Take a fresh look at your lifestyle.

విజయనగరం మున్సిపల్‌ ‌కార్యాలయంలో కరోనా కలకలం

పరీక్షల కోసం డ్యూటీకి డుమ్మా కొట్టిన ఉద్యోగులు
విజయనగరం మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. శుక్రవారంతో కార్యాలయంలోని టౌన్‌ ‌ప్లానింగ్‌, ‌రెవెన్యూ, ప్రజారోగ్య శాఖలో నలుగురు ఉద్యోగులకు కరోనా రావడంతో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. శనివారం కార్యాలయానికి రావల్సిన ఉద్యోగులలో చాలామంది గైర్హాజరయ్యారు. కరోనా పరీక్షలను చేయించుకోవడానికి ఉద్యోగులంతా క్యూ కట్టారు. ఇంకా ఎంతమందికి కరోనా సోకిందో పరీక్ష ఫలితాలలో తేలనుంది. జిల్లాలో కూడా 2 వ దశలో కరోనా కేసులు భారీగా నమోదు కానుండటంతో అక్కడి ప్రజల్లో భయం నెలకొంది.

Leave a Reply