వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

విద్యుత్‌ ‌శాఖ అప్పు.. 34 వేల కోట్లు.

September 3, 2019

  • తెలంగాణ ప్రజలపై భారం – ఇంకా పూర్తికాని ‘కాళేశ్వరం’.
  • కేసీఆర్‌ అసమర్థుడన్న ఎంపీ రేవంత్‌రెడ్డి.
ఫోటో: ‌కుటుంబ సభ్యులతో కలసి ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలసిన ఎంపి రేవంత్‌ ‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించి వివిధ శాఖలకు ర్యాంకులు ఇచ్చారని, విద్యుత్‌ ‌శాఖ 34 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 20 శాఖల పనితీరు సమీక్షించి 11 వ ర్యాంక్‌ ‌విద్యుత్‌ ‌శాఖకు ఇచ్చారని కంగ్రెస్‌ ఎం‌పి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. సాగునీటి శాఖకు 8వ ర్యాంక్‌, ‌సీఎస్‌ ఐటీ శాఖకు 18వ ర్యాంక్‌ ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్‌, ‌కేటీఆర్‌ల శాఖల పని తీరు ఎంత దారుణంగా ఉందో సీఎస్‌ ఇచ్చిన ర్యాంకులు చూస్తే అర్థం అవుతుందని..సాగునీటిలో కేసీఆర్‌ ‌పూర్తిగా విఫలమయ్యారని, కేటీఆర్‌ ఇన్నాళ్లు అవార్డులు, రివార్డులు కొనుక్కొని పబ్బం గడుపుతున్నారని ఈఆర్సీని నియమిస్తే విద్యుత్‌ ‌శాఖలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుందని ఈఆర్సీని నియమించడం లేదని ఆరోపించారు. గతంలో ఆర్ధిక శాఖ మంత్రిగా ఈటల నామమాత్రంగానే ఉన్నారని…. అన్ని విషయాలను కేసీఆరే చూసుకున్నారని విమర్శించారు. కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ఎం‌త అసమర్థులో వాళ్లు నియమించుకున్న  సీఎస్‌ ఎస్‌కె జోషి ఇచ్చిన ర్యాంకులు చెబుతున్నాయని..కేసీఆర్‌ ‌కేటీఆర్‌, ‌తమ సొంత శాఖల నిర్వహణలో వైఫల్యం చెందారని రాష్ట్రానికి వేలకోట్లు అప్పు తెచ్చి తెలంగాణ ప్రజల మీద భారం వేస్తున్నారని రేవంత్‌  ‌ధ్వజమెత్తారు. కోటి ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పి కేసీఆర్‌ ‌తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, ఇప్పటివరకు కాలేశ్వరం పూర్తి కాలేదని ఇక మొదటి మూడు ర్యాంక్‌లలో కేసీఆర్‌, ‌కేటీఆర్‌కు సంబంధించిన శాఖలు ఒక్కటీ లేవని దుయ్యబట్టారు. 08,11,18 ఇలాంటి ర్యాంకులు రావడం అంటే ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుందని తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎక్కడా అమలు జరగడం లేదన్నారు. బలహీనవర్గాలను కేసీఆర్‌ ‌పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, శాఖల నిర్వహణలో విఫలం చెందిన కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ఇద్దరు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. విద్యుత్‌ ‌శాఖలో జరిగినటువంటి అవినీతిపై చర్యలు తీసుకోవాలని ఇక గతంలో ఈటెల రాజేందర్‌ ‌నామమాత్ర ఆర్థిక మంత్రిగా మాత్రమే పని చేశారని…మిగితా వ్యవహారాలు అన్ని కేసీఆర్‌ ‌చూసుకున్నారని ఆరోపించారు.