వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

వెతికి మరీ వోటేస్తారు ..! నమూనా పోలింగ్ బూత్ సందర్శించిన కవిత

April 3, 2019

నిజామాబాదు లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల వల్ల 12 ఈవిఎం ల ద్వారా ఓటింగ్ జరగబోతోంది. జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక మోడల్ పోలింగ్ బూత్ ని ఏర్పాటు చేశారు.. దానిని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించానని ,. ఈవీఎంలకు వీలైతే నంబరింగ్ చేయాలని ఎన్నికల కమిషన్ ను కోరామని కవిత చెప్పారు. పరిశీలించి చెప్తామని ఎన్నికల కమిషన్ తెలిపిందని తెలిపారు. ఇటువంటి మాకు పోలింగ్ బూత్ లను మండల కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని కోరారు.
జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లను కూడా తాము ఈ విషయమై కోరినట్లు కవిత చెప్పారు. ఈవిఎం లు సంఖ్య ఎక్కువ ఉన్న దృష్ట్యా అవగాహన కల్పించడం తప్పనిసరి అన్నారు.ఈనెల 11న జరగనున్న ఎంపీ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎంపీ కవిత కోరారు. పట్టణ ఓటర్ల పోలింగ్ 50 శాతం కూడా దాటడం లేదని దీన్ని అధిగమించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, నిజామాబాద్, బోధన్ పట్టణాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.పోలింగ్ బూత్ లోకి ఓటరు వెళ్ళగానే ఎడమ వైపున ఉండే 3 ఈవీఎంలలో మొదటి ఈవిఎం లో తన పేరు, కారు గుర్తు రెండవ క్రమ సంఖ్య లో ఉంటుందని ఎంపీ కవిత చెప్పారు. తన పేరు ఎక్కడ ఉన్నా వెతుక్కొని మరి ఓటు వేసి గెలిపిస్తారని ఎంపీ కవిత అన్నారు. ఎంపి కవిత వెంట జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఉన్నారు.