వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

వధువు దొరక్క కానిస్టేబుల్‌ ‌రాజీనామా

September 13, 2019

పోలీసు కానిస్టేబుల్‌కు పిల్లనెవరిస్తారు. పగలు, రాత్రి తేడా లేకుండా విధులకు హాజరవుతూ ఉండాలి. ఇంటిపట్టున పది నిమిషాలైనా ఉండటానికి వీలుండదు. అందుకే, హైదరాబాద్‌లో సిద్ధాంతి ప్రతాప్‌ అనే కానిస్టేబుల్‌కి ఎంత వెదికినా తగిన వధువు దొరకడం లేదు. హైదరాబాద్‌ ‌చార్మినార్‌ ‌పోలీసు స్టషన్‌ ‌లో కానిస్టేబుల్‌ ‌గా పని చేస్తున్న సిద్ధాంతి ప్రతాప్‌ అనే 29 ఏళ్ళ యువ కానిస్టేబుల్‌ ఏజగి నుంచి తగిన వధువు కోసం వెదుకుతున్నా కనిపించకపోవడంతో ఉద్యోగం మానేయాలనే తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. మ్యారేజ్‌ ‌బ్యూరోలకు వెళ్ళి వధువుల జాబితా సంపాదించి ఒక్కొక్కరినీ సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది., పైగా పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగం లో ఉన్న వ్యక్తిని పెళ్ళాడేందుకు ఏ వధువూ అంగీకారం తెలపడం లేదు. దాంతో విసుగెత్తిన ప్రతాప్‌ ‌గత శనివారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన నగర పోలీసు కమిషనర్‌ ‌కు తన రాజీనామా లేఖను పంపారన్న వార్త వైరల్‌ అయింది. ప్రతాప్‌ ఇం‌జనీరింగ్‌ ‌పట్టభద్రుడు. తగిన ఉద్యోగం దొరక్క పోవడంతో 2014లో ఆయన పోలీసు శాఖలో చేరారు. అయితే, పోలీసు శాఖలో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎటువంటి ప్రమోషన్లు, ప్రోత్సాహకాలు ఉండవు. అంతేకాక, పగలనక, రాత్రనక ఎప్పుడు రమ్మంటే అప్పుడు విధులకు వెళ్తూ ఉండాలి, ఎంతకీ వధువులు ఎవరూ దొరక్క పోవడంతో ఆయన తన బంధువులను కారణం అడిగారు. పోలీసు కానిస్టేబుల్‌ ‌పోస్టుకు ఏ విధమైన ప్రోత్సాహం ఉండదు, పైగా పని గంటలు ఎక్కువ. ఎన్ని సంవత్సరాలు పని చేసినా కానిస్టేబిల్‌ ‌గానే మిగిలి పోవాలి. వధువులు ఈ విషయాలన్నీ ప్రతాప్‌ ‌ముందుకు తెచ్చారు దాంతో ఆయన ఆలోచనలో పడ్డాడు. పెళ్ళి చేసుకునేందుకు ఉద్యోగం వదులు కోక తప్పదన్న నిర్ణయానికి వచ్చారు పోలీసు కానిస్టేబిల్‌ ‌గా 35- 40 ఏ ళ్ళ నుంచి పని చేస్తున్నవారు ఉన్నారు. ఎవరికీ ప్రమోషన్లు లేవు. అందుకే ఆయన తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం వదులు కోవద్దని తల్లితండ్రులు ఎన్నో విధాలచెప్పిచూశారట.. అయినప్పటికీ ఆయన తన నిర్ణయం మార్చుకోలేదు. గ్రామీణ ప్రాంతం నుంచి వధువును ఎం పిక చేసుకోవచ్చు. కానీ, తాను నగరంలోనే పెరగడం వల్ల నగరంలో యువతినే పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. అయితే, ఆ కానిస్టేబిల్‌ ‌రాజీనామా లేఖను నగర పోలీసు కమిషనర్‌ అం‌జనీ కుమార్‌ ‌తిరస్క రించకుండా, ఆ కానిస్టేబుల్‌ ‌కి కౌన్సెలింగ్‌ ఇప్పించండి అని కింది అధికారాలకు సూచించారట. కమిషనర్‌ ‌గారు ఇచ్చిన సలహాను పాటించేందుకు ప్రయత్నిస్తానని ఆ కానిస్టేబుల్‌ ‌చెప్పారు.