వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

వార్డుల పునర్విభజనకు గ్రీన్‌ ‌సిగ్నల్‌

December 3, 2019

ఈ ‌నెల 16 వరకు వోటర్ల అభ్యంతరాలు స్వీకరణ
‌రాష్ట్రంలో వార్డుల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. ఈ దిశగా ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక శాఖ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లన్నింటినీ కొట్టివేసిన హైకోర్టు వార్డుల పునర్విభజన సహా ఇతర ప్రక్రియకు మళ్లీ షెడ్యూల్‌ ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. అందుకు అనుగుణంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ ‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వార్డుల పునర్విభజనకు హైకోర్టు సూచనల మేరకు…ఏడు రోజుల పాటు అభ్యంతరాలకు అవకాశం ఇచ్చి మరో ఏడు రోజుల పాటు వాటి పరిష్కారానికి గడువు విధిస్తూ షెడ్యూల్‌ ‌ప్రకటించారు. దీని ప్రకారం…రాష్ట్రంలోని మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 నగరపాలక సంస్థలలో వార్డుల పునర్విభజన ముసాయిదాను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనను బుధవారం అన్ని వార్తా పత్రికలలో ప్రచురిస్తారు. ఇందులో భాగంగా ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ముసాయిదాపై అభిప్రాయాలు, సూచనలను స్వీకరిస్తారు. సాధారణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలు, వినతులను పరిష్కరించడానికి ఈనెల 16 వరకు గడువు విధించారు. స్థానిక కౌన్సిల్‌ ‌లేదా ప్రత్యేక అధికారులు వీటిని ఆమోదించిన అనంతరం ఈనెల 17న పురపాలక వార్డుల పునర్విభజన తుది జాబితాను ప్రకటిస్తారు.