Take a fresh look at your lifestyle.

వాగ్దానాలు, మాటలగారడీ.. అన్ని రంగాల్లో విఫలం

టీఆర్‌ఎస్‌ ఏడాది పాలనపై విపక్షాల ధ్వజం
ఆత్మహత్మలు, అత్యాచారాలు, అప్పులు,
ఇదీ టీఆర్‌ఎస్‌ ఏడాది పాలన
రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ‌పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని టీ పీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. ఈ ఏడాదంతా ఆత్మహత్మలు, అత్యాచారాలు, అప్పులు, ఆందోళనలతోనే గడచిందని పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పిదాల కారణంగా 26 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా పాలనను విశ్లేషిస్తూ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి శుక్రవారం రాజకీయ విమర్శలతో దాడి చేశారు. తెలంగాణలో ఈ ఏడాది అశాంతి, అవినీతి పెరిగిపోయాయని పేర్కొన్నారు. కేసీఆర్‌ అసమర్థ ఆర్థిక విధానాలతో రాష్ట్రం దివాలా తీసిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ అంటున్నారని ఎద్దేవా చేశారు. రూ. 17 వేల కోట్ల అదనపు ఆదాయంతో ధనిక తెలంగాణను కేసీఆర్‌ ‌చేతిలో ప్రజల చేతిలో అప్పుల చిప్ప పెట్టారని ధ్వజమెత్తారు. రూ. 3 )క్షల కోట్లు అప్పులు చేసినా కూడా ఏ ఒక్క ఉత్పాదక రంగాన్నీ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కమీషన్లు దండుకోవడానికే కాళేశ్వరం, మిషన్‌ ‌భగీరథ పథకాలకు లక్షల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. కొత్త అసెంబ్లీ, సచివాలయం కట్టాలని అనుకున్నప్పుడు ఆర్థిక క్రమశిక్షణ ఎందుకు గుర్తుకురాలేదని ప్రశ్నించారు. మద్యం అమ్మకాలను రూ. 22 వేల కోట్లకు పెంచుకోవడంలో మాత్రమే ప్రభుత్వం ప్రగతి సాధించిందని ఎద్దేవా చేశారు. మద్మాన్ని నియంత్రించాలని దీని వల్లనే తెలంగాణలో నేరాలు పెరిగిపోతున్నాయని అన్నారు.రైతు బంధు ఇప్పటికీ ఇంకా సగం మందికి రాలేదనీ, ఖరీఫ్‌ ‌డబ్బులు రైతులకు ఇంకా పూర్తిగా అందలేదన్నారు. రుణ మాఫీ అమలు కాక, కొత్త రుణాలు దొరకక 36 లక్షల మంది రైతులు వడ్డీలు పెరిగిపోయి ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.రైతు బంధు పథకం మొదటి విడత అందలేదనీ, ఉద్యోగుల రిటైర్మంట్‌ ‌వయసు పెంచుతామన్న హామీని గాలికి వదిలేశారనీ, ఆరోగ్యశ్రీ పథకం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌పథకాలకు కూడా నిధులు కరువయ్యాయని ఈ సందర్భంగా ఉత్తమ్‌ ‌విమర్శించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy