Take a fresh look at your lifestyle.

వలస కార్మికులపై లాఠీ చార్జి

అర్బన్‌ ‌జిల్లా పని చేస్తున్న వలస కార్మికులపై గురువారం పోలీసులు లాఠీ చార్జి చేశారు. వివిధ రంగాలలో పని చేస్తున్న వలస కార్మికులు తమ తమ స్వస్థలాలకు వెళ్లడానికి హనుమకొండ నడిబొడ్డులోని హంటర్‌ ‌రోడ్‌ ‌లోని విష్ణుప్రియ గార్డెన్‌ ‌లో పేరు నమోదు కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందరూ ఒకేసారి తమ స్వస్థలాలకు వెళ్ళేందుకు పేరు నమోదు చేసుకోవడం కోసం అధికా రులపై దూసుకువచ్చారు.

అయితే వారిని నియంత్రించడంలో భాగంగా పోలీసులు ఒకసారిగా లాఠీ చార్జి చేశారు. ఈ సంఘటనలో పలువురికి లాఠీ దెబ్బలు తగిలాయి. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగాపెద్ద ఎత్తున వలస కార్మికులు విష్ణుప్రియ గార్డెన్‌కు వచ్చారని,   సామాజిక దూరం పాటించడం లేదని పేర్కొన్నారు.దీంతోవారిని నియం త్రించేందుకు లాఠీచార్జి చేయవలసి వచ్చిందని పోలీస్‌ అధికారులు అంటున్నారు.

Leave a Reply