వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

వీడిన మిస్టరీ..

May 10, 2019

సంగారెడ్డి ఆసుపత్రిలో మిస్సైన పాప ఆచూకీ లభ్యంరాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠకు తెరలేపిన సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో మిస్సైన పాప మిస్టరీ వీడింది. పాప మిస్సింగ్‌ ‌కేసు ఉదంతాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు రెండు రోజుల వ్యవధిలోనే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఉన్నట్లు గుర్తించారు. పాప ఆచూకీ లభించడంతో అటు పోలీసులు, ఇటు శిశువు తల్లి మాధవి తండ్రి మల్లేశం, వారి కుటుంబీకులు ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు ఊపిరి పీల్చుకున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లోంచి రెండు రోజుల కిందట సంతోష్‌, ‌శోభ దంపతుల పాపను కిడ్నాప్‌ ‌చేశారు. కిడ్నాప్‌ ‌చేసిన పాప గురువారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సమీపంలో పోలీసులు గుర్తించారు. పాపను కిడ్నాప్‌ ‌చేసిన దంపతులు సంతోష్‌, ‌శోభలు పోలీసుల అదుపులో ఉన్నారు. పాప ఆచూకీ తెలిపిన వారికి సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌ ‌రెడ్డి రూ.2 లక్షలు విరాళం ప్రకటించారు.