Take a fresh look at your lifestyle.

విధ్యార్థులలో ఉల్లాసం,ఉత్తేజం నింపే ఆనందాల హరివిల్లు

తెలంగాణ ప్రభుత్వం,విద్యాశాఖ,సమగ్ర శిక్ష అభియాన్‌ ‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వున్న ప్రాధమిక పాటశాలల విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి,తమ సామర్ధ్యా లను పెంచుకునేలా హరివిల్లు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ పనిచేస్తూ వున్న ప్రాధమిక పాటశాలల ఉపాధ్యాయులకు జూమ్‌ ‌ద్వారా అయిదు రోజుల శిక్షణను ప్రతి రోజు రెండున్నర గంటల పాటు వివిధ అంశాల మీద శిక్షణ పొందిన అనుభవం గల రిసోర్స్ ‌పర్సన్ల ద్వార అందిస్తూ వున్నారు.ఉపాధ్యాయులు చురుకుగా ఈ హరి విల్లు కార్యక్రమంలో పాల్గొని ఆనందంగా,ఉల్లాసంగా అన్ని విషయాలు పూర్తిగా నేర్చుకుంటూ వున్నారు.వచ్చే విద్యా సంవస్త్సరము నుండి హరివిల్లు ప్రారంభంఅవుతూ వుంది. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల అక్షర పరిజ్ఞానం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో విద్యాశాఖ చేపట్టిన పలు అంతర్గత సర్వేల్లో ఈ విషయం స్పష్టమైంది. పుస్తకాల్లో పాఠాలకు అర్థం చెప్పి ప్రశ్నలకు సమాధానాలు రాయించటం వరకే పరిమితమవుతున్న బోధన ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడంలేదు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో నూతన కార్యక్రమం అమలు చేసేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు, ఏఎంవో లు ప్రారంభించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కొందరు ఉపాధ్యాయులకు జూమ్‌ ‌మీటింగ్‌ ‌ద్వారా శిక్షణ ప్రారంభించారు.గుర్తించిన జిల్లాలలో  మొత్తం ఉపాధ్యాయులు  ఈ శిక్షణలో .భాగస్వాములు అవుతూనే వున్నారు.ఈ కార్యక్రమం అమలు కోసం మండలానికి ఇద్దరు ఉపాధ్యాయులను రిసోర్స్‌పర్సన్స్‌గా ఎంపిక చేసి    అన్ని జిల్లాల లో మొత్తం వరకు ఐదు రోజులు జూమ్‌ ‌మీట్‌ ‌ద్వారా రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఈనెల 6 నుంచి 10 వరకు, 15 నుంచి 20 వరకు రెండు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు.ప్రాథమిక స్థాయిలోనే గట్టి పునాది వేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. నేపాల్‌, ‌న్యూదిల్లీ వంటి ప్రాంతాల్లో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలను ఇక్కడ కూడా అమలు చేయనున్నారు. బాల్యంలోనే పాఠ్యపుస్తకాలతోపాటు ఉన్నత విలువలు పెంపొందించి కథలు, కృత్యాల ద్వారా నేర్చుకుంటూ విలువలు సాధించేలా అభ్యసన చేయిస్తారు. విద్యార్థుల్లో మానసికోల్లాసాన్ని, సృజనాత్మకశక్తిని పెంపొందిస్తారు.
బోధన ఇలా…
స్థాయి ఒకటి, స్థాయి రెండు పుస్తకాలు
ఉంటాయి.
స్థాయి ఒకటి 1, 2 తరగతులకు, స్థాయి-2 పుస్తకం 3, 4, 5 తరగతులకు రూపొందించారు.
సోమవారం.. మానసిక సంసిద్ధత
మంగళ, బుధవారాలు.. కథలు చెప్పడం
గురు, శుక్రవారాలు.. సమన్వయ కృత్యాలు
శనివారం.. భావవ్యక్తీరణ తదితర అంశాలపై .

ఈ కార్యక్రమంలో విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణానికి, విలువలతో కూడిన ‘ఆనందదాయక’ విద్యాబోధనే మార్గమని ప్రభుత్వం గుర్తించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వినూత్నంగా ‘హరివిల్లు’ జాయ్‌ఫుల్‌ ‌లెర్నింగ్‌ ‌కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాలలు తమ అనుభవాలను నలుగురితో పంచుకునేలా రూపకల్పన చేశారు.
చిన్నారులకు ఎంతో ఆహ్లాదకరం.జయశంకర భూపాలపల్లి జిల్లా లో ప్రస్తుతం జరుగుతున్న హరివిల్లు కార్యక్రమం లో ప్రాధమిక పాటశాల ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొని విజయవంతం చేస్తూ వున్నారు.జిల్లా విద్యాధికారి,మానిటరింగ్‌ అధికారి మనోహర్‌ ‌నాయక్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్ష న చేస్తూ  చక్కని సలహాలు,సూచనలు చేస్తూ వున్నారు.జై హరివిల్లు.

కామిడి సతీష్‌ ‌రెడ్డీ జడలపేట జయశంకర భూపాలపల్లి జిల్లా.9848445134

Leave a Reply