Take a fresh look at your lifestyle.

విద్యాసాగర్‌ ‌విగ్రహ ధ్వంసం ఘటనతో బీజేపీకి నష్టమే

విద్యాసాగర్‌ ‌విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు బీజేపీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు. ట్విట్టర్‌లో బీజేపీ నాయకులు విద్యాసాగర్‌ ‌గురించి అవాకులూ చవాకులూ పేలారు . టిఎంసి నుంచి సేవ్‌ ‌డెమోక్రసీ పేరిట ఢిల్లీలో బీజేపీ నాయకులు ప్రదర్శన నిర్వహించారం టే వారికి బెంగాలీ సంస్కృతి ఏపాటి అర్ధమయిందో తెలుస్తోంది. బెంగాల్‌లో బీజేపీకి మూలాలు లేవు. అయినప్పటికీ ధన బలాన్ని ఉపయోగించి బెంగాల్‌లో చోటు సంపాదించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం కాలేజి రోడ్డులో జరిగిన సంఘటనతో విఫలమైంది. బెంగాల్‌లో ఈశ్వర చంద్ర విగ్రహాం ధ్వంసం ప్రభావం తెలుసుకోలేకపోయారు. బెంగాలీల మనసులు ఎంత గాయపడ్డాయో తెలుసుకోలేకపోయారు.

కోల్‌కతాలో గత మంగళవారంనాడు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ ‌షా రోడ్‌ ‌షో సందర్భంగా ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ ‌బస్ట్ ‌విగ్రహాం దుండగుల దాడిలో ధ్వంసమైంది. దీనిపై బీజేపీ, ఆ పార్టీ అనుచరుల ప్రతిస్పందన చూస్తే ఆ పార్టీ వారికి బెంగాలీ సంస్కృతి అర్థమైనట్టు లేదు.

విద్యాసాగర్‌ అవిభక్త మిడ్నపూర్‌ ‌జిల్లాలో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అయినప్పటికీ ఆయన బాల్యం నుంచి సహజీవనం, సహనం సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్నారు. మహిళల హక్కుల కోసం జీవితాంతం పోరాడారు. జీవితపు విలువలను ఆకళింపు చేసుకున్నారు. బెంగాల్‌లో మహిళా విద్యా వ్యాప్తి కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. బెంగాల్‌ ‌పేరు చెప్పగానే ముందు గుర్తు కొచ్చేది ఈశ్వర చంద్ర విద్యా సాగర్‌. ‌గత మంగళవారం కోల్‌కతాలో విద్యాసాగర్‌ ‌ప్రతిమను దుండగులు కర్రలు, రాడ్‌లతో బద్దలు కొట్టినప్పుడు మాకందరికీ చెప్పలేనంత బాధ కలిగింది. ఆయన హిందువే అయినప్పటికీ హిందుత్వ కాదు. హిందు మతాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నవారు. హిందుత్వ విధానాలకు ఆయన దూరం. ఆయన విగ్రహాన్ని పడగొట్టడం అంటే సంస్కృతికీ, నాగరికతకూ మధ్య ఘర్షణ వంటిది. విద్యాసాగర్‌ ఎం‌త గొప్పవాడో తెలుసుకుందాం.. ఆయన తన తల్లిని చేరుకోవడానికి ఉధృతంగా ఉన్న హుగ్లీ నదిని ఈదుకుని మరీ వెళ్ళాడు. ఆయన వీధుల్లో కిరోసిన్‌ ‌దీపాల నుంచి వచ్చే వెలుతురులో నేల మీద కూర్చుని చదువుకున్నాడు. విజ్ఞాన తృష్ణ ఆయనను అంత గొప్పవాణ్ణి చేసింది. ఆయన ఎంత నిరాడంబరుడంటే ఒక విదేశీయుడు ఆయనను కూలీ అనుకుని పొరపడి లగేజ్‌ ‌తీసుకుని రమ్మంటే తీసుకుని వెళ్ళాడు. మహిళా విద్యా వ్యాప్తి కోసం ఆయన చాలా కృషి చేశారు. చెప్పింది చేసిన మహాత్ముడు. వితంతు వివాహాలను ఆయన ప్రోత్సహించారు.. తన కుమారునికి వితంతువును ఇచ్చి వివాహం చేశారు. బ్రహ్మ సమాజ్‌ ‌హక్కులను సమర్థించి సంస్కృత గ్రంథాలను విశ్లేషించారు. ఆయన సనాతన ధర్మాన్ని అనుసరించినప్పటికీ బ్రహ్మ సమాజ్‌ ‌మతాన్ని గౌరవించడం విశేషం.

మైఖేల్‌ ‌మధుసూదన్‌ ‌దత్‌ అనే గొప్ప బెంగాలీ కవి, సామాజిక సంస్కర్త కష్టాల్లో ఉన్నప్పుడు ఈశ్వర చంద్ర ఆయనను ఆదుకున్నారు. పేదరికం నుంచి బయటపడేందుకు తోడ్పడ్డారు. మధుసూదన్‌ ‌దత్‌ ‌క్రైస్తవాన్ని తీసుకున్నారు. మద్యానికి అలవాటు పడ్డారు. ఆంగ్లంలో గేయాలు రాసేవారు. గొడ్డు మాంసం తినేవాడు. ఆయన మేఘనాథ బద్‌ ‌కావ్యాన్ని రాశారు. రావణాసురుని కుమారుడు మేఘనాథుని గురించి రాశారు. అలాంటివానికి ఈశ్వరచంద్ర తోడ్పాటును అందించారంటే ఆయన లోని పరమత సహనం ఎటువంటిదో అర్ధం అవుతుంది. ఈశ్వర చంద్ర లౌకికవాద స్ఫూర్తికి అది నిదర్శనం. సనాతన ధర్మాన్ని ఆధునిక యుగానికి అన్వయించుకునే సమయంలో ఘర్షణ ఏర్పడింది. ఆనాటి సమాజానికి ఈశ్వర్‌ ‌చంద్ర ప్రతినిధి. బెంగాల్‌లో ర్యాలీలు, ఊరేగింపులు, నిరసనలు, ప్రకటనలు కొత్త కాదు. కానీ, మహా పురుషుల విగ్రహాలను ధ్వంసం చేసే సంస్కృతి ఇప్పుడు కొత్తగా చోటు చేసుకుంది.

తృణమూల్‌ ‌కాంగ్రెస్‌, ‌కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇం‌డియా (మార్క్సిస్టు) నేతృత్వంలోని వామపక్షాలు తరచూ ర్యాలీలు నిర్వహిస్తుంటాయి. సిపిఎం ర్యాలీల్లో ఆ పార్టీ అగ్రనాయకులు ప్రకాష్‌ ‌కరత్‌, ‌సీతారామ్‌ ‌యేచూరి తదితరలు ర్యాలీల్లో పాల్గొంటారు. అవన్నీ ఆయా పార్టీల నిరసనలను వ్యక్తం చేయడం వరకే జరిగాయి. జరుగుతున్నాయి. కానీ, ఈశ్వర చంద్ర విగ్రహం విధ్వంసంపై ఈ పార్టీలన్నీ ఏకమై తమ నిరసనను తెలిపాయి. బీజేపీకి వ్యతిరేకంగా ర్యాలీలు తీశాయి. టిఎంసి ఎంపీ డెరక్‌ ఒబరిన్‌ ‌తమ పార్టీ నాయకులతో కలిసి ఈశ్వర చంద్ర ఫోటోలతో ప్రదర్శనను కోల్‌ ‌కత్తాలో నిర్వహించారు. విద్యాసాగర్‌ ‌విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు బీజేపీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు. ట్విట్టర్‌లో బీజేపీ నాయకులు విద్యాసాగర్‌ ‌గురించి అవాకులూ చవాకులూ పేలారు . టిఎంసి నుంచి సేవ్‌ ‌డెమోక్రసీ పేరిట ఢిల్లీలో బీజేపీ నాయకులు ప్రదర్శన నిర్వహించారం టే వారికి బెంగాలీ సంస్కృతి ఏపాటి అర్ధమయిందో తెలుస్తోంది. బెంగాల్‌లో బీజేపీకి మూలాలు లేవు. అయినప్పటికీ ధన బలాన్ని ఉపయోగించి బెంగాల్‌లో చోటు సంపాదించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం కాలేజి రోడ్డులో జరిగిన సంఘటనతో విఫలమైంది. బెంగాల్‌లో ఈశ్వర చంద్ర విగ్రహాం ధ్వంసం ప్రభావం తెలుసుకోలేకపోయారు. బెంగాలీల మనసులు ఎంత గాయపడ్డాయో తెలుసుకోలేకపోయారు. అందుకే ఈ సంఘటన పట్ల చేయాల్సిన స్థాయిలో నిరసన తెలియజేయలేదు. అమిత్‌ ‌షా కానీ, ఇతర నాయకులు కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో మాదిరిగానే ప్రసంగించారు తప్ప, బెంగాలీ సంస్కృతికి జరిగిన అవమానాన్ని గుర్తించి సారీ చెప్పే ప్రయత్నం చేయలేదు. మరో వంక తృణమూల్‌ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈశ్వర చంద్ర విగ్రహ ధ్వంసం పరిణామాల గురించి పూర్తిగా తెలుసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళి విగ్రహం కూల్చిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. మరో వంక మార్క్సిస్టు పార్టీ కూడా ఈ విగ్రహ ధ్వంస చర్యలను ఖండిస్తూ ర్యాలీని నిర్వహించింది.

విగ్రహాన్ని ఎవరు పడగొట్టారు అనే దానిపై కోల్‌ ‌కతాలో కథనాలు పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్‌ ‌వినిపిస్తోంది. ఈ విగ్రహాన్ని పడగొట్టిన ఆందోళన కారులు సరిహద్దుల నుంచి లేదా ఉత్తర ప్రదేశ్‌ ‌నుంచి వచ్చి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన ఇప్పుడు చోటు చేసుకోవడం వల్ల రాజకీయంగా బీజేపీకి ఎక్కువ నష్టం కలుగుతుంది. ఉత్తర కోల్‌ ‌కతా, జాదవ్‌ ‌పూర్‌, ‌దక్షిణ కోల్‌ ‌కతా నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలన్న ఆ పార్టీ ఆకాంక్ష నెరవేరకపోవచ్చు. ఈ ఘటనతో బీజేపీ ఆత్మరక్షణలో పడింది. ప్రస్తుతానికి తగ్గి ఉండాలని ఆ పార్టీ భావిస్తోంది. తృణమూల్‌ను సవాల్‌ ‌చేసే అవకాశాలు చేజారిపోతాయేమోనన్న బెదురు ఆ పార్టీ నాయకులలో కనిపిస్తోంది.

– ‘ద వైర్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!