Take a fresh look at your lifestyle.

వుడా అభివృద్ది లక్ష్యం మారింది

వ్యాపార కార్యకలాపాలపై దృష్టి సరికాదు
విఎంఆర్డీఏ మాస్టర్‌ ‌ప్లాన్‌ ఇం‌గ్లీషులో ఇస్తే ఎవరికి లాభం
డియాతో ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక కార్యదర్శి అజయ్‌ ‌శర్మ
విశాఖపట్టణం,జూలై 26 : వుడా తన అసలు లక్ష్యాలను విస్మరించి వ్యాపార సంస్థగా మారిందని ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక జనరల్‌ ‌సెక్రటరీ ఎ. అజయ్‌ ‌శర్మ అన్నారు. గతంలో చేసే పనులకు ప్రస్తుత బాధ్యతలకు పొంతన లేకుండా పోయిందన్నారు. 1990 దశకం నుండి స్థలాల కేటాయింపు కాకుండా వేలానికి పెట్టడం ప్రారంభించారని, అసలు లక్ష్యం వదిలి, వ్యాపార సంస్థగా మారిపోయిందని ఆయన అన్నారు. విఎంఆర్డీఏ మాస్టర్‌ ‌ప్లాన్‌ 2041‌పై తమ అభ్యంతరాలను జులై 25న జీవీఎంసీ కమిషనర్‌ ‌కు సమర్పించామని ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక జనరల్‌ ‌సెక్రటరీ ఎ. అజయ్‌ ‌శర్మ తెలిపారు. విశాఖలో డియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 347 పేజీల సుధీర్ఘమైన విఎంఆర్డీఏ మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌రిపోర్ట్ ‌ను ఇంగ్లీషు లో ఇచ్చారని ఇక్కడి ప్రజలకు అత్యధిక మందికి ఇది అర్ధం కానందున దీనిని తెలుగులో తర్జుమా చేస్తూ అభ్యంతరాల కు ఇచ్చిన గడువును సెప్టెంబర్‌ 30 ‌వరకు పొడిగించాలని అని కోరారు. ఈ రిపోర్టులో విఎంఆర్డీఏ పరిధిలోని గృహావసతి, రవాణా, పర్యావరణంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు పరిశ్రమలు, వ్యవసాయం, ఉపాధి, పేదరికం, పారిశ్రామికరణ, విద్య, వైద్యం, టూరిజం వంటి అంశాలు ప్రస్తావించారని ఆయన అన్నారు.

ఈ సంస్థ ప్రధాన లక్ష్యం గృహావసతి కల్పించడం అని, గతంలో దీనిని టిపిటి, ఉడా చేసేవని అన్నారు. దీనికి అనుగుణంగా ఈ రిపోర్ట్ ‌రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం పెంచేదిగానే తయారు చేసారని సామాన్యులకు గృహావసతి అందుబాటులోకి తెస్తామని ఈ రిపోర్ట్ ‌లో ఎక్కడ పేర్కొనలేదని అన్నారు. రవాణా పేరుతో వెడల్పాటి రోడ్లు ఈ రిపోర్ట్ ‌లో ప్రతిపాదించారని 140.13 కిలోటర్ల మెట్రో రైలు నిర్మాణం చేస్తామని అన్నారు కానీ గత 10 సంవత్సరలుగా ప్రతిపాదన దశలోనే ఉందని ఆయన అన్నారు. రోడ్లు, మెట్రో, పీసీపీఐఆర్‌ ‌పేరుతో పెద్ద ఎత్తున భూ సేకరణ ల్యాండ్‌ ‌పూలింగ్‌ ‌చేపట్టాలని ప్రతిపాదించారని, రాని పరిశ్రమల కోసం రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం సమంజసం కాదని అన్నారు. సముద్ర తీరం పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని ఈ రిపోర్ట్ ‌లో పేర్కొన్నపట్టికి నివారణకు ఎటువంటి చర్యలు ప్రతిపాదించలేదని, ఆయన అన్నారు. పర్యవరాన్ని కలుషితం చేసే కొవ్వాడ అణు విద్యుత్‌ ‌ప్లాంట్‌ ‌ను నిషేధించాలని, టూరిజం పేరుతో ఎటువంటి నిర్మాణాలు చేపట్టారని, మత్స్యకారులకు సముద్రం పై హక్కు గ్యారెంటీ చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఈ ప్లాన్‌ అమలుకు 1,49,201.50 అవసరం అని రిపోర్ట్ ‌లో పేర్కొన్నారని, ఇంత పెద్ద మొత్తం లో నిధులు ఎక్కడినుండి వస్తేయో తెలుపలేదని దీనికి భూముల వేలం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. ఈ ప్లాన్‌ ‌పరిధి పాయకరావుపేట నుండి గజపతినగరం వరకు 1721 చదరపు కిలోటర్ల నుండి 4873 కిలోటర్ల పెద్ద ఎత్తున విస్తరించారని దీనివల్ల మేలు జరగదని ఆయన అన్నారు. కావున ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని సూచనలకు అనుగుణంగా రిపోర్ట్ ‌ను సవరించాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వర్వా కార్యదర్శి బి.బి.గణెళిష్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply