Take a fresh look at your lifestyle.

వ్యాక్సిన్ తయారీ సంస్థలకు 24 గం.ల్లో అనుమతులు..!

కనిపించని శత్రువు తో పోరాటం..
16 కంపెనీలతో ఫార్ములాను పంచుకునేందుకు ఒప్పందం…: కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ,మే15:వ్యాక్సిన్ల తయారీ గురించి, ఇతర దేశాల వ్యాక్సిన్ లను భారత్ లో అనుమతించడానికి సంబంధించి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై తొలిసారి తెలుగు మీడియాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. వంద ఏండ్ల తర్వాత భారత్ తో పాటుగా ప్రపంచ దేశాలు కరోనాతో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి అని కిషన్ రెడ్డి అన్నారు. ఇండియాతో పాటు, ప్రపంచ దేశాలు కనిపించని ఈ శత్రువుతో పోరాడుతున్నాయి. వ్యాక్సినేషన్ అనే యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది అని కిషన్ రెడ్డి అన్నారు. వ్యాక్సిన్ తయారీ స్పీడప్ చేసేలా కేంద్రం అనేక చర్యలు చేపట్టింది అని కిషన్ రెడ్డి చెప్పారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో ఆయా కంపెనీలకు అనుమతులు కేంద్రం ఇస్తున్నది అని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం దేశంలో కోవ్యాక్సిన్, కో వాగ్జిన్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నాయి అని తెలుపుతూ.. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాక్సిన్ ప్రపంచంలోనే 5,6 వ్యాక్సిన్ స్థానంలో నిలిచి అగ్రస్థానంలో ఉంది అని అన్నారు. ఈ వ్యాక్సిన్ పై రాహుల్ తో పాటు పలువురు పొలిటికల్ లీడర్లు తీవ్ర ఆరోపణలు చేశారు అని గుర్తు చేశారు.దీన్ని మోడి వ్యాక్సిన్, బిజేపి వ్యాక్సిన్ అని నామకరణం చేస్తూ విమర్శలు గుప్పించారు అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.ఇప్పటికి 16 కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తులు, ఫార్ములాను పంచుకునేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి అని తెలిపారు.

వ్యాక్సినేషన్ పై ప్రజలు భయాందోళనకు గురికావద్దు అని అపిల్ చేశారు. డిసెంబర్ నాటికి దేశంలో 259 కోట్ల వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి అని మంత్రి అన్నారు. ప్రస్తుతం దేశ జనాభా 150 కోట్లుకు చేరువగా ఉంది వీరి కోసం 300 కోట్ల డోస్ లు అవసరం అవుతాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో చైనా, అమెరికా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది అని తెలిపారు. సెప్టెంబర్ నాటికి ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్ గా ఉంటుంది అని అన్నారు. మిలియన్ పాపులేషన్ లో పాజిటివిటీ రేటు, మరణాల్లో భారత్ ప్రపంచలోనే 110 వ స్థానంలో ఉంది అని చెప్పుకొచ్చారు. జనాభా ఎక్కువ, వైద్య పరికరాలు తక్కువ అయినా భారత్ వైరస్ తో సమర్థవంతంగా పోరాడుతోంది అని కితాబిచ్చారు. ఒక్క ఏడాదిలో వ్యాక్సిన్ కనుగొనడం, వ్యాక్సిన్ తయారీ, సరఫరా ఛాలెంజ్ తో కూడుకున్నది అని, ఢిల్లీ నుంచి కుగ్రామం వరకు ఉచితంగా వ్యాక్సిన్ అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి అని ప్రస్తుత తన ప్రభుత్వన్ని పొగుడుకున్నారు. కేంద్రం 50 శాతం వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తుంది అని కిషన్ రెడ్డి చెప్పారు. 17 బిజేపి పాలిత రాష్ట్రాలు మిగితా రాష్ట్రాలు 50 శాతం వ్యాక్సిన్లను ఫ్రీ గా అందిస్తున్నాయి అని తెలిపారు.

తెలుగు రాష్ట్రాలైన ఏపి, తెలంగాణ కూడా 50 శాతం వ్యాక్సిన్ ఉచితం ఇస్తుండటం సంతోషం అన్నారు. గతేడాది దేశంలో 5, 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి జరిగేది ప్రస్తుతం 9, 446 మెట్రిక్
టన్నులకు ఈ సామర్థ్యం పెరిగింది అన్నారు. కేవలం 4.25 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు ఉండేవి, ఇప్పుడు 11. 19 లక్షలకు పెరిగాయి అన్నారు. దేశ వ్యాప్తంగా కేవలం 6 వందల హాస్పిటల్స్ కు ఆక్సిజన్ అందేది ప్రస్తుతం 9 వందల హాస్పిటల్స్ కు ఆక్సిజన్ అందుతోంది అని చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్యం వచ్చినాటి నుంచి దేశంలో కేవలం 2 వేల వెంటిలేటర్లు మాత్రమే ఉండగా.. గత తొమ్మిది నెలల్లో 51 వేల వెంటిలేటర్లను సమకూర్చుకున్నాం అని చెప్పుకొచ్చారు. దేశంలోని 1, 594 జిల్లా కేంద్రాల్లో పిఎస్ సి ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది అని చెప్పారు.

పిఎం కేర్ నిధులతో గాంధీ హాస్పిటల్ లో ప్రస్తుతం ఈ ఆక్సిజన్ ప్లాంట్ పనులు కూడా ప్రారంభమయ్యాయి అని కిషన్ రెడ్డి చెప్పారు. కిమ్స్, ఈఎస్ఐ, కింగ్ కోటి, వరంగంల్, ఇతర హాస్పిటల్స్ కు ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవ్వాలని నిర్ణయించాం అన్నారు. తెలంగాణకు కేంద్ర ఇచ్చిన వైద్య పరికరాలు.. జాబితా చెప్పారు. ఆ జాబితా ఇలా ఉంది. 1400 వెంటిలేటర్లు, 15 లక్షల ఎన్ 95 మాస్క్ లు, 2. 81 లక్షల పిపిఈ కిట్లు, ఇప్పటి వరకు 57 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చాం అని చెప్పారు. ఈఎస్ ఐ, కంటోన్మెంట్, మిలటరీ హాస్పిటల్, బిబి నగర్ ఏయిమ్స్ లో కరోనా ట్రీట్ మెంట్ ను చేసేలా చర్యలు తీసుకున్నాం అని కిషన్ రెడ్డి అన్నారు.

ఇదే మీడియా సమావేశంలో కొన్ని పొలిటికల్ కామెంట్స్ చేశారు. ఈ సంక్షోభ సమయంలో తెలుగు రాష్ట్రాలు కలిసి గట్టుగా వైరస్ పై యుద్ధం చేయాలి. రాజకీయాలకు ఇది సమయం కాదు. బార్డర్ లో అంబులెన్స్ లు ఆపడం పై హైకోర్టు కన్నా కేంద్రం ముందే స్పందించింది. ఏపి రిఆర్గనైజేషన్ అమలులో నోడల్ ఆఫీస్ హోం శాఖ ఉన్నందున హోం శాఖ కార్యదర్శి తెలంగాణ సీఎస్ తో మాట్లాడారు అని తెలిపారు. నేషనల్ హైవేలపై అంబులెన్స్ లు ఆపడానికి ఎవరికీ హక్కు లేదు. తెలంగాణలో కరోనా కేసులు, మరణాలు తక్కువ చేసి చూపుతున్నట్లు మా దృష్టికి వచ్చింది అని కిషన్ రెడ్డి అన్నారు.
ఇది ఎంత మాత్రం సరికాదు అన్నారు. శ్మశాన కమిటీలు పెద్ద సంఖ్యలో డెడ్ బాడీలపై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ఇది ఎవరో ఒకరు చేసిన తప్పు కాదు, కరోనా మహమ్మారి వలన చోటు చేసుకున్న పరిస్థితులు అన్నారు. ఇకపై తెలంగాణ సర్కార్ పని తీరు బాగుపడుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు. రాష్ట్రానికి 1400 వెంటిలేటర్లు ఇస్తే చాలా జిల్లా కేంద్రాల్లో వాటి సీల్ కూడా విప్పలేదు అని తెలంగాణ సర్కార్ ను తప్పు పట్టారు. నాసిరకం వెంటిలేటర్లు కేంద్రం ఇచ్చిందని తెలంగాణ సర్కారు చెప్పడం అవాస్తవం అన్నారు.తెలంగాణ వైద్య సిబ్బందికి వెంటిలేటర్ల వినియోగంపై శిక్షణ ఇవ్వాలి అని కిషన్ రెడ్డి అన్నారు. శిక్షణ లేని వారితో ఈ వెంటిటేలర్లు ఆపరేట్ చేయడం వల్ల ఈ సమస్యలు తలెత్తున్నాయి అని అన్నారు.. వరంగల్ కిమ్స్ లో సీల్ విప్పని వెంటిలేటర్లను హాస్పిటల్ విజిట్ లో నేను స్వయంగా నేను చూసి గుర్తించాను అని మంత్రి అన్నారు. జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలని రాష్ట్రాలకు ఇసరికే ఆదేశాలిచ్చాం అని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశాన్ని ముగించారు.

Leave a Reply