ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో బాగంగా మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు శానిటైజర్లు, మాస్క్‌లు వితరణగా అందజేసారు. ఖమ్మంలోని జిల్లా పరిషత్ హాల్లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్‌కు అందజేసారు. ఈ సందర్బంగా మంత్రి అ•య్ మాట్లాడారు.
అనంతరం ఆయా సామాగ్రిని జిల్లాలో పనిచేస్తున్నవారందరికి అందజేయా లని మంత్రి కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి బాలసాని లక్ష్మీనారా యణ, మేయర్ డాక్టర్ పాపాలాల్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, రాష్ట్ర విత్తనాభివృధ్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎంఎల్ఏలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్, అదనపు డిసిపి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.