Take a fresh look at your lifestyle.

వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి… మద్యం బాటిల్లు ఏమైనట్టు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ‌విధించి మద్యం సిండికేట్‌ ‌దారులకు మంచి అవకాశాన్ని కలిగించినట్లు అయింది. లాక్‌డౌన్‌ ‌సందర్బంగా మద్యంషాపుదారులు కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తుంది. లాక్‌డౌన్‌ ‌విధించిన వెంటనే మద్యం దుకాణాలు కూడ ఎక్సైజ్‌ ‌శాఖ మూసివేసింది. వాటికి దగ్గరుండి మరి షాపులకు సీల్‌ ‌వేసారు. సీల్‌ ‌వేసిన షాపుల్లో మద్యం భద్రంగా ఉందని ఎక్సైజ్‌ ‌శాఖ భావించినప్పటికి వేసిన సీల్‌ ‌వేసినట్టే ఉండి షాపులో ఉన్న మద్యం మాత్రం మాయమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు మూసినప్పుడు ఎంతనిల్వలు ఉన్నాయి వెంటనే సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్‌ ‌శాఖకు ఆదేశాలు జారీ చేయటంతో మంగళవారం మధ్యాహ్నం నుండి ఎక్సైజ్‌ ‌శాఖ హడావుడిగా మద్యం దుకాణాలను తెరిపించి పరిశీలిస్తున్నారు. ఎక్సైజ్‌ ‌శాఖ పరిశీలనలో చాలా షాపుల్లో మద్యం ఉండాల్సిన స్థాయిలో మద్యం నిల్వలు లేకపోవడంతో ఖంగుతిన్నట్లు తెలుస్తుంది. డివిజన్‌ ‌వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నీ మద్యం దుకాణాల్లో లాక్‌డౌన్‌ ‌నాటి నిల్వలు లేనట్టుగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. ఎక్సైజ్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు షాపులు తెరిచి నిల్వలను లెక్కించి నివేధికలు ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. కానీ దుకాణాల్లో ఉన్న ప్రస్తుత నిల్వలలను ఖచ్చితంగా లెక్కించి పంపుతారా లేదా అని అందరి మదిలో తొలుచుచుంది.

లాక్‌డౌన్‌ ‌మార్చి 22 నుండి నిర్వహించగా ఆ తరువాతి నుండే మద్యం దుకాణాలలో నుండి వివిధ తరహాలో మద్యాన్ని బయటకు తీసుకువచ్చి ఒక బాటిల్‌ ‌వేలల్లో విక్రయించినట్లు తెలిసింది. ప్రభుత్వం కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ ‌మద్యం షాపు దారులకు కాసుల పంటగా మారింది. ఎక్సైజ్‌ అధికారులు వేసిన సీల్‌ ‌వేసినట్టే ఉన్న కొన్ని షాపుల్లో మద్యం నిల్వలు తక్కువగా ఉండటంతో ప్రభుత్వానికి ఏమి నివేధిక ఇవ్వాలో ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. బూర్గంపాడు మద్యం దుకాణంలో రాత్రిసమయంలో వెనుక నుండి గోడకు రంధ్రం పెట్టి మద్యాన్ని భద్రాచలం వరకు తరలిస్తూ పట్టుపడ్డారు. అలాగే చర్ల నుండి కూడ మద్యాన్ని రహస్యంగా తరలిస్తూ కన్నాయిగూడెం వద్ద ఆంధ్రా పోలీసు చెక్‌ ‌పోస్టు వద్ద పట్టుపడి సుమారు 50 వేల రూపాయల మద్యంతో భద్రాచలంకు చెందిన సిండికేట్‌ ‌వ్యాపారులు పట్టుపడటం విశేషం. ప్రభుత్వం అడుగుతున్న లెక్కల ప్రకారం ఎక్సైజ్‌ ‌శాఖ మద్యం షాపులపై ఏ నివేధిక ఇస్తుందో చూడాలి. రహస్యంగా మద్యాన్ని బయటకు తీసి కోట్ల రూపాయలు గడించిన మద్యం యజమానులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!