Take a fresh look at your lifestyle.

షీలా దీక్షిత్‌ ‌హఠాన్మరణం

కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ..
పలువురు ప్రముఖుల సంతాపంఢిల్లీ కి మహిళా సీఎం గ మూడు సార్లు విజయవంతంగా ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత షీలా దీక్షిత్‌ (81) ‌శనివారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. సీనియర్‌ ‌మహిళా నేతగా ఎన్నో సందర్భాల్లో తన ప్రత్యేకతను చాటుకున్న
షీలా మరణం దేశంలోని అన్ని పార్టీల నాయకులను నిర్ఘాంత పరిచింది. దేశ రాజధాని అయినా, ఢిల్లీకి వున్నా ప్రత్యేకత దృష్టా ఆమె అమలు పరిచిన పలు ప్రభుత్వ సంక్షేమ పధకాలు విశేష జనాదరణకు నోచుకున్నాయి. ఎంపీ గా, మూడు సార్లు సీఎం గా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఆమె పలు కీలక పదవులు నిర్వహించారు. ఒకానొక సమయంలో ఆమె ఢిల్లీ రాజకీయాలు వదిలే అవకాశం వస్తే కీలకమైన మంత్రిగా అవకాశం వచ్చే ఛాన్స్ ‌వున్నా ఢిల్లీని వదిలే ఆసక్తి చూపలేదనేది కాంగ్రెస్‌ ‌వర్గాల్లో వున్న సీనియర్‌ ‌నాయకుల మనోగతం.
సాంప్రదాయ పంజాబీ ఖత్రి కుటుంబంలో జన్మించిన షీలా ఆ కాలంలోనే చరిత్ర లో మాస్టర్స్ ‌డిగ్రీ చేసారు. ఎలాంటి సమస్య పట్ల లోతైన అవగాహనను పెంచుకొనే వరకు ఒక నిర్ణయానికి వచ్చేవారు కాదు. ఆమె వున్నత విద్య, నిర్ణయాలు తీసుకునే విషయంలో పాటించే సంయమనం ఆమె ప్రత్యేకతను చాటి చెప్పింది. ఢిల్లీ కి 1998 నుండి 2003 వరకు 15 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం సీఎం గా పని చేసిన ప్రత్యేకత ఆమెది. ఆమె భర్త వినోద్‌ ‌దీక్షిత్‌ ఇం‌డియన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ‌సర్వీస్‌ ‌లో పనిచేసారు. కుమారుడు సందీప్‌ ‌దీక్షిత్‌ ‌తూర్పు ఢిల్లీ నుండి ఎంపీ గా పని చేసారు. ఆమె కూతురు లతికా సయ్యద్‌ ‌పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు.
నేటి మధ్యాహ్నం షీలా దీక్షిత్‌ అం‌త్యక్రియలు
స్వగృహానికి పార్థివదేహం తరలింపు
కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ ‌మృతి ఢిల్లీవాసులతో సహా ఆమె అశేషాభిమానులను విషాదంలో ముంచెత్తింది. పార్టీలకు అతీతంగా సంతాప సందేశాలు వెల్లువెత్తున్నాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకురాలు షీలా దీక్షిత్‌ ‌మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌, ‌ప్రధాని నరేంద్ర మోదీ,ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌ఢిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌, ‌కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌రాహుల్‌ ‌గాంధీ, ఓమర్‌ అబ్దుల్లా, కాంగ్రెస్‌ ‌పార్టీ తదితరులు సంతాపం తెలిపారు. ఢిల్లీ అభివృద్ధిలో షీలా దీక్షిత్‌ ‌విశేష కృషి చేశారని ప్రధాని మోదీ అన్నారు. షీలా దీక్షిత్‌ ‌మృతి ఢిల్లీకి తీరని లోటని కేజీవ్రాల్‌ ‌పేర్కొన్నారు. ఢిల్లీకి సుదీర్ఘకాలంపాటు పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆమె పేరుపొందారు. ’కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రియమైన నేత షీలా దీక్షిత్‌ ‌మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా’ అని రాహుల్‌ ‌గాంధీ ట్వీట్‌ ‌చేశారు. కాగా, ఆమె భౌతిక కాయాన్ని నిజాముద్దీన్‌లోని ఆమె నివాసానికి తరలించారు. ఆమె పార్థివ దేహాన్ని ఆదివారంనాడు ప్రజాసందర్శనార్థం కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాలయంలో ఉంచి, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నిగమ్‌బోధ్‌ ‌శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 81 ఏళ్ల షీలాదీక్షిత్‌ ‌శనివారం మధ్యాహ్నం 3.55 గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy