వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

విషజ్వరాలు ప్రబలుతున్నా.. ఒక్క చావుకూడా లేదంటారా?

September 4, 2019

  • ఈటల పార్టీ ఓనర్‌షిప్‌ ‌పంచాయతీలో పడిపోయారు
  • ప్రజల ఇబ్బందులు కనిపించడంలేదు
  • పీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌భట్టి విక్రమార్క

రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలుతున్నా.. ఒక్క చావు కూడా లేదని మంత్రి ఈటల చెప్పడం దారుణమని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈటల వ్యాఖ్యలపై మండిపడ్డారు. పాల్వంచ మండలంలోనే ఒక్క నెలలో 18 మంది చనిపోయారని, ఖాళీగా ఉన్న డాక్టర్‌, ‌నర్సింగ్‌, ‌ల్యాబ్‌ ‌టెక్నికల్‌ ‌సిబ్బంది నియామకాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. హాస్పిటల్స్‌లో బెడ్స్ ‌లేక ఒకే మంచంపై ఇద్దరు పేషెంట్స్ ఉన్నారని, సిబ్బంది లేరన్నారు. కలెక్టర్లు స్పందించి హెల్త్ ‌క్యాంపు పెట్టలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు. పరికరాలు లేవని, పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో వాటితో రోగాలు వస్తున్నాయన్నారు. పార్టీ ఓనర్‌ ‌షిప్‌ ‌పంచాయతీలో పడి ఈటెల ఇవన్నీ మరిచిపోయారన్నారు. ఈటెల పార్టీలో ఒత్తిడికి గురై విషయాలు చెప్పడం లేదని భట్టి విమర్శించారు. రుణమాఫీ సకాలంలో చేయకపోతే రైతులు ఇబ్బంది పడుతారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినా సీఎం కేసీఆర్‌కు ప్రజల ఇబ్బందులు పట్టడం లేదని భట్టి విక్రంమార్క విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు తీరుతాయని సోనియాగాంధీ రాష్టాన్న్రి ప్రకటిస్తే, కేసీఆర్‌ ‌కబ్జాచేసి సొంత కుటుంబ పాలనను సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పథకాన్ని ప్రారంభించడం దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని గొప్పలు చెప్పుకోవటమే టీఆర్‌ఎస్‌ ‌నేతలకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రచారంలో ఉన్నటువంటి శ్రద్ద ఆచరణలో లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రచారాన్ని మాని సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలని టీఆర్‌ఎస్‌ ‌నేతలకు భట్టి హితవు పలికారు.