Take a fresh look at your lifestyle.

వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

జనగామ, వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లాల్లో రహదారులు నెత్తురోడాయి. ఈ రెండు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం బంజార వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా ఆత్మకూరు మండలం మహ్మద్‌గౌస్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పసికందు సహా నలుగురు మృతి చెందారు. అంబులెన్స్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!