వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

వినియోగంలోకి రాలేదు కాళేశ్వరం నుంచి బొట్టు నీరు కూడా

September 13, 2019

విద్యుత్‌ ‌వినియోగానికి భయపడే నీటిని ఎత్తివేయటంలేదు: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఆర్భాటాలు చేయడం తప్ప అక్కడ జరుగుతున్నది ఏ లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సీఎల్‌పీ సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై టీఆర్‌ఎస్‌ ‌పార్టీ తీరును విమర్శించారు. కాళేశ్వరం వల్లనే రాష్ట్రంలో యూరియా కొరత వచ్చిందని టీఆర్‌ఎస్‌ ‌చెబుతుండటం హాస్యాస్పదమని అన్నారు. విద్యుత్‌ ‌వినియోగానికి భయపడే ప్రభుత్వం నీటిని ఎత్తివేయలేక పోతుందని అన్నారు. ఇప్పటి వరకు 45 టీఎమ్‌సీల నీటిని ఎగువకు పంపే అవకాశం ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం నుంచి బొట్టు నీరు కూడా వినియోగంలోకి రాలేదని, ఎగువకు తరలించేందుకు నీరు అందుబాటులో ఉన్నా నీరంతా వృధాగా కిందకు వదులుతున్నారు. ఇది ఎవరి అవగాహనా రాహిత్యం అని ప్రశ్నించారు. ఎంత నీరు అందుబాటులో ఉందో అంత నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వ శ్రద్ధ కొరవడినందువల్లే ఉపయోగించుకోలేకపోతున్నారు. పైనుంచి ఆదేశాలు లేకనే తాము ఏ చేయలేకపోతున్నామని అధికారులు అంటున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం నీటిని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని జీవన్‌రెడ్డి సూచించారు. సాధారణ వర్షపాతంతో చెరువులు నిండినా జలజాతర అంటున్నారని, గతంలో ఎన్నడూ చెరువులు నిండలేదన్నట్లు టీఆర్‌ఎస్‌ ‌నేతలు వ్యవహరిస్తున్నారని జీవన్‌రెడ్డి మండిపడ్డారు.