Take a fresh look at your lifestyle.

విశ్వ కవిత్వం దిశగా.. తెలంగాణ కవిత్వం

విశ్వకవి సమ్మేళనం – రిపోర్టు
సబ్బండ వర్ణాల సింగిడి రంగుల తెలంగాణ కవిత్వానికి ఇది నిజంగా ఇది వొక చారిత్రక దినం. కవి సిద్దార్థ తెలంగాణ మట్టిబిడ్డకావడం తన సాహిత్యమంతా తెలంగాణ ఏకాత్మను అద్దంపడుతుంటది. తెలంగాణ ను మూడు వందల అరువై డిగ్రీల కోణంలో ద్రుష్యమానం చేయడం సిద్దార్థ కవిత్వానికే సాధ్యం. అంతటి ప్రముఖ కవి సిద్దార్థకు తెలుగు నేలమీదనుంచి తెలంగాణ గడ్డమీదనుంచి విశ్వకవి సమ్మేళనంలో పాల్గొనడం.. ఆ ప్రపంచ వేదిక మీద తన ఇంగ్లీషు కవితా సంపుటి ..జాస్మిన్ వాటర్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం .. కరుణను పంచేదే కవిత్వం (poetry for compassion) అనే కవి సమ్మేళనం యొక్క లక్ష్యాన్ని ఇనుమడింప చేసిందని చెప్పవచ్చు. విశ్వవేదిక మీద ఆవిష్కరించిన మొట్టమొదటి తెలంగాణ ఇంగ్లీషు కవితా సంపుటి జాస్మిన్ వాటర్ అని చెప్పవచ్చు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రతిఏటా నిర్వహించే..39 వ విశ్వ కవి సమ్మేళనం, అక్టోబర్ 2 గాంధీ నూటయాభైయవ జయంతి సందర్భంగా ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు, కళింగ సంస్థల ఆధ్వర్యంలో ఈ ప్రపంచ సాహిత్య ఉత్సవాలను కళింగ ఇనిస్టిటూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ( Kiit) యూనివర్శిటీ వేదికగా ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. 82 దేశాలనుంచి 1300 మంది కవులు ఈ ప్రపంచ కవి సమ్మేళనంలో పాల్గొంటున్నారు. యునెస్కో అనుబంధంగా ప్రపంచ సాంస్క్రతిక మరియు కళల సంస్థ (waac) లో భాగమైన విశ్వకవుల వేదిక (WCP) 1969 లో మొదటిసారిగా ఆవిష్కరించబడింది.
మనదేశంలో మూడవసారి జరుగుతున్న విశ్వ కవి సమ్మేళనం కలింగ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే అవకాశం కలగడం తనకు గర్వకారణమని kiit మరియు kiss సంస్థల వ్యవస్థాపకుడు , సామాజికవవేత్త, లోక్ సభ సభ్యులు ప్రొఫెసర్ అచ్యుతా సామంత తన అధ్యక్షోపన్యాసంలో పేర్కొన్నారు. గత ఏడాది చైనాలో నిర్వహించిన విశ్వకకవుల సమ్మేళనంలో పాల్గొన్నదాని కన్నా ఎక్కువ దేశాలు, ఎక్కువ మంది ప్రతినిధులు పాల్గొనడం సంతోషంగా వుందన్నారు. ఈ మహా ఉత్సవాలను తమ సంస్థల ఆద్వర్యంలో నిర్వహించడం తనకు దక్కిన సాంస్క్రతిక సాహితీ గౌరవమని సామంత తెలిపారు. మానవ కరుణ ( poetry for compassion) కోసమే కవిత్వం అనే లక్ష్యంతో ప్రారంభమైన విశ్వకవి సమ్మేళనానికి చాలా ఉదాత్తమైనది అని, కవులు ఎప్పుడూ మానవీయతకే పెద్దపీట వేస్తారని, సామంత తెలిపారు. గాంధీజీ నూటాయాభైయవ జయంతి సందర్భంగా విశ్వకవుల సమ్మేళనం జరగడం గాంధీ సిద్దాంతాలను, మానవీయ కోణాన్ని ప్రపంచ వ్యాప్తంగా మూల్యాంకనం చేసుకోవడానికి అవకాశం కల్పించిందని తెలిపారు. విశ్వకవి సమ్మేళనం ప్రపంచ శాంతి దిశగా మానవీయ తత్వపు లక్ష్యాల దిశగా కవిత్వం కొనసాగగలదని వరల్డ్ కాంగ్రేస్ ఆఫ్ పోయెట్రీ అధ్యక్షుడు డా.మారిస్ యంగ్ తెలిపారు. భారత్ లో ప్రతిభావంతులైన కవులకు కొదువలేదని గతంలో రొండుసార్లు జరిగిన విశ్వకవుల ఉత్సవాలను భారతదేశంలో ఎంతో ఘనంగా నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. నాటి సభలకు దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారని, గుర్తుచేసుకున్న మారిస్ యంగ్, కలామ్ గారి రెండు పుస్తకాలను తాను చైనీస్ భాషలో అనువాదం చేసినానని అవి ఎంతగానో పాఠకాదరణను పొందాయని అన్నారు. ఉపాద్యక్షులు ఎర్నెస్టో కహాన్ మాట్లాడుతూ..కవులంతా మానవత్వాన్ని ఆపేక్షించే విశ్వ కుటుంబమని కొనియాడారు. ఈ సభలో ప్రముఖ కవి రస్కిన్ బాండ్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. ప్రపంచ కవుల సమ్మేళనంలో మొదటి రోజు ఆఫ్రికా ప్రాన్స్, మంగోలియా, జపాన్,చైనా తదితర దేశాల యువ కవులు ఎంతో మంది పాల్గొని తమ కవితలను సొంత భాషలో, ఇంగ్లీషు అనువాదాల్లో వినిపించడం సభలో ఉత్సాహాన్ని నింపింది.

ఫోటో :విశ్వకవి సమేళనం వేదికపై అచ్చుత సమంత, సిద్ధార్థ
ఫోటో :విశ్వకవి సమేళనం వేదికపై అచ్చుత సమంత, సిద్ధార్థ

ప్రపంచ కవి సమ్మేళనం లో రొండో రోజు జరిగిన ప్రారంభ కార్యక్రమంలో..నిర్వాహకులు లోక్ సభ సభ్యులు, అచ్యుతా సామంత, సంస్థ అధ్యక్ష ఉపాధ్యక్షులు కార్యనిర్వాహక సభ్యుల చేతుల మీదుగా., ప్రముఖ తెలంగాణ కవి సిద్దార్థ ఆంగ్ల కవితా సంపుటి జాస్మిన్ వాటర్ ( మల్లెల తీర్థం) ఆవిష్కరణ ఘనంగా జరిగింది. జాస్మిన్ వాటర్ పుస్తకంలోని కవిత్వ నేపధ్యాన్ని ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు మారిస్ యాంగ్ కొనియాడారు. కరుణ ప్రధానంగా సాగిన జాస్మిన్ వాటర్ కవితా సంపుటి ప్రపంచ పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని నూతన కవులకు ఎంతో ప్రోత్సాహకంగా వుంటుందని ఆయన తెలిపారు.అంతర్జాతీయ కవి సమ్మేళనం లో.. తెలంగాణ కవిత్వం భాగస్వామ్యం.. నేపధ్యం…వొక్కమాట.
బతుకమ్మను వొక్కొక్క పూవేసి పేర్చినట్టు వొక్కొక్క పోయెమ్ తో ప్రపంచ జీవన సంస్క్రతి అంతా కుప్పేసి పేర్చుతున్రు..వొడిస్సాలో.విశ్వ కవితా బతుకమ్మలో మన తెలంగాణ కవిత్వం ఆకులో ఆకయ్య పూవులో పువ్వయింది..బతుకమ్మ మీద పేర్చిన పసుపు గౌరమ్మఅయింది. సబ్బండ వర్ణాల సింగిడి రంగుల తెలంగాణ కవిత్వానికి ఇది నిజంగా ఇది వొక చారిత్రక దినం. కవి సిద్దార్థ తెలంగాణ మట్టిబిడ్డకావడం తన సాహిత్యమంతా తెలంగాణ ఏకాత్మను అద్దంపడుతుంటది. తెలంగాణ ను మూడు వందల అరువై డిగ్రీల కోణంలో ద్రుష్యమానం చేయడం సిద్దార్థ కవిత్వానికే సాధ్యం. అంతటి ప్రముఖ కవి సిద్దార్థకు తెలుగు నేలమీదనుంచి తెలంగాణ గడ్డమీదనుంచి విశ్వకవి సమ్మేళనంలో పాల్గొనడం.. ఆ ప్రపంచ వేదిక మీద తన ఇంగ్లీషు కవితా సంపుటి ..జాస్మిన్ వాటర్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం .. కరుణను పంచేదే కవిత్వం (poetry for compassion) అనే కవి సమ్మేళనం యొక్క లక్ష్యాన్ని ఇనుమడింప చేసిందని చెప్పవచ్చు. విశ్వవేదిక మీద ఆవిష్కరించిన మొట్టమొదటి తెలంగాణ ఇంగ్లీషు కవితా సంపుటి జాస్మిన్ వాటర్ అని చెప్పవచ్చు.

అదే సందర్భంగా తెలంగాణ సిద్దార్థ కవిత్వాన్ని విశ్వవేదిక మీదికి తీసుకపోవడం లో క్రుషి చేసిన.. బ్లూ జే ప్రింట్స్ నిర్వాహకులు సీనియర్ జర్నలిస్టు అంతర్జాతీయ డాక్యుమెంటరీ డైరక్టర్ రాజా రమేశ్ గురించి చెప్పుకోవాల్సి వున్నది.

బుద్దుని జ్జాన బోధనలను అశోకుడు విశ్వవ్యాప్తం చేసినట్టు,. తెలంగాణ నాడిని కనిపెట్టుకున్నది కవి సిద్దార్థ కవిత్వం తెలంగాణ నేల మీద ఎంతగానో ప్రఖ్యాతి గాంచినవి. సిద్దార్థ కవిత్వం, తెలంగాణ ఆత్మను ఎంత లోతుగా పట్టిందో..అంతే విస్త్రుతంగా భావాన్ని పంచింది. ఆ కవిత్వ భావస్పోరకం ప్రపంచంలో ఏ సమాజానికీ తీసిపోనిది. ప్రపంచ కరుణ జీవితం అంతా తెలంగాణ సమాజిక జీవన విధానంలో ఇమిడివున్నది. దాని సంస్క్రతిక మాయిముంత రహస్య లోపలి జీవితం సిద్ధార్థ కవిత్వంలో ఉన్నది. అయితే…సబ్బండ జాతుల, కులాల, తర తరాల మాయిముంతలను తన కవిత్వంలో మోసుకతిరుగుతున్న సిద్దార్త కవిత్వం, తెలంగాణ తెలుగుకి పరిమితమై ప్రపంచ భావనాత్మక ప్రపంచానికి దూరంగా వుండిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కవిత్వాన్ని ముఖ్యంగా సిద్ధార్థ అరుదైన దక్కనీ బతుకు కవిత్వాన్ని విశ్వానికి పరిచయం కావాల్సిన రీతిలో వొక అరుదైన సందర్భాన్ని ఎంచుకోవడం గొప్పది. అదీ.. ది గ్రేట్ ఆర్టాఫ్ గివింగ్ ఫౌండర్,. దేశం గర్వించదగ్గ డౌన్ టు ఎర్త్ నాయకుడు అచ్యుతా సామంత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో, తన చేతుల మీదుగా కవి సిద్దార్థ జాస్మిన్ వాటర్‘ పుస్తకం ఆవిష్కరించడం… నిజంగా తెలంగాణ కవిత్వ చరిత్రలో వొక చాారిత్రక ఘట్టాన్ని నమోదు చేయడమే.

తెలంగాణ భావావేశాన్ని తెలుగులో పట్టినంత ఎమోషనల్ గా ఆ ఎమోషన్ తాలూకు అంతస్సారాన్ని ఇంగ్లీషులో పట్టగలడా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రపంచంలో పెద్ద పెద్ద కవులుగా పేరోందిన వివిధ కవుల సరసన చేరిండు..కవి సిద్దార్థ. తన భావాలను తెలంగాణ దక్కనీ తెలుగులోంచి ఇంగ్లీషులకు తర్జుమా చేసిన కవి తన భావోస్పేరక అంత:చ్చేతనను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత రాజా రమేశ్ కే దక్కుతుందని చెప్పవచ్చు.

దీప శిల ద్వారా తనను తాను కోల్పోయిన మానవ జీవితపు తన్లాటను పట్టించిండు కవి సిద్దార్థ. బొమ్మల బాయి కవిత్వం ద్వారా., దిగడమే కానీ ఎక్కడం చేతగాని., లోదరిని అందుకోలేని, తెలంగాణ దక్కనీ జీవన తాత్వికతను ద్రుష్యమానం చేస్తే., నేటి జాస్మిన్ వాటర్ (మల్లెల తీర్తం) ద్వారా తెలంగాణ బతుకు సెలబ్రేషన్ ను సుందరీకరించి., నవీకరించి ప్రపంచీకరించి, మొత్తంగా విశ్వ మానవ జీవ సారాన్ని తెలంగాణ కవిత్వంలోకి వొంపి ప్రపంచానికి తీర్థం పంచిండు..ఈ వేదిక ద్వారా. అటువంటి తెలంగాణ తెలుగు కవిత్వాన్ని పట్టుబట్టి ప్రపంచానికి పరిచయం చేయడంలో రాజా రమేశ్ తపన ఫలించిందని చెప్పవచ్చు. సిద్దార్థ కవిత్వాన్ని పరిచయం చేయడం ద్వారా బాహుబలి సినిమా తెలుగు సినిమా మార్కెట్టు మరింత విస్త్రుతమైనట్టు.. తెలంగాణ కవిత్వాన్ని ఇంగ్లీషు సాహిత్య మార్కెట్టుకు విస్తరింపచేసి భావి తరాలకు మార్గదర్శనం చూపిన ఘనత సీనియర్ జర్నలిస్టు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ప్రపంచ సాహిత్యం కళలు సంస్క్రతిమీద విస్త్రుత అవగాహన వున్న రాజారమేశ్ కే దక్కుతుంది.

హజారి (కవి,రచయిత)

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy