Take a fresh look at your lifestyle.

30 సంవత్సరములుగా కాశ్మీర్ లోయలో.. ఆట పాట బంద్

1989‌లో కాశ్మీర్‌లో ముఖ్యంగా శ్రీనగర్‌లో అల్లా టైగర్స్ అనే సంస్థ సాయుధ తిరుగుబాటు ఉద్యమంలో భాగంగా సినిమా థియేటర్లను బలవంతంగా మూయించింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో విలీనం చేయాలన్న డిమాండ్‌పై ఆ సంస్థ సినిమా థియేటర్లను బలవంతంగా మూయించింది. ఒక్క సినిమాలు మాత్రమే కాకుండా, బార్‌లు, బ్యూటీ పార్లర్లు, ఇస్లామ్‌ ‌మతానికి విరుద్ధమైనవని స్పష్టం చేస్తూ వాటిని మూయించింది. తమ ఆదేశాలను ఉల్లంఘించిన వారిని చంపేస్తామని హెచ్చరించింది. కాశ్మీర్‌లో రెండు డజన్ల సినిమా థియేటర్లు పల్లాడియమ్‌, ‌రీగల్‌, ‌పేరిట ఉండేవి. వీటిల్లో బ్రాడ్‌ ‌వే అనే ఒక థియేటర్‌కు థర్‌ ‌యజమాని. 1990 నాటికి థియేటర్లన్నీ మూత పడ్డాయి. అప్పట్లో చాలా మంది కాశ్మీరీలు ఇది తాత్కాలిక పరిణామమని అనుకున్నామన్నారు. కానీ, థియేటర్లు శాశ్వతంగా మూత పడ్డాయి. ఈ థియేటర్లలో చాలా మటుకు భద్రతాదళాలకు శిబిరాలుగానూ, ఆస్పత్రులుగానూ, దుకాణాల సముదాయాలుగానూ మారిపోయాయి. 1996లో మూడు సినిమా థియేటర్లను ప్రభుత్వం ఇచ్చిన హామీలతో యజమానులు తెరిచారు. ప్రభుత్వం భద్రత కల్పించింది. అయినప్పటికీ రీగల్‌ ‌థియేటర్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో మూడేళ్ళలో రెండు థియేటర్లను మూసివేశారు. రీగల్‌ ‌థియేటర్‌పై దాడి ఘటనలో సినిమాకి వెళ్ళే ప్రేక్షకుడు మరణించారు. నీలం తెరిచినా కొద్ది మంది ప్రేక్షకులు మాత్రమే ఉండేవారు.
కాశ్మీర్‌లో మంచు కప్పిన కొండలు, పర్వత శ్రేణులు బాలీవుడ్‌ ‌డైరక్టర్లకు మంచి లొకేషన్లు. ప్రేమికుల యుగళ గీతాలకు కాశ్మీర్‌ ‌లోని సుందర
దృశ్యాలు అనుకూలంగా ఉంటాయి. అన్ని వైపులా మంచు కప్పిన కొండలు, సుందర దృశ్యాలు చిత్ర నిర్మాణానికి అనువుగా ఉంటాయని సినీ అభిమాని పర్సా వెంకటేశ్వరరావు జూనియర్‌ ‌పేర్కొన్నారు.
కాశ్మీర్‌ అశాంతి వల్ల ప్రభుత్వ లెక్కల ప్రకారమే గడిచిన మూడు దశాబ్దాల్లో 40 వేల మంది మరణించారు. అయినప్పటికీ కాశ్మీర్‌లో కొందరు ఇతర ప్రాంతాలకు చెందిన డైరక్టర్లు చిత్రాల నిర్మాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కాశ్మీర్‌ ‌లోని మనోహర్‌ ‌దృశ్యాలను తమ సినిమాల్లో చూపిస్తూనే ఉన్నారు. పెద్ద తెరపై ఆ దృశ్యాలు వీక్షిస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. తమ రాష్ట్రంలో, చుట్టపక్కల ఉన్న రమణీయ దృశ్యాలను వెండితెరపై తిలకించే మహదావకాశాన్ని కాశ్మీర్‌ ‌ప్రజలు నోచుకోవడం లేదు.


అయితే అందరికీ పెద్ద తెరపై సినిమా చూడాలని ఉన్నా ఎవరూ తమ కోర్కెను బహిరంగంగా వ్యక్తం చేయలేకపోతున్నారు. ఇంటర్నెట్‌లో అనేక సినిమాలు వస్తున్నాయి. పెద్ద తెరపై సినిమా చూడటం ఇష్టమే కానీ, ఎంతో భయం. పెద్ద తెరపై సినిమా చూడటం మంచి ఆలోచనే కానీ, ప్రస్తుత తరుణంలో మంచిది కాదు అని హౌస్‌ ‌బోట్‌ ‌యజమాని నవాజ్‌ ‌బట్‌ అన్నారు. కాశ్మీర్‌ ‌లో నిరవధికంగా సాగుతున్న రక్తపాతం వల్ల సినిమాకి వెళ్లడం గగనమవుతోందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక హొటల్‌ ‌యజమాని అన్నారు.
అప్పట్లో సినిమాలు చూసేందుకు క్లాసులకు డుమ్మా కొట్టే వాళ్లమని కాశ్మీరీ చిత్ర నిర్మాత, డైరక్టర్‌ ‌హుస్సేన్‌ ‌ఖాన్‌ ‌చెప్పారు. ఆయన నిర్మించిన కాశ్మీరీ డైలీ మొదటి కాశ్మీరీ ఫిలిం. 72 క్రియేషన్ల బ్యానర్‌పై ఆయన నిర్మించారు. కాశ్మీరీ యువకులు మాదక ద్రవ్యాలకు ఏ విధంగా ప్రభావితం అవుతున్నారో ఇతివృత్తంగా తీసుకుని ఆ చిత్రాన్ని ఆయన నిర్మించారు. ఆ చిత్రం లీడ్‌ ‌రోల్‌లో మీర్‌ ‌సర్వర్‌ ‌తాను తొలిసారిగా పెద్ద తెరమీద తన ఊళ్ళో చూశానని, 1980 నాటి చిత్రమని చెప్పారు. అది ఇల్జామ్‌ అనే బాలీవుడ్‌ ‌చిత్రమని అది గొప్ప అనుభూతి అని ఆయన చెప్పారు.
కాశ్మీర్‌లో సినిమా థియేటర్లు మూత పడి 27 సంవత్సరాలు అయింది. అప్పట్లో థియేటర్లలో సినిమాలు చూసిన వారు తమ అనుభవాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. 1980లో మొత్తం 15 థియేటర్లు ఉండేవి. వాటిలో బ్రాడ్వే సినిమా, రీగల్‌ ‌సినిమా, నీలం సినిమా పల్లోడియం సినిమా ముఖ్యమైనవి. నాకు ఇప్పటికీ గుర్తు కాలియా చిత్రాన్ని చూడటానికి థియేటర్‌కు వెళ్ళినప్పుడు టికెట్లు లేవన్నారు. రెండో ఆటకు వెళ్ళాం. ఇంటికొచ్చేసరికి అర్థరాత్రి ఒంటి గంట అయింది. మానాన్న చేత తన్నులు తిన్నాను అని హుస్సనే ఖాన్‌ ‌తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
1989లో కాశ్మీర్‌ ‌లోయలోని సినిమాలు మూతబడ్డాయి. అల్లా టైగర్స్ అనే ఉగ్రవాద సంస్థ హెచ్చరికతో సినిమా థియేటర్లు మూత పడ్డాయి. 1989 ఆగస్టు 18వ తేదీన ఉగ్రవాద సంస్థ అధిపతి ఎయిర్‌ ‌మార్షల్‌ ‌నూర్‌ ‌ఖాన్‌ ‌కాశ్మీర్‌ ‌లోయలో సినిమా థియేటర్లు, బార్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. మద్యం, సినిమాలు, ఇస్లామిక్‌ ‌సంస్కృతికి వ్యతిరేకమని అన్నారు. అల్లా టైగర్స్ ‌సంస్థ ఇప్పుడు పని చేయడం లేదు. ఆ సంస్థకు చెందిన యువ తరం వారు శ్రీనగర్‌లో హొటల్స్‌కు వెళ్ళి మద్యం సరఫరా చేయవద్దనీ హుకుం జారీ చేస్తుంటారు. అలాగే, మద్యం దుకాణాలను మూయిస్తూ ఉంటారు. ఇఫ్తిఖార్‌ ‌ఖాన్‌కు సినిమాలు మూత పడే సమయానికి 25 ఏళ్ళు. థియేటర్లకు మూత పడటానికి ముందు తాను ఎన్నో మంచి సినిమాలు చూశానని చెప్పారు.
1989 ఆగస్టు 18వ తేదీన అల్లాటైగర్స్ ‌సంస్థ స్థానిక వార్తా పత్రికకు ఒక ప్రెస్‌ ‌నోట్‌ ‌పంపింది. సినిమా థియేటర్‌ ఓనర్లు, మద్యం దుకాణాల యజమానులు సినిమాలు మూసివేయాలనీ, మద్యం అమ్మకాలను ఆపేయాలని హుకుం జారీ చేసింది. దాంతో 1989 డిసెంబర్‌ 31‌వ తేదీనాటికి అన్ని థియేటర్లు మూత పడ్డాయి.
1990లో అన్ని థియేటర్లు మూత పడ్డాయని పల్లోడియం సినిమా యజమాని మన్మోహన్‌ ఎస్‌ ‌గ్వారీ చెప్పారు. రాష్ట్రంలో ఇది ప్రసిద్ధ థియేటర్‌. ‌పాత థియేటర్‌ ‌కూడా. అమితాబ్‌ ‌బచ్చన్‌, ‌దిలీప్‌ ‌కుమార్‌, ‌రాజ్‌ ‌కపూర్‌ ‌వంటి దిగ్గజాల చిత్రాలు ఈ థియేటర్లలో ప్రదర్శించేవారమని ఆయన చెప్పారు. అప్పట్లో ఆంగ్ల చిత్రాలను కూడా ప్రదర్శించేవారమని ఆయన చెప్పారు. ఢిల్లీలో కన్నా తమ థియేటర్లలో ఈ చిత్రాలను ముందుగా ప్రదర్శించేవారమని ఆయన చెప్పారు.
1993లో ఇతర థియేటర్లతో పాటు పల్లోడియం థియేటర్‌ ‌కూడా మూత పడింది. ఆ థియేటర్‌ను ఉగ్రవాదులు తగుల బెట్టారని ఆయన చెప్పారు
ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన సినిమా థియేటర్‌ ఇప్పుడు రూపు రేఖలు లేకుండా పోయిందని ఆయన ఆవేదనతో అన్నారు.
ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని పంపడం మొదలు పెట్టిన తర్వాత మూత బడిన థియేటర్లను బంకర్లుగా ఉపయోగించుకోవడం మొదలు పెట్టారు. 1994 నాటికి ఈ థియేటర్లు ఇంటరాగేషన్‌ ‌కేంద్రాలుగా తయారయ్యాయి. ఈ కేంద్రాల్లో యువకులను సైనికులు హింసించేవారని చెప్పుకునే వారు. కొన్ని సినిమా థియేటర్లు ఆస్పత్రులుగా మారాయి. మరి కొన్ని షాపింగ్‌ ‌మాల్స్ అయ్యాయి. పాడుపడిన భవనాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
థియేటర్లను తెరిపించే యత్నాలు విఫలం
1999లో రీగల్‌, ‌నీలమ్‌, ‌బ్రాడ్వే థియేటర్లను ఆ ఏడాది సెప్టెంబర్‌లో తెరిచారు. రీగల్‌ ‌థియేటర్‌పై ఉగ్రవాదులు గ్రెనేడ్‌ ‌దాడి చేశారు ఒక ప్రేక్షకుడు మరణించారు, మరి 12 మంది గాయపడ్డారు.
2005 సెప్టెంబర్‌లో నీలమ్‌ ఒక్కటే శ్రీనగర్‌లో పనిచేస్తూ ఉండేది. ఆ థియేటర్‌ ఎదురు కాల్పులకు వేదిక అయింది. అమీర్‌ ‌ఖాన్‌, ‌మంగల్‌ ‌పాండే నటించిన చిత్రాన్ని వీక్షిస్తున్న 70 మంది ప్రేక్షకులు ఉన్నారు. ఎన్‌ ‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మరణించాడు.
మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా థియేటర్లు తెరిపించేందుకు అనుకూలంగా స్పందించినా, హురియత్‌ ‌కాన్ఫరెన్స్ ‌వ్యతిరేకించింది. ఇ ప్పుడు తగిన సమయం కాదని వాదించింది. కాశ్మీర్‌ ‌లోయలో తిరిగి సినిమా థియేటర్లు తెరిపించే యత్నాలు సాగుతున్నాయి. సినీ అభిమానుల సంఖ్యపెరుగుతోంది. కాశ్మీర్‌ ‌డైలీ చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేసినా కాశ్మీర్‌లో మాత్రం విడుదల చేయలేదు. కాశ్మీర్‌లో కూడా సినిమాలు నిర్మించగలమని రుజువు చేయడానికే నిర్మించాం అని హుస్సేన్‌ ‌ఖాన్‌ ‌చెప్పారు. షేర్‌ ఏ ‌కాశ్మీర్‌ ఇం‌టర్నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌సెంటర్‌ను జమ్ము కాశ్మీర్‌ ‌టూరిజం శాఖ నిర్వహిస్తోంది. ‘ఆ కేంద్రంలో చిత్రాన్ని ప్రదర్శించేందుకు మేం ఎంతో ప్రయత్నించాం. 14 రోజుల పాటు ఈ చిత్రాన్ని ప్రదర్శించాం. ఎంతో మంది ఆనందించారు. యాక్టర్స్ ‌క్రియెటివ్‌ ‌థియేటర్‌(ఎసిటి) కాశ్మీర్‌లో ప్రపంచ సినిమా ఉత్సవాలను నిర్వహించింది. ఆ ఉత్సవాల్లో ఎన్నో కళాఖండాలను ప్రదర్శించారు. టాగోర్‌ ‌హాలులో ఎన్నో విశ్వవిఖ్యాత చిత్రాలను ప్రదర్శించారు. కాశ్మీర్‌ ‌లోయలో తిరిగి థియేటర్లను తెరవాల్సిన అవసరాన్ని నిర్మాతలు గుర్తించాలి. సినిమా థియేటర్లు తెరిస్తే ప్రజలు చిత్రాలను చూసేందుకు వీలుంటుంది’ అని కాశ్మీరీ డైలీ నటుడు మీర్‌ ‌సర్వర్‌ అన్నారు. సాంస్కృతిక ఉత్సవాల పునరుద్ధరణకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించడం లేదనీ, కాశ్మీర్‌లో పెద్ద తెరపై చిత్రాల ప్రదర్శన ఇప్పటికీ సుదూర స్వప్నంగానే మిగిలి పోయిందని హుస్సేన్‌ ‌ఖాన్‌ అన్నారు.
కాశ్మీర్‌లో ఎన్నో కథలు ఉన్నాయి. సుసంపన్నమైన సంస్కృతి వారసత్వం మా సొంతం. ప్రపంచానికి కాశ్మీర్‌ ‌కళ విశిష్టతను చూపించగల సత్తామాకుంది. గడిచిన 30 ఏళ్ళుగా ఎన్నో కథలు వచ్చాయి. వాటిల్లో ఆనందాన్ని కలిగించేవీ ఉన్నాయి. దుఖాన్ని కలిగించేవీ ఉన్నాయి. వాటి గురించి బాహ్య ప్రపంచానికి తెలియజేసే సృజనాత్మక శక్తి మాకుంది అని హుస్సేన్‌ ‌ఖాన్‌ అన్నారు.

‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!