వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

విద్యాహక్కు చట్టం-2009 అమలు ఎక్కడ?

December 5, 2019

1882లో హంటర్‌ ‌కమిషన్‌కు మహాత్మ జ్యోతిరావు పూలే సమర్పించిన మెమోరాండంతో మొదలైన విద్యకు పోరాటంకు 2009 ఆగస్టులో విద్యాహక్కు చట్టంను రాష్ట్రపతి ఆమోదం పొందడం జరిగింది.ఈ విద్యాహక్కు చట్టం ముఖ్య ఉద్దేశం ఉచిత ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు.మనకు 11 ప్రాథమిక విధులు ఉన్నాయి.2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పిల్లలను విద్యావంతులను చేయాలనే ఆలోచనతో 11వ ప్రాథమిక హక్కుగా విద్యా హక్కును చేర్చడం జరిగింది. 2005 నుంచి విద్యా హక్కు బిల్లును పార్లమెంటులో చర్చించడం అందరికీ తెలిసిందే. 2009 జూలై 20న రాజ్యసభలో, అదే సంవత్సరం 2009 ఆగస్టు 4న విద్యా హక్కు బిల్లును లోకసభలో ఆమోదించడం జరిగింది. ఇందులో సెక్షన్‌ 3 ‌ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని తెలియజేసింది. అంతే కాకుండా అందులో ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఉచిత విద్యను అందించాలని తెలియజేసింది. 1 నుంచి 5వ తరగతి వరకు పరిసర ప్రాంతానికి ఒక కిలోమీటరు దూరంలో ఉండాలని, అదేకాకుండా 8వ తరగతి వరకు విద్యార్థులకు ప్రతి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక పాఠశాల కచ్చితంగా ఉండాలని తెలియజేసింది. కానీ మన రాష్ట్రంలోని పరిస్థితి మారిపోయే అవకాశం ఉంది.అంటే ప్రతి 5 కిలోమీటరు దూరములో ఒక పాఠశాల ఉండాలనే ఆలోచనా విధానం సరైయింది కాదు. ఈ విషయాన్నీ బట్టి చూస్తే విద్యా హక్కు చట్టం అమలు కావడంలేదనేది కళ్లకు కట్టినట్లు కనబడుతుంది.సెక్షన్‌ 12 ‌ప్రకారంగా ప్రైవేటు పాఠశాలలో బలహీనవర్గాలు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి 1వ తరగతిలో 25% సీట్లను కేటాయించాలి. వారు ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసే వరకు ఉచిత విద్యను అందించాల్సిన బాధ్యత ఆ ప్రైవేట్‌ ‌పాఠశాలకు ఉంది. కానీ అది కూడా అమలు కాకపోవడం గమనార్హం! మరొక విషయం ఏమిటంటే అన్ని పాఠశాలలో కమిటీలను ఏర్పాటు చేయాలి, అందులో 75% తల్లిదండ్రులు, 25% ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, పిల్లలు ఇతరులు సభ్యులుగా ఉండాలలి, అదే కాకుండా 50 శాతం మహిళలే ఉండాలని సెక్షన్‌ 12 ‌తెలియజేసింది. సెక్షన్‌ 27 ‌ప్రకారంగా విద్యేతర పనులకు టీచర్లను పంపడం నిషేధం అని తెలియజేసింది. అంటే అధ్యాపకులను అడ్మిషన్ల పేరుతో బయటకి పంపకుండా వుండాలని అదే కాకుండా అధ్యాపకులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి మంచి మేధావులుగా తీర్చిదిద్దే విధంగా ఉపయోగించుకోవాలని తెలియజేసింది. అంతేకాకుండా స్కూల్‌లో ఉన్నటువంటి నిబంధనలు కూడా విద్యా హక్కు చట్టం 2009లో పొందుపరిచారు. అందులో కొన్ని విషయాలు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 60 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని. 61 నుంచి 90 మంది విద్యార్థులు ముగ్గురు ఉపాధ్యాయులు, 90 నుంచి 120 విద్యార్థులు ఉంటే నలుగురు ఉపాధ్యాయులు ఉండాలని, 120 నుంచి 150 మంది విద్యార్థులు ఉంటే అయిదుగురు అధ్యాపకులు ఉండాలని, 150 నుంచి 200 మంది విద్యార్థులు ఉంటే 5 ఉపాధ్యాయులు మరియు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలని తెలియజేసింది. అంతేకాకుండా 6తరగతి నుంచి 8 తరగతి వరకు ప్రతి ఒక్కరికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని తెలియజేసింది. అనగా సైన్స్, ‌గణితం, సాంఘిక, ప్రతి ఒక్క సబ్జెక్టుకు ఉపాధ్యాయులు ఉండాలని ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలని పొందుపరచడం జరిగింది. అదే విధంగా కళ మరియు వ్యాయామ ఉపాధ్యాయులుగా ఉండాలని ఉంది. ఉపాధ్యాయులకు ప్రత్యేక గది కేటాయించాలి. ప్రధాన ఉపాధ్యాయునికి ప్రత్యేకమైన గది ఉండాలని తెలియజేశారు. అంతే కాకుండా పిల్లలకు తగినంత పరిశుభ్రమైన తాగునీటి వసతి కల్పించాలి. కానీ ప్రైవేట్‌ ‌పాఠశాలలో విద్యార్థులకు మంచినీటి వసతి కల్పించకుండ విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసి మంచి నీటి బాటిల్‌ ‌తీసుకుని రావాలని హుకూం జరిచేస్తున్నారు. అంటే పిల్లలకు పాఠశాలలో నీటి వసతి ఏ విధంగా పొందుపర్చడంలేదో విషయం మనకు అర్థమవుతుంది. అదే విధంగా ప్రతి పాఠశాలలో గ్రంథాలయం ఉండాలని తెలియజేస్తే ఏ ఒక్క పాఠశాలలో కూడ గ్రంధాలయం లేకపోవడం గమనార్హం! ఒకవేళ గ్రంథాలయాలు ఉంటే ఆ గ్రంథాలయంలో కథల పుస్తకాలు, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు అన్ని కూడా ఆ పాఠశాలలో పొందుపరచాలి. అది విద్యార్థుల మేథో సంపత్తి పెంపొందించే విధంగా ఉపయోగపడుతుంది.
సంతోష్‌ ‌కుమార్‌,
‌తెలంగాణ స్కూల్స్ ‌టెక్నికల్‌ ‌కాలేజెస్‌ ఎం‌ప్లాయిస్‌ అసోసియేషన్‌