట్రలో 34,389 కేసులు, తమిళనాడు 33,181, కర్ణాటక 31,531, కేరళ 29,704, ఆంధ్రప్రదేశ్‌ 24,171 ‌కేసులున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల నుండే సుమారు 54.37 కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొత్తంగా కొరోనా•తో అల్లాడిపోయిన భారత్‌ ‌లో క్రమేపీ వైరస్‌ ‌తగ్గుముఖం పట్టనట్లే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా 4 లక్షలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 84.25 శాతంగా ఉండడం గమనార్హం. మరణాల రేటు 1.09గా ఉంది. ఢిల్లీ, యూపీ, తెలంగాణ, బీహార్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌గోవా, ఛత్తీస్‌ ‌ఘడ్‌, ‌గుజరాత్‌, ‌జార్ఖంఢ్‌ ‌రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఏపీ, కేరళ, ఉత్తరాఖండ్‌, ‌హిమాచల్‌‌ప్రదేశ్‌, ‌తమిళనాడు రాష్ట్రాల్లో కొరోనా కేసులు అధికమౌతున్నాయి. ఇకపోతే దేశ వ్యాప్తంగా 18,29,26,460 మందికి వ్యాక్సిన్లు వేశారు.

Leave a Reply