:రాజకీయ ఖైదీలందరిని తక్షణమే విడుదల చేయాలని ఎఐకెఎంఎస్ రాష్ట్ర నాయకులు డేవిడ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక చండ్రపుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో రచయిత, కవి వరవరరావు, ప్రొఫెసర్ సాయి బాబను తక్షణమే విడదుల చేయాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విప్లవకారులు, ప్రజస్వామిక వాదులపై ఉద్దేశపూర్వకంగా, అక్రమంగా దేశద్రోహుల కేసులను నమోదు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
గత మూడు నెలలుగా కరోనా వైరస్ ప్రభావంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అదే విధంగా వరవరరావు, సాయిబాబాలు ఉంటున్న జైళ్లల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని గుర్తుచేశారు. రాజకీయ ఖైదీలందరిని పెరోల్‌పై, కానీబెయిల్‌పై విడుదల చేయాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంట నాగయ్య, కనుకుంట్ల సైదులు, బొడ్డు శంకర్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.