Take a fresh look at your lifestyle.

విషజ్వరాలు ప్రబలుతుంటే.. ప్రభుత్వానికి పట్టదా?

హైదరాబాద్‌ ‌డెంగీ వ్యాధికి రాజధానిగా మారింది
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది
దోమల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌
‌గాంధీ ఆస్పత్రిని పరిశీలించిన బీజేపీ సభ్యుల బృందంరాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలుతుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందని, సీఎం కేసీఆర్‌ ‌నివారణకు చర్యలు ఇప్పటి వరకు ఆదేశించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ‌విమర్శించారు. శనివారం లక్ష్మణ్‌, ‌బీజేపీ నేతలు గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మణ్‌ ‌మాట్లాడుతూ.. సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డెంగ్యూ వ్యాధికి హైదరాబాద్‌ ‌రాజధానిగా మారిందని వ్యాఖ్యానించారు. డెంగ్యూ, చికెన్‌ ‌గున్యా రోగులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలంతా విషజ్వరాలతో అల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని, కేసీఆర్‌ ‌యాదగిరి గుట్టలో తన ముఖచిత్రం చెక్కించడంలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు. పారిశుధ్య లోపంతోనే ఈ పరిస్థితులు తలెత్తాయని అన్నారు. ఆరోగ్య శ్రీ పరిధిలో జ్వరాలు లేవని, ప్రైవేటు ఆసుపత్రులు చేర్చుకోవని, ఇక కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌పథకాన్ని కేసీఆర్‌ ‌రాష్ట్ర ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారని విమర్శించారు. ఇప్పటివరకు వైద్యుల నియామకం కోసం ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, గాంధీ ఆస్పత్రిలో వేయిపడకల సామర్థ్యం ఉంటే 2500 మంది రోగులొస్తున్నారన్నారు. అక్కడ 800 మంది నర్సులు అవసరమైతే కేవలం 350 మందే ఉన్నారని, ఇక ఐసీయూలో పరిస్థితి దారుణమన్నారు. అక్కడ 65 బెడ్లకు గాను 20 మందే నర్సులు సేవలందిస్తున్నారని లక్ష్మణ్‌ ‌పేర్కొన్నారు. రోజు 200 మంది ఐసీయూలో చేరుతున్నారని, గాంధీలో మరో 100 పడకల ఆస్పత్రి, ఉస్మానియాలో కొత్త భవనాల నిర్మాణం అని చెప్పిన ముఖ్యమంత్రి వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. రూ. 500 కోట్లతో సచివాలయం నిర్మిస్తామని చెప్తున్న కేసీఆర్‌ ‌ప్రభుత్వాస్పత్రుల్ని మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోగులకు మెరుగైన సేవలందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేస్తామని, మంత్రులకు చేతనైతే సీఎంతో మాట్లాడి సేవలందించాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని అన్నారు. గులాబి జెండా ఓనర్షిప్‌ ‌కోసం కొట్లాడటం మాని ప్రజలకు సేవ చేయండంటూ లక్ష్మణ్‌ ‌తెరాస ముఖ్యనేతలను హితవుపలికారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy